Home
News

విద్యార్థిని ప్రాణాలను కాపాడిన Apple స్మార్ట్‌వాచ్‌.. చివరి క్షణంలో ఆ ఫీచర్‌ను ఉపయోగించి..!

ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌లు (Apple smartwatch saves student life) కేవలం టైం తెలుసుకొనేందుకో లేదా ఇతర సాంకేతిక అవసరాల కోసమో కాకుండా ఏకంగా అత్యవసర సమయాల్లో అండగా ఉంటున్నాయి. ప్రాణాలను సైతం కాపాడుతున్నాయి. ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌లు కలిగి ఉంటున్న అనేక కీలక ఫీచర్లు ఆపద వచ్చిన సమయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి.

అత్యవసర సమయాల్లో కీలకంగా ఆపిల్‌ స్మార్ట్‌ఫీచర్లు : హార్ట్‌ అటాక్‌ వచ్చిన సమయాల్లోనూ, అకస్మాత్తుగా కింద పడిపోయిన సందర్భాల్లో ఆపిల్‌ వాచ్‌ స్మార్ట్‌ ఫీచర్లలో నమోదు చేసిన అత్యవసర నంబర్లు సహా బాధితుడి బంధువులకు సమాచారం అందిస్తున్నాయి. తద్వార సరైన సమయానికి చికిత్స అంది, ప్రాణాలతో బయటపడిన ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.

apple-smartwatch-saves-life

కుమార్తె మృతదేహాన్ని గుర్తించేందుకు కూడా సాయం : ఇజ్రాయెల్‌లో హమాస్‌ మిలిటెంట్లు దాడిచేసిన ఘటనలో మరణించిన తన కుమార్తె మృతదేహాన్ని గుర్తించేందుకు ఓ తండ్రికి ఆపిల్‌ వాచ్‌ సాయపడింది. అయితే ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా ఓ విద్యార్థి ప్రాణాలను ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌ స్మార్ట్‌ ఫీచర్లు కాపాడాయి. అయితే ఇదివరకు వెలుగు చూసిన ఘటనలకు కంటే ఇది కొంచెం ప్రత్యేకం.

తాజాగా కార్బన్‌ మోనాక్కైడ్‌ లీక్‌ అయిన ఘటనలో.. : అమెరికాలోని డెలావర్‌కు చెందిన నటాలీ.. ఓ రోజు తన రూంలోనే మెల్లగా స్పృహ కోల్పోతున్న పరిస్థితి ఎదురైంది. ఆమె రూంలో అత్యంత ప్రమాదకరమైన కార్బన్‌ మోనాక్సైడ్‌ లీక్‌ అవుతోంది. కార్బన్‌ మోనాక్సైడ్‌ పీల్చడం చాలా ప్రమాదకరం మరియు ప్రాణంతకం. అయితే ఆమెకు ఈ విషయం తెలియదు. కానీ పరిస్థితి చేయిదాటుతోందని మాత్రం అర్థం అయింది.

apple-smartwatch-saves-life

అయితే అదే సమయంలో ఆమె చేతికి ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌ ఉంది. దీనిలో SOS ఫీచర్‌ ఉంది. పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని భావించిన నటాలీ వెంటనే SOS ఫీచర్‌ను ఉపయోగించింది. ఈ ఫీచర్‌లో ఉన్న సాంకేతికత ద్వారా ఆ సమీపంలోనే అత్యవసర సేవల విభాగం సహా అగ్నిమాపక శాఖకు సమాచారం వెళ్లిపోయింది.

దీంతో లోకేషన్‌ ఆధారంగా అత్యవసర సేవల సిబ్బంది ఆమె రూంకు చేరుకున్నారు. అప్పటికే మంచంపై పడి ఉన్న నటాలీని రూం నుంచి బయటకు తీసుకొచ్చారు. వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. సమయానికి చికిత్స అందడంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో ఆపిల్‌ సంస్థకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఆపిల్‌ స్మార్ట్‌వా‌చ్‌లు చాలా కచ్చితత్వంతో పనిచేస్తాయి. ఇందులో అనేక హెల్త్ ట్రాకర్లు ఉన్నాయి. హార్ట్‌ రేట్‌ మానిటర్‌, spO2 స్థాయిలకు తనిఖీ చేయడం సహా SOS వంటి కీలక ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫీచర్‌ను చిన్న బటన్‌ క్లిక్‌ చేయడం ద్వారా అత్యవసర సమయాల్లో వినియోగించుకోవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple smartwatch SOS feature saved a woman who unconscious due to carbon monoxide leakage
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X