అదే జ‌రిగితే.. iphone 14 ధ‌ర‌లు భారీగా త‌గ్గే అవ‌కాశం ఉంటుంది!

|

Apple కంపెనీ త‌మ ఉత్ప‌త్తుల త‌యారీ మ‌రియు విడి భాగాల అసెంబ్లీ విష‌యంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించే పనిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆ కంపెనీ ఇప్ప‌టికే భారతదేశంలో iphone 14 ఉత్పత్తిని ప్రారంభించిందని ఓ నివేదిక పేర్కొంది.

 
అదే జ‌రిగితే.. iphone 14 ధ‌ర‌లు భారీగా త‌గ్గే అవ‌కాశం ఉంటుంది!

ఈ ప‌రిణామం చూస్తుంటే, యాపిల్ రానున్న రోజుల్లో చైనీస్ ప్లాంట్‌లపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించవచ్చనే సంకేతాల‌ను నివేదిక వెల్ల‌డి చేసింది. అయితే, iphone 14 మొబైల్స్ భార‌త్‌లో త‌యారు చేయ‌డం ద్వారా వాటి ధ‌ర ఏమైనా త‌గ్గే అవ‌కాశం ఉంటుందా అనే కోణంలో చాలా మంది ఆలోచిస్తున్నారు.

చైనాపై ఆధార‌డ‌టాన్ని త‌గ్గించేందుకేనా!

చైనాపై ఆధార‌డ‌టాన్ని త‌గ్గించేందుకేనా!

Apple యొక్క iPhone తయారీ మరియు అసెంబ్లింగ్ కార్య‌క‌లాపాలు చాలా వరకు చైనాలో జరుగుతాయి. అయితే, 2020 లో క‌రోనా వైర‌స్ మహమ్మారి ప్రారంభం, పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు మరియు లాక్‌డౌన్‌ల ఫలితంగా iPhone 12 లాంచ్ ఆలస్యం అయింది. యాపిల్ చైనా వెలుపల తయారీ మరియు అసెంబ్లీ యూనిట్లను కలిగి ఉన్నప్పటికీ, ఇప్పటికీ ఎక్కువ భాగం చైనాలోనే కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే ఆ కంపెనీ భార‌త్‌లో ఉత్ప‌త్తుల్ని త‌యారు చేసే విష‌యాన్ని ముందుకు తెచ్చింది. అందులో భాగంగానే భారతదేశంలో iphone 14 ఉత్పత్తిని పెంచుతున్నందున ప‌లు మార్పులు చోటుచేసుకునే అవ‌కాశాలు ఉన్నాయి. ఒక‌వేళ భార‌త్‌లో ఉత్ప‌త్తుల త‌యారీ ఆశించిన స్థాయిలో విజ‌య‌వంతం అయితే చైనాపై ఆధార‌ప‌డ‌టాన్ని కంపెనీ త‌గ్గిస్తుందని స‌మాచారం.

ఇప్ప‌టికే భార‌త్‌లో త‌యారీ షురూ!
 

ఇప్ప‌టికే భార‌త్‌లో త‌యారీ షురూ!

iphone 14 మోడ‌ల్ లాంచ్ అయిన రెండు లేదా మూడు నెలల తర్వాత భారతదేశంలోని ఫాక్స్‌కాన్ యూనిట్లు మొబైల్స్‌ తయారీని ప్రారంభిస్తాయని గతంలో కొన్ని నివేదికలు తెలిపాయి. ఇప్పుడు కూడా అవే నివేదిక‌లు మ‌రో విష‌యాన్ని వెల్ల‌డించాయి. భారతదేశంలో తయారు చేయబడిన iphone 14 మోడల్‌లు డిసెంబర్ 2022 నుండి షిప్పింగ్ ప్రారంభమవుతాయని ఆ నివేదిక‌లు పేర్కొన్నాయి. యాపిల్ కంపెనీ భార‌త్‌లోని చెన్నై శివార్లలో ఉన్న‌ ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లలో iphone 14 తయారీని ఇప్ప‌టికే ప్రారంభించిన‌ట్లు ఎకనామిక్ టైమ్స్ నుండి వచ్చిన కొత్త నివేదిక వెల్ల‌డించింది. మొత్తం iPhone 14 డివైజ్‌ల‌లో ఐదు శాతం ఈ ప్లాంట్‌లో తయారు చేయబడుతుందని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా, 2025 నాటికి ఇది 25 శాతానికి పెరుగుతుందని నివేదిక అంచనా.

అసెంబ్లింగ్ కోసం టాటా గ్రూప్!

అసెంబ్లింగ్ కోసం టాటా గ్రూప్!

అదేవిధంగా, టాటా గ్రూప్ దేశంలో ఐఫోన్‌లను అసెంబ్లింగ్ చేసే ప్రాజెక్టు విష‌య‌మై విస్ట్రోన్ గ్రూప్‌తో చర్చలు జరుపుతున్న‌ట్లు కూడా తెలుస్తోంది. టాటా ప్రణాళిక అమలులోకి వస్తే, భారతదేశం ఐఫోన్ తయారీలో పెద్ద భాగాన్ని తీసుకుంటుంది. ఇదే గ‌న‌క జ‌రిగితే ఆపిల్ కంపెనీ చైనాపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.

మేడ్-ఇన్-ఇండియా ఐఫోన్ 14 చౌకగా ఉంటుందా?

మేడ్-ఇన్-ఇండియా ఐఫోన్ 14 చౌకగా ఉంటుందా?

ప్రస్తుతం, iPhone 14 లైనప్‌లో iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro మరియు iPhone 14 Pro Max వంటి నాలుగు మోడల్‌లు ఉన్నాయి. ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ. 79,900 అయితే ఐఫోన్ 14 ప్లస్ రూ.89,900 ధ‌ర‌కు అందుబాటులో ఉంది. iPhone 14 Pro మరియు iPhone 14 Pro Max ప్రారంభ ధర రూ.1,29,900 మరియు వరుసగా రూ.1,39,900 గా ధ‌ర క‌లిగి ఉన్నాయి.

భారతదేశంలో iPhone 14 మొబైల్స్ తయారీ ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ.. ఈ కొత్త త‌యారీ యూనిట్లు డిసెంబర్ 2022 వరకు షిప్పింగ్ ప్రారంభించే అవ‌కాశం లేదు. కాబ‌ట్టి, న్యూ ఇయర్ నాటికి ఆఫర్‌లో భాగంగా కొన్ని తగ్గింపు డీల్స్ అయితే యూజ‌ర్లు ఆశించవచ్చు. ఏదేమైన‌ప్ప‌టికీ.. ఐఫోన్ 14 మోడ‌ల్‌కు సంబంధించి భార‌త్‌లో త‌గ్గింపు ధ‌ర కావాల‌ని కోరుకునే వారు ఇంకా కొద్ది నెల‌లు వేచి చూడాల్సి వ‌స్తుంద‌ని అంతా భావిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Apple started iphone 14 manufacture in india, reducing its reliance on China.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X