Home
News

ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌ ద్వారా ఇలాంటివి కూడా ట్రాక్‌ చేయవచ్చా... ఏకంగా సంవత్సరంపాటు సమాచారం సేకరణ..!

ఆపిల్‌ స్మార్ట్‌వాచ్ స్మార్ట్ ఫీచర్‌లతో (Apple Smart Watch) ఇప్పటికే అనేక మంది ప్రాణాలను కాపాడింది. ఆపిల్‌ వాచ్‌లోని SOS సహా ఇతర ఫీచర్‌లు ఎమర్జెన్సీ సమయంలో వైద్య బృందాలకు సమాచారం అందించి, సరైన సమయానికి వైద్య చికిత్స అందేలా చేశాయి. తాజాగా ఆపిల్ స్మార్ట్‌వాచ్‌ పనితీరుపై మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆపిల్ స్మార్ట్‌వాచ్‌లు పార్కిన్సన్స్‌ వ్యాధి లక్షణాలను గుర్తించగలవని మరియు ఈ వ్యాధిపై ఎలాంటి చికిత్స అందించాలనే అంశంపై అవగాహనకు ఈ వివరాలు ఉపయోగపడతాయని ఒక అధ్యయనం వెల్లడించింది.

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ రోచెస్టర్‌ మెడికల్‌ సెంటర్‌లోని న్యూరాలజిస్ట్‌లు పార్కిన్సన్స్ వ్యాధి ప్రారంభ ధరలో ఉన్న వ్యక్తులను పర్యవేక్షించేందుకు సంవత్సరంపాటు ఐఫోన్‌తో కనెక్ట్‌ చేసిన ఆపిల్‌ వాచ్‌ను ఉపయోగించారు. దీని ద్వారా అనేక అంశాలను గుర్తించినట్లు తెలిసింది. వాయిస్‌ రికార్డింగ్‌ల ద్వారా వాయిస్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.

parkinson disease symptoms can be tracked by apple smartwatch

పార్కిన్సన్స్‌ వ్యాధిలో పురోగతి సహా ఇతర సున్నితమైన వివరాలను ఈ డిజిటల్‌ విధానంలో తెలుసుకున్నట్లు రోచెస్టర్‌ మెడికల్ సెంటర్ న్యూరాలజీ అసోసియేట్‌ ప్రొఫెసర్ జామీ ఆడమ్స్‌ అన్నారు. ఈ వ్యాధి గురించి స్మార్ట్‌ఫోన్‌ మరియు స్మార్ట్‌వాచ్‌ల ద్వారా తీసుకున్న డేటాను ఎక్కడ నుంచైనా పర్యవేక్షించేందుకు మరియు అందులోని మార్పులను గమనించేందుకు అవకాశం ఉంటుంది.

ఈ వివరాలు భవిష్యత్‌లో చికిత్సల సమయంలో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ అధ్యయనం పార్కిన్సన్స్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ లో ఉపయోగపడుతుంది. మరియు చికిత్స ప్రక్రియను వేగంగా అభివృద్ధి చేయడం సహా రోగులకు వేగంగా చికిత్స అందించేందుకు ఉపయోగపడుతుందని అసోసియేట్‌ ప్రొఫెసర్ జామీ ఆడమ్స్‌ తెలిపారు.

స్మార్ట్‌వాచ్‌ ద్వారా పార్కిన్సన్స్‌ లక్షణాలకు సంబంధించిన అనేక మార్పులను గుర్తించినట్లు తెలుస్తోంది. NHS ప్రకారం పార్కిన్సన్స్‌ వ్యాధిలో వణుకు సహా శరీర కదలికలు సాధారణం కంటే తక్కువగా ఉంటాయి. ఫలితంగా రోజువారీ పనులను కష్టతరం చేస్తుంది. మొత్తంగా 12 నెలలపాటు పార్కిన్సన్స్‌ వ్యాధిలో లక్షణాలను గుర్తించేందుకు ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌, స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించినట్లు తెలిసింది.

ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌లోని SOS మరియు ఫాల్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ ఇప్పటికే అనేక యూజర్ల ప్రాణాలను కాపాడాయి. SoS ఫీచర్‌ అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ వైద్య బృందాలకు మరియు కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తుంది. అదే ఫాల్‌ డిటెక్షన్ ఫీచర్‌... ఆపిల్ వాచ్‌ యూజర్లు ఎక్కడైనా అకస్మాత్తుగా నేలపై పడిపోతే ఈ ఫీచర్‌ యాక్టివేట్ అవుతుంది. కింద పడిన యూజర్‌ను స్పృహలోకి వచ్చేలా భారీ శబ్ధంతో అలారంను మోగిస్తుంది.

అనంతరం నిర్ధిష్ట సమయంలోగా కింద పడిన యూజర్‌ స్పృహలోకి రాకుంటే వెంటనే.. ఆ ఫీచర్‌తో నమోదు చేసిన కుటుంబ సభ్యులు, స్నేహితుల ఫోన్‌ నంబర్‌లకు సహా ఎమర్జెన్సీ బృందాలకు సమాచారం పంపిస్తుంది. అలా సరైన సమయంలో చికిత్స అందేలా చూస్తుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
apple smart watch can track parkinson disease symptoms here are the study details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X