నెంబర్ 1 నుండి 17 స్థానానికి దిగజారిన ఆపిల్

గత కొంతకాలంగా భారత్‌లో ఐఫోన్‌ విక్రయాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. US-based business publication Fast Company 2018లో 17 యాన్యువల్ మీటింగ్ లో 50 Most Innovative Companies list for 2019 రిలీజ్ చేసింది

|

గత కొంతకాలంగా భారత్‌లో ఐఫోన్‌ విక్రయాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. US-based business publication Fast Company 2018లో 17 యాన్యువల్ మీటింగ్ లో 50 Most Innovative Companies list for 2019 రిలీజ్ చేసింది. ఇందులో ఆపిల్ తన స్థానాన్ని చేజార్చుకుంది. గతేడాది ఆపిల్ కంపెనీ నుండి వచ్చిన AirPods, Augmented Reality (AR) and iPhone Xలు కూడా ఆపిల్ కంపెనీని ఆదుకోలేకపోయాయి.

నంబర్ వన్ ర్యాంకు దిగజార్చుకున్న ఆపిల్

కాగా ఆపిల్ కంపెనీ పటిష్టమైన సెక్యూరిటీ ఫీచర్ A12 Bionic" processorని iPhone XS, iPhone XR modelsలో పొందుపరిచిన సంగతి విదితమే. అయినప్పటికీ కంపెనీ నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. అయితే ఇందుకు కారణం లేకపోలేదని చెబుతున్నారు .

డాలర్‌ విలువ, బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌

డాలర్‌ విలువ, బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌

ఆపిల్‌ సీఈవో టీమ్‌ కుక్‌ అభిప్రాయం ప్రకారం భారత్‌ పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ.. డాలర్‌ విలువ, బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ తదితర అనేక కారణాల వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఐఫోన్‌ విక్రయాలు పెరగట్లేదని కుక్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ మార్కెట్లలో

అంతర్జాతీయ మార్కెట్లలో

కంపెనీ ఆదాయ వ్యయాలపై కుక్‌ మార్కెట్‌ విశ్లేషకులతో మాట్లాడారు. ‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఐఫోన్‌ ఆదాయం 15శాతం తగ్గింది. దీనికి అనేక కారణాలున్నాయి. అందులో ఒకటి.. అమెరికా డాలర్‌ విలువ బలపడుతుండటం. అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్‌ విలువ పెరగడంతో మా ఉత్పత్తుల ధర పెరుగుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ధరల మోత ఎక్కువగా ఉంటోంది. దీంతో కస్టమర్లు ఐఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపించట్లేదని కుక్‌ చెప్పుకొచ్చారు.

లక్షల మంది కస్టమర్లకు

లక్షల మంది కస్టమర్లకు

ఇక తమ కంపెనీ అందిస్తున్న బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌ ప్రొగ్రామ్‌ కూడా విక్రయాలు తగ్గడానికి ఒక కారణమని ఆయన అంటున్నారు. ‘లక్షల మంది కస్టమర్లకు మేం బ్యాటరీలను ఉచితంగా రీప్లేస్‌ చేస్తున్నాం. దీంతో కస్టమర్లు తమ పాత ఐఫోన్లను ఎక్కువ కాలం వాడుతున్నారని కుక్‌ వివరించారు.

లక్షల మంది కస్టమర్లకు

లక్షల మంది కస్టమర్లకు

అయితే విక్రయాలు పెంచేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని కుక్‌ తెలిపారు. చైనాలో ఐఫోన్‌ ధరలు తగ్గించామని, భారత్‌లోనూ ధరలను తగ్గించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.

 

ఇన్నోవేషన్

ఇన్నోవేషన్

ఇన్నోవేషన్ బెంచ్ మార్క్ లో ఆపిల్ కంపెనీ సరికొత్తగా ముందుకు వెళుతున్నప్పటికీ ఆ కంపెనీకి ఆశించిన ఫలితాలు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం అత్యంత తక్కువ ధరలో మంచి ఫీచర్లతో ఆండ్రాయిడ్ ఫోన్లు మార్కెట్ ని శాసించడమేనని పలువురు టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.

 

Best Mobiles in India

English summary
apple slips to 17th spot in 50 most innovative companies list report

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X