ఇండియాలో ఆపిల్ ఫోన్ల అమ్మకాలు బంద్, లిస్ట్ ఇదే

By Gizbot Bureau
|

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఆపిల్ పలు పాత ఐఫోన్ మోడల్స్ అమ్మకాలను భారత్‌లో నిలిపివేసింది. ఐఫోన్ ఎస్‌ఈ, ఐఫోన్ 6 ప్లస్, 6ఎస్ ప్లస్ ఫోన్ల అమ్మకాలను నిలిపివేస్తున్నామని యాపిల్ ప్రకటించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ ఫోన్లు రిటెయిల్ మార్కెట్‌తోపాటు అటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సైట్లలోనూ వినియోగదారులకు లభించడం లేదు.

Apple stops selling iPhone SE, 6, 6 Plus, 6s Plus in India

అయితే ఈ మోడల్ ఐఫోన్లు అమెరికాలో మాత్రం అందుబాటులో ఉన్నాయని యాపిల్ వెల్లడించింది. కాగా కొత్తగా విడుదలవుతున్న ఐఫోన్ల అమ్మకాలను మరింత పెంచేందుకే పాత ఐఫోన్ల అమ్మకాలను యాపిల్ నిలిపివేసిందని తెలిసింది.

 చైనా దిగ్గజాలకు సవాల్

చైనా దిగ్గజాలకు సవాల్

ఆపిల్ కంపెనీ ఈ ఫోన్ల అమ్మకాలను బంద్ చేయడానికి ప్రధాన కారణమేమిటంట్ ఈ ఫోన్ల ధర చాలా ఎక్కువగా ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ఎంట్రీ లెవల్ మార్కెట్ మీద ఆపిల్ కన్నేసిందని తెలుస్తోంది. అత్యంత తక్కువ ధరకు ఐఫోన్లను తీసుకువచ్చి చైనా దిగ్గజాలకు సవాల్ విసరాలని చూస్తోంది.

రూ. 8 వేల లోపు

రూ. 8 వేల లోపు

అన్నీ కుదిరితే ఎంట్రీ లెవల్ ఐఫోన్ ధరలు రూ. 8 వేల లోపు ఉండనున్నాయి. ఈ నెల నుంచి iPhone SE, 6, 6 Plus, 6s Plus ఫోన్ల అమ్మకాలను బంద్ చేస్తున్నామని Apple's distributors అలాగే సేల్స్ టీమ్ క్లూ ఇచ్చారు. ఎంట్రీ లెవల్ ఫోన్లతో మార్కెట్లోకి దూసుకువస్తామని తెలిపారు.

ఐఫోన్ 6 ధర

ఐఫోన్ 6 ధర

కాగా ఇప్పుడు ఐఫోన్ 6 ధర మార్కెట్లోరూ. 29,500గా ఉంది. iPhone SE కూడా Rs 21,000-22,000 మధ్యలో ఉంది. ఇదిలా ఉంటే ఈ నాలుగు మోడళ్లు అమెజాన్ లో అవుట్ ఆఫ్ స్టాక్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో సైతం iPhone SE and 6Plus అవుట్ ఆఫ్ స్టాక్ అని చెబుతున్నాయి. అన్ని రకాల మోడళ్లు ఈ రెండు ఈ కామర్స్ సైట్లలో అందుబాటులో లేవు. కేవలం యుఎస్ మార్కెట్లో మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి.

మేడ్‌ ఇన్‌ ఇండియా మార్కెట్లోకి

మేడ్‌ ఇన్‌ ఇండియా మార్కెట్లోకి

ఇదిలా ఉంటే ఆపిల్‌ ఐఫోన్‌ మేడ్‌ ఇన్‌ ఇండియా మార్కెట్లోకి రావడానికి రెడీ అవుతోంది. ఈతరం కుర్రకారు క్రేజీగా భావించే ఐఫోన్‌ ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో ధర అంత ఆకాశంలో ఉంటుంది. విదేశాల్లో తయారయ్యే ఈ ఫోన్‌ భారత్‌కు వచ్చేసరికి దిగుమతి సుంకాల కారణంగా ఎక్కువ ధర పలుకుతుంది. దీంతో డిమాండ్‌ ఉన్నా మార్కెట్‌పై అధిక ధర ప్రభావాన్ని గుర్తించిన ఆపిల్‌ సంస్థ టాప్‌ ఎండ్‌ ఐఫోన్లను భారత్‌లోనే అసెంబిల్‌ చేసేందుకు బెంగళూరులో ప్రత్యేక యూనిట్‌ను నెలకొల్పిన విషయం తెలిసిందే.

 ఐఫోన్‌ ఎక్స్‌ ఆర్‌, ఎక్స్‌ఎస్‌ ఫోన్లు

ఐఫోన్‌ ఎక్స్‌ ఆర్‌, ఎక్స్‌ఎస్‌ ఫోన్లు

ఈ యూనిట్‌లో రూపొందించిన ఐఫోన్‌ ఎక్స్‌ ఆర్‌, ఎక్స్‌ఎస్‌ ఫోన్లు ఆగస్టులో మార్కెట్లోకి రానున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇండియాలో తన ఫోన్లను అసెంబిల్‌ చేయడమేకాక సొంతంగా స్టోర్లను కూడా ప్రారంభించాలని ఆపిల్‌ సంస్థ నిర్ణయించింది. దీనివల్ల దేశీయ మార్కెట్లో ఐఫోన్‌ ధర గణనీయంగా తగ్గుతుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

Best Mobiles in India

English summary
Apple stops selling iPhone SE, 6, 6 Plus, 6s Plus in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X