మరోసారి ట్రెండింగ్‌లోకి ఆపిల్ స్మార్ట్‌వాచ్ ఫీచర్లు.. ఈసారి గాల్లో ఉన్న విమానంలో..!!
ఆపిల్ స్మార్ట్‌వాచ్‌లు (Apple Smartwatch Health Features) అనేక రకాల హెల్త్, ఫిట్‌నెట్ ట్రాకర్లు, ఫీచర్లను కలిగి ఉంటాయి. ఈ కీలక ఫీచర్లు అత్యవసర పరిస్థితుల్లో ఆపిల్ స్మార్ట్‌వాచ్ యూజర్ల ప్రాణాలను కాపాడిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఓ వ్యక్తికి వైద్య సహాయం అందించేందుకు డాక్టర్‌కు ఆపిల్ వాచ్ అవసరం అయింది.
ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్రిటన్ నుంచి ఇటలీ వెళ్తున్న విమానంలో 70 సంవత్సరాల మహిళ శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది వైద్య సాయం కోసం ప్రయత్నించారు. అయితే అదే విమానంలో నేషనల్ హెల్త్ సర్వీస్‌కు చెందిన డాక్టర్ రషిద్ రియాజ్ ప్రయాణం చేస్తున్నారు.

వెంటనే బాధితురాలు వద్దకు వచ్చిన డాక్టర్ రియాజ్ పరిస్థితిని గమనించారు. బాధితురాలి పూర్తి ఆరోగ్యం గురించి తెలుసుకొనేందుకు తనకు వెంటనే ఆపిల్ స్మార్ట్‌వాచ్ అవసరం ఉందని విమాన సిబ్బందికి సూచించారు. ఆపిల్ స్మార్ట్‌వాచ్‌లోని బ్లడ్ ఆక్సిజన్ ఫీచర్ ద్వారా ఆమె రక్తంలోని ఆక్సిజన్ స్థాయిని తెలుసుకొనే ప్రయత్నం చేశారు.
ఊపిరితిత్తుల నుంచి శరీరంలోని ఇతర భాగాలకు తక్కువ శాతం రక్తప్రసరణ జరిగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆపిల్ స్మార్ట్‌వాచ్ ద్వారా రక్తంలోని ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉందని డాక్టర్ రియాజ్ గుర్తించారు. దీంతోపాటు ఆమెకు గతంలోనే గుండె సంబంధిత సమస్యలు తెలిపారు.

70 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళ ఆరోగ్య స్థితిని తెలుసుకొనేందుకు ఆపిల్ స్మార్ట్‌వాచ్ సాయం చేసినట్లు డాక్టర్ రియాజ్ వెల్లడించారు. మరియు వెంటనే ఆక్సిజన్ సిలిండర్ ద్వారా సదరు మహిళకు ఆక్సిజన్ అందించారు. విమానం ఇటలీలో ల్యాండింగ్ అయ్యేంత వరకు మహిళ ఆక్సిజన్ స్థాయిలను పర్యవేక్షించారు.
అయితే ఆపిల్ స్మార్ట్‌వాచ్ అధికారికంగా వైద్యపరమైన అవసరాల కోసం ఉద్దేశించింది కాదని సంస్థ తన వెబ్‌సైట్ లో పేర్కొంది. అయితే పేటెంట్ వివాదం కారణంగా ఈ ఫీచర్‌ను సిరీస్ 9 మరియు అల్ట్రా 2 ఆపిల్ వాచ్‌లను నుంచి తొలగించింది. ఫలితంగా గత నెలలో ఈ మోడళ్ల అమ్మకాలను నిలిపివేసింది.
*గతంలోనూ ఆపిల్ స్మార్ట్ ఫీచర్ల సాయంతో : అమెరికాలోని డెలావర్‌కు చెందిన నటాలీ.. ఓ రోజు తన రూంలోనే మెల్లగా స్పృహ కోల్పోతున్న పరిస్థితి ఎదురైంది. ఆమె రూంలో అత్యంత ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్ లీక్ అవుతోంది. కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం చాలా ప్రమాదకరం మరియు ప్రాణంతకం. అయితే ఆమెకు ఈ విషయం తెలియదు కాదు పరిస్థితి చేతిదాటుతోందని మాత్రం అర్థం అయింది.
అయితే అదే సమయంలో ఆమె చేతికి ఆపిల్ స్మార్ట్‌వాచ్ ఉంది. దీనిలో SOS ఫీచర్ ఉంది. పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని భావించిన నటాలీ వెంటనే SOS ఫీచర్‌ను ఉపయోగించింది. ఈ ఫీచర్‌లో ఉన్న సాంకేతికత ద్వారా ఆ సమీపంలోనే అత్యవసర సేవల విభాగం సహా అగ్నిమాపక శాఖకు సమాచారం వెళ్లిపోయింది.
దీంతో లోకేషన్ ఆధారంగా అత్యవసర సేవల సిబ్బంది ఆమె రూంకు చేరుకున్నారు. అప్పటికే మంచంపై పడి ఉన్న నటాలీని రూం నుంచి బయటకు తీసుకొచ్చారు. వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. సమయానికి చికిత్స అందడంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో ఆపిల్ సంస్థకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.


Click it and Unblock the Notifications








