Home
News

ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌ హెల్త్‌ ట్రాకర్‌ సమాచారంతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఏం చేశారో తెలుసా..?

ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌లోని స్మార్ట్‌ ఫీచర్లు (Apple Smartwatch) ఇప్పటికే అనేక మంది ప్రాణాలను కాపాడాయి. ప్రమాదం సహా హార్ట్‌ అటాక్‌ వంటి సమయాల్లో అత్యవసర విభాగాలు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించి సరైన సమయానికి చికిత్స అందేలా చేశాయి. తాజాగా ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.

బెంగుళూరులోని ఓ స్టార్టప్‌లో డెవలపర్‌గా పనిచేస్తున్న శరత్‌ శ్రీరాం తాజాగా ఆపిల్‌ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో ఆపిల్‌ వాచ్‌ ఎలా సాయపడింది, ఆ వివరాల ఆధారంగా తీసుకున్న చికిత్స వంటి వివరాలను వెల్లడించారు. ఈ మేరకు ఆపిల్‌ సీఈవోకు కృతజ్ఞతలు తెలిపారు.

Apple watch helped Bangalore software engineer

25 ఏళ్ల శ్రీరాం అధిక పని ఒత్తిడి ఉన్న స్టార్టప్‌లో పనిచేస్తున్నారు. అయితే కార్యాలయంలోని సమావేశాలు జరుగుతున్న సమయం మరియు సమావేశం అనంతరం తన హార్ట్ బీట్‌ రేట్‌ పెరగడాన్ని గుర్తించారు. ఫలితంగా తాను ధరించిన ఆపిల్‌ వాచ్‌ ద్వారా తన ఆరోగ్య సమాచారాన్ని ట్రాక్‌ చేశారు. ఈ వివరాలతో డాక్టర్‌ను సంప్రదించాడు.

శ్రీరాం ఆరోగ్య పరిస్థితి, ఉద్యోగంలో ఉన్న ఒత్తిడిపై ఆందోళన వ్యక్తం చేశారు. మరియు సదరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కీలక సూచనలు చేశారు. వీలైనంత వేగంగా ఒత్తిడి తక్కువగా ఉన్న ఉద్యోగాన్ని చూసుకోవాలని సూచించారు. అయితే ప్రస్తుతానికి తన ECG రీడింగ్‌లు సక్రమంగా ఉన్నప్పటికీ.. భవిష్యత్‌లో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని డాక్టర్‌ చెప్పినట్లు శ్రీరాం తెలిపారు.

డాక్టర్‌ సలహా మేరకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ప్రస్తుతం చేస్తున్న సంస్థకు గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆరోగ్యకరమైన పని వాతావరణం ఉన్న సంస్థలోకి వెళ్లే అవకాశం ఉంది. పని ఒత్తిడి కారణంగా తన ఆరోగ్యం ఆందోళనకర స్థాయిలో పడిందని శ్రీరాం తెలిపారు. ఆపిల్‌ వాచ్‌ ద్వారా ఈ వివరాలను తెలుసుకున్నట్లు తెలిపాడు. ఆపిల్‌ వాచ్‌ తనకు సాయపడిన విధానం, వివరాలను ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌కు పంపినట్లు తెలిపారు.

* ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 82 సంవత్సరాల వ్యక్తి ప్రాణాలను ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌ ఫీచర్‌ కాపాడింది. యూకేలోని కెడెర్‌మిన్‌స్టర్‌కు చెందిన 82 సంవత్సరాల టోనీ జాన్సీ జనవరి 19, 2024 న స్థానికంగా ఉండే సూపర్‌ మార్కెట్‌కు వెళ్లాడు. సమీపంలోని పార్కింగ్‌లో తన కారును పార్కింగ్‌ చేసి మార్కెట్‌ లోపలికి వెళ్లాడు. అనంతరం తన కారు వద్దకు చేరుకొనేందుకు రోడ్డు దాటుతుండగా ఓ కారు ఢీకొంది.

దీంతో వెంటనే రోడ్డుమీద పడిపోయాడు. అతని కాలర్‌బోన్ సహా పక్కటెముకల వద్ద తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే అదే సమయంలో అతని తన చేతికి ఆపిల్‌ వాచ్‌ను ధరించాడు. ఆపిల్‌ వాచ్‌లోని స్మార్ట్ ఫీచర్‌.. అతను అకస్మాత్తుగా రోడ్డుపై పడిపోవడాన్ని గుర్తించింది. వెంటనే యాక్టివేట్‌ అయింది.

అత్యవసర విభాగానికి కాల్‌ చేయాల్సిన అవసరం ఉందా.. అంటూ ఓ పాప్‌అప్‌ను ప్రదర్శించింది. అయితే బాధితుడు ఎంతకీ సమాధానం ఇవ్వకపోవడంతో పరిస్థితిని గమనించిన ఆపిల్‌ వాచ్‌ ఫీచర్‌.. ఆటోమేటిక్‌గా అత్యవసర విభాగానికి సమాచారం అందించింది. దీంతో వైద్య సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని.. హాస్పిటల్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఆపిల్‌ వాచ్‌లోని SOS ఫీచర్‌ ప్రాణాలను కాపాడింది.

Best Mobiles in India

English summary
Apple Smart watch helped Bangalore Based software engineer
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X