అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలను కాపాడిన ఆపిల్ స్మార్ట్‌వాచ్.. అసలు ఏం జరిగిందంటే..?
ఆపిల్ స్మార్ట్ వాచ్ ఫీచర్ లు ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను కాపాడాయి. స్మార్ట్‌వాచ్ లోని హెల్త్ ట్రాకర్‌ల సాయం సహా SOS, ఫాల్ డిటెక్షన్ వంటి ఫీచర్‌లు సరైన సమయానికి చికిత్స అందేలా చేసి.. అనేక మంది ప్రాణాలను కాపాడుతున్నాయి. తాజాగా ఇటువంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. అగ్నిమాపక శాఖలో (Apple Smartwatch Saves Fire Man) పనిచేస్తున్న ఓ వ్యక్తి హార్ట్ బీట్ లో అసాధారణ మార్పులను గుర్తించి ఆపిల్ వాచ్ అప్రమత్తం చేసింది. వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలని సూచించింది.
కెనడా గ్లోబల్ న్యూస్ కథనం ప్రకారం.. కెనడాలో అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న 44 ఏళ్ల ట్రావిస్ చామర్స్.. తన కుమారుడితో కలిసి హాకీ ఆడుతున్నాడు. అయితే అకస్మాత్తుగా గుండెలో కొన్ని మార్పులు మరియు తలనొప్పి వస్తున్నట్లు గ్రహించాడు. అయితే తొలుత సాధారణ ఎలర్జీగా భావించాడు. అయితే ఆపిల్ మాత్రం తీవ్ర హెచ్చరికలను జారీచేసింది.

హార్ట్ రేట్ అసాధారణంగా ఉందని హెచ్చరించింది. దీంతో కాసేపు విశ్రాంతి తీసుకొనేందుకు ట్రావిస్ చామర్స్ ప్రయత్నం చేశారు. అయినా ఆపిల్ వాచ్ నుంచి హెచ్చరిక సందేశాలు వస్తున్నాయి. దీంతో వెంటనే హాస్పిటల్‌కు వెళ్లారు. దీంతో పరీక్షించిన డాక్టర్లు స్వల్ప స్థాయి గుండె పోటుగా నిర్ధారించారు.
తన కుటుంబంలో గతంలో ఎవరికీ ఈ తరహా ఆరోగ్య సమస్యలు లేవని, తనకు 44 ఏళ్ల వయసులో ఈ తరహా పరిస్థితి రావడంపై ఆందోళన చెందారు. సరైన సమయానికి హెచ్చరికలు పంపిన ఆపిల్ స్మార్ట్‌వాచ్ కు ట్రావిస్ చామర్స్ ధన్యవాదాలు తెలిపారు.
ఆపిల్ వాచ్OS 6 లో హార్ట్ బీట్‌లో అసాధారణ మార్పులను గుర్తించేలా ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆప్టికల్ హార్ట్ సెన్సార్ ద్వారా హార్ట్ బీట్‌ను పర్యవేక్షిస్తుంది. హార్ట్ రేట్‌లో మార్పులను గమనిస్తే వెంటనే అప్రమత్తం చేస్తుంది. ఆ సమయంలో హాస్పిటల్‌కు వెళ్లి వైద్య సాయం తీసుకోవాలని సూచిస్తుంది.
** ఇటీవలే ఆపిల్ స్మార్ట్ వాచ్ గురించి ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఆపిల్ స్మార్ట్‌వాచ్‌లు పార్కిన్సన్ వ్యాధి లక్షణాలను గుర్తించగలవని మరియు ఈ వ్యాధిపై ఎలాంటి చికిత్స అందించాలనే అంశంపై అవగాహనకు ఈ వివరాలు ఉపయోగపడతాయని ఒక అధ్యయనం వెల్లడించింది.
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ మెడికల్ సెంటర్‌లోని న్యూరాలజిస్ట్‌లు పార్కిన్సన్స్ వ్యాధి ప్రారంభ దశలో ఉన్న వ్యక్తులను పర్యవేక్షించేందుకు సంవత్సరంపాటు ఐఫోన్‌తో కనెక్ట్ చేసిన ఆపిల్ వాచ్‌ను ఉపయోగించారు. దీని ద్వారా అనేక అంశాలను గుర్తించినట్లు తెలిసింది. వాయిస్ రికార్డింగ్‌ల ద్వారా వాయిస్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
పార్కిన్సన్స్ వ్యాధిలో పురోగతి సహా ఇతర సున్నితమైన వివరాలను డిజిటల్ విధానంలో తెలుసుకున్నట్లు రోచెస్టర్ మెడికల్ సెంటర్ న్యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ జామీ ఆడమ్స్ అన్నారు. ఈ వ్యాధి గురించి స్మార్ట్‌ఫోన్ మరియు స్మార్ట్‌వాచ్‌ల ద్వారా తీసుకున్న డేటాను ఎక్కడ నుంచైనా పర్యవేక్షించేందుకు మరియు అందులోని మార్పులను గమనించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications