మళ్లీ ఆపిల్ షోరూమ్‌లో సర్వం ఊడ్చేశారు

అమెరికా మొబైల్ దిగ్గజం ఆపిల్ కంపెనీకి దొంగట బెడద తప్పడం లేదు.

|

అమెరికా మొబైల్ దిగ్గజం ఆపిల్ కంపెనీకి దొంగట బెడద తప్పడం లేదు. ఆపిల్ షోరూముల్లోని ఆపిల్ ఉత్పత్తులను దొంగలు నిలువునా దోచుకుంటున్నారు. కాలిఫోర్నియా ఘటన మరచిపోకముందే మరో చోట దొంగలు ఆపిల్ షోరూం మొత్తాన్ని ఊడ్చేశారు. ఈ సారి ఇండియాలో ఈ ఘటన జరిగింది. ఇండియాలోని ఇండోర్ లోని ఆపిల్ షోరూంలోని iPhones, iPads, Apple Watch, MacBooks, లాంటి విలువైన వస్తువులను తస్కరించారు. ఈ విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా తొలిసారిగా రిపోర్ట్ చేసింది. ఘటన పూర్తి వివరాల్లోకెళితే...

కళ్లుమూసి తెరిచేలోపు ఆపిల్‌ స్టోర్‌ని ఊడ్చేశారు, సంచలన వీడియో !కళ్లుమూసి తెరిచేలోపు ఆపిల్‌ స్టోర్‌ని ఊడ్చేశారు, సంచలన వీడియో !

ఇండోర్ నగరంలో..

ఇండోర్ నగరంలో..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో ఆపిల్ షోరూం ఉంది. ఈ షోరూంలో రూ. 2 కోట్లు విలువచేసే ఆపిల్ ఉత్పత్తులను దొంగలు దొంగిలించారంటూ టైమ్స్ ఆప్ ఇండియా కథనాన్ని వెలువరించింది.

 దొంగలు అర్థరాత్రి సమయంలో

దొంగలు అర్థరాత్రి సమయంలో

ఈ కథనం ప్రకారం దొంగలు అర్థరాత్రి సమయంలో గుర్తించకుండా ఉండేందుకు ముఖానికి మాస్కులు ధరించి షాపు తాళాలు పగులకొట్టి అందులో ఉన్న వస్తువులను దోచుకెళ్లారని తెలిపింది.

షాపు తెరిచేవరకు

షాపు తెరిచేవరకు

అయితే మరుసటి రోజు షాపు తెరిచేవరకు ఈ విషయం ఎక్కడా బయటకు రాలేదు. షాపును తెరిచేందుకు ఉద్యోగులు వచ్చిన సమయంలో ఈ దొంగతనాన్ని గుర్తించి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీసీటీవీ పుటేజీ

సీసీటీవీ పుటేజీ


ఇండోర్ పోలీసులు సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ దొంగతనం మీద నిజాలు తెలిసేవరకు షోరూంను మూసివేస్తున్నట్లు వారు తెలిపారు. కాగా దీనికి సంబంధించిన విషయాలను ఏవీ వారు బహిర్గత పరచడం లేదు.

గత నెలలో కాలిఫోర్నియాలోని ఆపిల్ షో రూంలో

గత నెలలో కాలిఫోర్నియాలోని ఆపిల్ షో రూంలో

కాగా గత నెలలో కాలిఫోర్నియాలోని ఆపిల్ షో రూంలో ఇదే విధంగా దొంగలు ప్రవేశించి కళ్లు మూసి తెరిచేలోపు సర్వం ఉడ్చేసిన సంగతి తెలిసిందే. దాదాపు అక్కడ రూ.18 లక్షల విలువైన వస్తువులను దొంగలు అపహరించారు.

సీసీటీవీ పుటేజి ప్రకారం

అక్కడ కనిపించిన సీసీటీవీ పుటేజి ప్రకారం ముగ్గురు యువకులు మాస్కులు ధరించి నిమిషాల వ్యవధిలో షోరూంలోని అన్ని వస్తువులను కొల్లగొట్టినట్లు తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Apple products worth Rs 2 crore including iPhones stolen from Apple showroom in Indore: Read details More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X