Home
News

మరోసారి వార్తల్లోకి వచ్చిన ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌ ఫీచర్లు.. ఏం జరిగిందంటే..?

ఆపిల్‌ వాచ్‌ టెక్నికల్‌ ఫీచర్లు (Apple Smartwatch) ఆపద సమయాల్లో అండగా ఉంటున్నాయి. ఇప్పటికే అనేక మంది ప్రాణాలను కాపాడాయి. తాజాగా అటువంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 82 సంవత్సరాల వ్యక్తి ప్రాణాలను ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌ ఫీచర్‌ కాపాడింది.

యూకేలోని కెడెర్‌మిన్‌స్టర్‌కు చెందిన 82 సంవత్సరాల టోనీ జనవరి 19, 2024 న స్థానికంగా ఉండే సూపర్‌ మార్కెట్‌కు వెళ్లారు. సమీపంలోని పార్కింగ్‌లో తన కారును పార్కింగ్‌ చేసి మార్కెట్‌ లోపలికి వెళ్లారు. అనంతరం తన కారు వద్దకు చేరుకొనేందుకు రోడ్డు దాడుతుండగా ఓ కారు ఢీకొట్టింది.

Apple Smartwatch saves 82 years old man in UK

దీంతో వెంటనే రోడ్డుమీద పడిపోయారు. అతని కాలర్‌బోన్ సహా పక్కటెముకల వద్ద తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే అదే సమయంలో అతని తన చేతికి ఆపిల్‌ వాచ్‌ను ధరించాడు. ఆపిల్‌ వాచ్‌లోని స్మార్ట్ ఫీచర్‌.. అతను అకస్మాత్తుగా రోడ్డుపై పడిపోవడాన్ని గుర్తించింది. వెంటనే యాక్టివేట్‌ అయింది.

అత్యవసర విభాగానికి కాల్‌ చేయాల్సిన అవసరం ఉందా.. అంటూ ఓ పాప్‌-అప్‌ను ప్రదర్శించింది. అయితే బాధితుడు ఎంతకీ సమాధానం ఇవ్వకపోవడంతో పరిస్థితిని గమనించిన ఆపిల్‌ వాచ్‌ ఫీచర్‌.. ఆటోమేటిక్‌గా అత్యవసర విభాగానికి సమాచారం అందించింది. దీంతో వైద్య సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని.. హాస్పిటల్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఆపిల్‌ వాచ్‌లోని SOS ఫీచర్‌ ప్రాణాలను కాపాడింది.

* గతంలోనూ అనేక ఘటనల్లో అనేక మంది ప్రాణాలను ఆపిల్ వాచ్‌ స్మార్ట్‌ఫీచర్లు కాపాడాయి. అమెరికాలోని డెలావర్‌కు చెందిన నటాలీ.. ఓ రోజు తన రూంలోనే మెల్లగా స్పృహ కోల్పోతున్న పరిస్థితి ఎదురైంది. ఆమె రూంలో అత్యంత ప్రమాదకరమైన కార్బన్‌ మోనాక్సైడ్‌ లీక్‌ అవుతోంది. కార్బన్‌ మోనాక్సైడ్‌ పీల్చడం చాలా ప్రమాదకరం మరియు ప్రాణంతకం. అయితే ఆమెకు ఈ విషయం తెలియదు కాదు పరిస్థితి చేతిదాటుతోందని మాత్రం అర్థం అయింది.

అయితే అదే సమయంలో ఆమె చేతికి ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌ ఉంది. దీనిలో SOS ఫీచర్‌ ఉంది. పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని భావించిన నటాలీ వెంటనే SOS ఫీచర్‌ను ఉపయోగించింది. ఈ ఫీచర్‌లో ఉన్న సాంకేతికత ద్వారా ఆ సమీపంలోనే అత్యవసర సేవల విభాగం సహా అగ్నిమాపక శాఖకు సమాచారం వెళ్లిపోయింది.

దీంతో లోకేషన్‌ ఆధారంగా అత్యవసర సేవల సిబ్బంది ఆమె రూంకు చేరుకున్నారు. అప్పటికే మంచంపై పడి ఉన్న నటాలీని రూం నుంచి బయటకు తీసుకొచ్చారు. వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. సమయానికి చికిత్స అందడంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో ఆపిల్‌ సంస్థకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

హార్ట్‌ అటాక్‌ వచ్చిన సమయాల్లోనూ, అకస్మాత్తుగా కింద పడిపోయిన సందర్భాల్లో ఆపిల్‌ వాచ్‌ స్మార్ట్‌ ఫీచర్లలో నమోదు చేసిన అత్యవసర నంబర్లు సహా బాధితుడి బంధువులకు సమాచారం అందిస్తున్నాయి. తద్వార సరైన సమయానికి చికిత్స అంది, ప్రాణాలతో బయటపడిన ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.

ఆపిల్‌ స్మార్ట్‌వా‌చ్‌లు చాలా కచ్చితత్వంతో పనిచేస్తాయి. ఇందులో అనేక హెల్త్ ట్రాకర్లు ఉన్నాయి. హార్ట్‌ రేట్‌ మానిటర్‌, spO2 స్థాయిలకు తనిఖీ చేయడం సహా SOS వంటి కీలక ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫీచర్‌ను చిన్న బటన్‌ క్లిక్‌ చేయడం ద్వారా అత్యవసర సమయాల్లో వినియోగించుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple Smartwatch saves 82 years old man in UK
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X