Apple Store App గుడ్‌న్యూస్ చెప్పిన టెక్ దిగ్గజం.. భారత్‌లో ఆపిల్ స్టోర్ యాప్ విడుదల..!
టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో ఆపిల్ స్టోర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో భారత్ చాలా కీలకమైనది. అందువల్ల ఆపిల్ పూర్తిగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యాప్ స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 2023 ఏప్రిల్ లో తొలిసారిగా ముంబై, ఢిల్లీలో ఆపిల్ రిటైల్ స్టోర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. భవిష్యత్ అవసరాలు, అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ఆపిల్ స్టోర్ యాప్‌ను లాంచ్ చేసినట్లు తెలుస్తోంది.
భారత్‌లో మరింత మంది కస్టమర్‌లను చేరుకొనేందుకు వీలుగా ఆపిల్ స్టోర్ యాప్‌ను (Apple Store App India) విడుదల చేస్తున్నట్లు ఆపిల్ రిటైల్ ఆన్‌లైన్ హెడ్ కరెన్ రాస్ముస్సేన్ తెలిపారు. ఈ యాప్ ద్వారా అనేక ఉత్పత్తులను సులభంగా కొనుగోలు చేయవచ్చన్నారు. వినియోగదారులకు అత్యంత మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు వీలుగా యాప్‌ను లాంచ్ చేసినట్లు చెప్పారు.

ఆపిల్ స్టోర్ యాప్‌లోని Products ట్యాబ్‌లో ఆపిల్ ఉత్పత్తులు, ఇతర గ్యాడ్జెట్‌లు సహా సర్వీస్ కు సంబంధించిన సమాచారం పొందవచ్చు. For You ట్యాబ్ ఫేవరెట్ సహా ఇతర ఉత్పత్తులకు యాక్సెస్‌ను పొందవచ్చు. Go Further ట్యాప్‌లో ఆపిల్ స్పెషలిస్ట్స్‌తో సెషన్స్, టిప్స్ సహా మరిన్ని ప్రయోజనాలను తెలుసుకోవచ్చు.
ఈ యాప్ ద్వారా అప్‌గ్రేడ్ స్పెసిఫికేషన్‌లతో mac, ఐప్యాడ్, ఎయిర్‌పాడ్స్, ఎయిర్‌ట్యాగ్ వంటి ఆపిల్ ఉత్పత్తులను కస్టమైజ్ చేసుకోవచ్చు మరియు కొనుగోలుతోపాటు డిజిటల్ గిఫ్ట్ మెసేజ్‌లను పొందవచ్చని తెలుస్తోంది. మీకు అనువైన సమయాల్లో డెలివరీ తీసుకోవడం వంటి సదుపాయాలను కూడా పొందవచ్చు.
ప్రస్తుతం భారత్‌లో ముంబై, ఢిల్లీలో ఆపిల్ స్టోర్‌లు ఉన్నాయి. దీంతోపాటు భవిష్యత్‌లో బెంగళూరు, పూణే, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై లో మరిన్ని స్టోర్‌లను ఓపెన్ చేసేందుకు ఆపిల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎప్పటి నుంచి ఈ స్టోర్‌లు అందుబాటులోకి రానున్నాయో వెల్లడి కాలేదు.
ఆపిల్ నుంచి భారత్ మార్కెట్‌లోకి ఐఫోన్ SE 4 ఈ సంవత్సరం ఏప్రిల్ లో లాంచ్ కానుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ సన్నీ డిక్సన్ తాజాగా ఈ ఫోన్ డమ్మీ ఫొటోలను షేర్ చేశారు. దీని ఆధారంగా ఐఫోన్ 14 తరహా డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఐఫోన్ 14 తరహా అల్యూమినియం ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్, వెనుక వైపు కెమెరా మాడ్యూల్‌ను గుర్తించవచ్చు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫోన్‌ల తరహాలోనే అప్‌గ్రేడ్ ఫీచర్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరతో విడుదల కానుందని తెలుస్తోంది.
ఐఫోన్ SE 4 మోడల్ 6.06 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు A18 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు 8GB ర్యామ్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గత SE మోడళ్లు కేవలం 4GB ర్యామ్‌ను మాత్రమే కలిగి ఉన్నాయి. 128GB స్టోరేజీతో విడుదయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications







