హార్ట్ బీట్ రేట్‌లో ప్రమాదకర మార్పులు.. ఆపిల్ వాచ్ హెచ్చరికతో హాస్పిటల్‌కు వెళ్తే...!!
ఆపిల్ వాచ్ స్మార్ట్ ఫీచర్లు ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను కాపాడాయి. SOS, ఫాల్ డిటెక్షన్ సహా ఇతర హెల్త్ ట్రాకర్లు ఎమర్జెన్సీ సమయాల్లో సరైన చికిత్స అందేలా చేశాయి. ఇందుకు సంబంధించిన ఘటనలు ఇప్పటికే ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అయితే తాజాగా ఢిల్లీకి చెందిన ఓ మహిళను ఆరోగ్య పరిస్థితిపై అప్రమత్తం చేసి సరైన సమయానికి చికిత్స అందేలా సహాయపడ్డాయి.
JNU పీహెడ్‌డీ స్కాలర్‌గా ఉన్న ఓ మహిళ స్నేహ గత రెండు సంవత్సరాలుగా ఆపిల్ స్మార్ట్ వాచ్‌ను (Apple Smart Watch) వినియోగిస్తున్నారు. అయితే ఒక రోజు ఆమె హార్ట్ బీట్ రేట్‌లో భారీ మార్పులను ఆపిల్ వాచ్ గుర్తించింది. హార్ట్ రేట్ ప్రమాదకర స్థాయికి చేరిందని నోటిఫికేషన్ రూపంలో వెల్లడించింది.

అయితే అంతలోనే ఆపిల్ వాచ్ బ్యాటరీ డిశ్ఛార్జీ అయింది. దీంతో తన వాచ్‌కు వెంటనే ఛార్జింగ్ చేసి యాక్టివేట్ చేశారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెంటనే చికిత్స తీసుకోవాలని నోటిఫికేషన్ రూపంలో హెచ్చరిక జారీ చేసింది. అయితే కొద్ది సేపటిలో పరిస్థితి సర్దుమణుగుతుందని స్నేహ భావించారు. అయితే అక్కడికి కేవలం 90 నిమిషాల్లో తీవ్రమైన గుండె సమస్యకు దారితీస్తుందని తెలిపింది.
దీంతో ఆందోళన చెందిన స్నేహ తన ఫ్రెండ్‌కి సమాచారం ఇచ్చారు. ఆమె సాయంతో హాస్పిటల్‌కు చేరుకున్నారు. పరీక్షించిన డాక్టర్లు.. హార్ట్ బీట్ రేట్‌ను సరిచేందుకు DC (డైరెక్ట్ కరెంట్ కార్డియోవర్షన్) షాక్స్ చికిత్స అందించారు. ఫలితంగా కొంత సమయానికి పరిస్థితి అదుపులోకి వచ్చింది. సమయానికి అప్రమత్తం చేసిన ఆపిల్ వాచ్ ఫీచర్లకు స్నేహ కృతజ్ఞతలు తెలిపారు.
** ఇటీవల న్యూయార్క్‌కు చెందిన 49 ఏళ్ల ఎరిక్ జోలింగర్ ప్రాణాలను ఆపిల్ స్మార్ట్‌వాచ్ ఫాల్ డిటెక్షన్ ఫీచర్ కాపాడింది. అతను ఇంటికి సమీపంలోని రోడ్డు వరద నీటిలో మునిగి ఉంది. ఆ రోడ్డుపై ఓ చోట గుంత ఉంది. దాన్ని గుర్తించని ఎరిక్ దాన్ని ఢీకొట్టి పక్కనే ఉన్న పుట్‌పాత్‌పైన పడిపోయారు.
అనంతరం ఘటన ప్రాంతం నుంచి లేచి ఇంటికి వెళ్లారు.. ఎరిక్. అయితే స్నానం చేస్తున్న సమయంలో తన ముక్కు నుంచి రక్తస్రావం కావడం గమనించాడు. అయితే కొద్దిసేపటికే స్పృహ తప్పి పడిపోయాడు. ఈ ఘటన గుర్తించిన ఆపిల్ ఫాల్ డిటెక్షన్ ఫీచర్ యాక్టివేట్ అయింది.
కొన్ని సెకన్లపాటు వేచి చూసిన ఈ ఫాల్ డిటెక్షన్ ఫీచర్ అతను స్పందించకపోవడంతో ఎమర్జెనీ టీంకు సమాచారం అందించింది. ఫలితంగా సరైన సమయానికి చికిత్స అందింది. దీంతోపాటు అతని సన్నిహితులకు కూడా ఈ ఫీచర్ సమాచారం అందించింది. కోలుకున్న తర్వాత ఎరిక్ జోలింగర్ ఆపిల్ వాచ్ పనితీరును మెచ్చుకున్నారు.
** ఆపిల్ సంస్థ ఈ ఫాల్ డిటెక్షన్ ఫీచర్‌ను 2018 సంవత్సరంలో ఆపిల్ వాచ్ సిరీస్ 14తో లాంచ్ చేసింది. దీంతోపాటు ఈ వాచ్ అనేక ఫీచర్లను కలిగి ఉంది. యాక్సెలిరోమీటర్, గైరోస్కోప్ సెన్సార్ ఈ ఫాల్ డిటెక్షన్ ఫీచర్‌లో కీలకంగా వ్యవహరిస్తాయి. అయితే ఈ ఆపిల్ స్మార్ట్‌వాచ్ ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది.
ఆపిల్ ఫాల్ డిటెక్షన్ ఫీచర్.. ఎవరైనా వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలడాన్ని గుర్తించిన అనంతరం ఓ అలాన్‌ను మోగిస్తుంది. అయితే సదరు వ్యక్తి స్పృహలో ఉన్నట్లయితే అలారంను ఆఫ్ చేస్తారు. అయితే అలారం మోగుతున్న ఎటువంటి చలనం లేని పరిస్థితితిలో కొన్ని సెకన్లపాటు వేచి చూస్తుంది.
అప్పటికీ ఎటువంటి చలనం లేకుంటే అలారంను ఆఫ్ చేసిన ఎమర్జెన్సీ టీం, ఆ వ్యక్తి తన స్మార్ట్‌వాచ్‌లో ముందే నమోదు చేసుకున్న ఫోన్ నంబర్‌కు సమాచారం చేరవేస్తుంది. ఎమర్జెన్సీ టీం సహా బాధితుల సన్నిహితులకు ఘటనకు సంబంధించిన ప్రాంతం వివరాలు పంపిస్తుంది.


Click it and Unblock the Notifications








