మరో వ్యక్తిని కాపాడిన ఆపిల్ స్మార్ట్‌వాచ్ ఫాల్ డిటెక్షన్ ఫీచర్.. ఏంటీ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది?
ఆపిల్ స్మార్ట్‌వాచ్ ఫీచర్లు ఇప్పటికే అనేక మంది ప్రాణాలను కాపాడాయి. ఈ వాచ్‌లోని ఫాల్ డిటెక్షన్ ఫీచర్ (Apple Smart Watch Fall Detection Feature) ముఖ్యంగా ఎమర్జెన్సీ సందర్భాల్లో కీలకంగా వ్యవహరించి, సరైన సమయానికి చికిత్స అందేలా సాయం చేస్తోంది. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి.
తాజాగా జరిగిన ఓ ఘటనలో ఓ సైక్లిస్ట్ ప్రాణాలను ఆపిల్ స్మార్ట్‌వాచ్ ఫాల్ డిటెక్షన్ ఫీచర్ కాపాడింది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. న్యూయార్క్‌కు చెందిన 49 ఏళ్ల ఎరిక్ జోలింగర్ ఇంటికి వెళ్తున్నారు. అతని ఇంటికి సమీపంలోని రోడ్డు వరద నీటిలో మునిగి ఉంది. ఆ రోడ్డుపై ఓ చోట గుంత ఉంది. దాన్ని గుర్తించని ఎరిక్ దాన్ని ఢీకొట్టి పక్కనే ఉన్న పుట్‌పాత్‌పైన పడిపోయారు.

అనంతరం ఘటన ప్రాంతం నుంచి లేచి ఇంటికి వెళ్లారు.. ఎరిక్. అయితే స్నానం చేస్తున్న సమయంలో తన ముక్కు నుంచి రక్తస్రావం కావడం గమనించాడు. అయితే కొద్దిసేపటికే స్పృహతప్పి పడిపోయాడు. ఈ ఘటన గుర్తించిన ఆపిల్ ఫాల్ డిటెక్షన్ ఫీచర్ యాక్టివేట్ అయింది.
కొన్ని సెకన్లపాటు వేచి చూసిన ఈ ఫాల్ డిటెక్షన్ ఫీచర్ అతను స్పందించకపోవడంతో ఎమర్జెనీ టీంకు సమాచారం అందించింది. ఫలితంగా సరైన సమయానికి చికిత్స అందింది. దీంతోపాటు అతని సన్నిహితులకు కూడా ఈ ఫీచర్ సమాచారం అందించింది. కోలుకున్న తర్వాత ఎరిక్ జోలింగర్ ఆపిల్ వాచ్ పనితీరును మెచ్చుకున్నారు.
ఆపిల్ సంస్థ ఈ ఫాల్ డిటెక్షన్ ఫీచర్‌ను 2018 సంవత్సరంలో ఆపిల్ వాచ్ సిరీస్ 14తో లాంచ్ చేసింది. దీంతోపాటు ఈ వాచ్ అనేక ఫీచర్లను కలిగి ఉంది. యాక్సెలిరోమీటర్, గైరోస్కోప్ సెన్సార్ ఈ ఫాల్ డిటెక్షన్ ఫీచర్‌లో కీలకంగా వ్యవహరిస్తాయి. అయితే ఈ ఆపిల్ స్మార్ట్‌వాచ్ ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది.
ఆపిల్ ఫాల్ డిటెక్షన్ ఫీచర్.. ఎవరైనా వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలడాన్ని గుర్తించిన అనంతరం ఓ అలాన్‌ను మోగిస్తుంది. అయితే సదరు వ్యక్తి స్పృహలో ఉన్నట్లయితే అలారంను ఆఫ్ చేస్తారు. అయితే అలారం మోగుతున్న ఎటువంటి చలనం లేని పరిస్థితితిలో కొన్ని సెకన్లపాటు వేచి చూస్తుంది.
అప్పటికీ ఎటువంటి చలనం లేకుంటే అలారంను ఆఫ్ చేసి.. ఎమర్జెన్సీ టీం, ఆ వ్యక్తి తన స్మార్ట్‌వాచ్‌లో ముందే నమోదు చేసుకున్న ఫోన్ నంబర్‌కు సమాచారం చేరవేస్తుంది. ఎమర్జెన్సీ టీం సహా బాధితుల సన్నిహితులకు ఘటనకు సంబంధించిన ప్రాంతం వివరాలు పంపిస్తుంది.
**గతంలో ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 82 సంవత్సరాల వ్యక్తి ప్రాణాలను ఆపిల్ స్మార్ట్‌వాచ్ ఫీచర్ కాపాడింది. యూకేలోని కెడెర్‌మిన్‌స్టర్‌కు చెందిన 82 సంవత్సరాల టోనీ జాన్సీ జనవరి 19, 2024 న స్థానికంగా ఉండే సూపర్ మార్కెట్‌కు వెళ్లాడు. సమీపంలోని పార్కింగ్‌లో తన కారును పార్కింగ్ చేసి మార్కెట్ లోపలికి వెళ్లాడు. అనంతరం తన కారు వద్దకు చేరుకొనేందుకు రోడ్డు దాడుతుండగా ఓ కారు ఢీకొట్టింది.
దీంతో వెంటనే రోడ్డుమీద పడిపోయాడు. అతని కాలర్‌బోన్ సహా పక్కటెముకల వద్ద తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే అదే సమయంలో అతని తన చేతికి ఆపిల్ వాచ్‌ను ధరించాడు. ఆపిల్ వాచ్‌లోని స్మార్ట్ ఫీచర్.. అతను అకస్మాత్తుగా రోడ్డుపై పడిపోవడాన్ని గుర్తించింది. వెంటనే యాక్టివేట్ అయింది.
అత్యవసర విభాగానికి కాల్ చేయాల్సిన అవసరం ఉందా.. అంటూ ఓ పాప్‌అప్‌ను ప్రదర్శించింది. అయితే బాధితుడు ఎంతకీ సమాధానం ఇవ్వకపోవడంతో పరిస్థితిని గమనించిన ఆపిల్ వాచ్ ఫీచర్.. ఆటోమేటిక్‌గా అత్యవసర విభాగానికి సమాచారం అందించింది. దీంతో వైద్య సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని.. హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications