'ఎయిడ్స్ డే' రోజు యాపిల్ కంపెనీ వినూత్న కార్యక్రమం

Posted By: Super

'ఎయిడ్స్ డే' రోజు యాపిల్ కంపెనీ వినూత్న కార్యక్రమం

డిసెంబర్ 1 (ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం) అన్న విషయం అందరికి తెలిసిందే. ఈ రోజుని యాపిల్ వినూత్న రీతిలో ప్రమోట్ చేస్తుంది. ఎయిడ్స్ డే సందర్బంగా ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు గాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యాపిల్ రిటైల్ స్టోర్స్‌లలో ఈరోజు రెడ్ ఐపాడ్, ఐప్యాడ్ స్మార్ట్ కవర్‌ని హైలైట్ చేయనుందని యాపిల్ స్టోర్‌లో పని చేస్తున్న అధికారులు ఓ ప్రముఖ దిన పత్రికకు తెలిపారు.

మొట్టమొదటి సారిగా యాపిల్ రెడ్ ఐపాడ్ నానోని 2006వ సంవత్సరంలో కనిపెట్టడం జరిగింది. సింగర్ బోనో ఛారిటీ కార్యక్రమాలకు అనుగుణంగా దీనిని కనుగొన్నారు. యాపిల్ రెడ్ ఐపాడ్ నానోని కనుగొనడంలో యాపిల్ మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్ చేసిన సేవలు హార్షణీయం. ఈ కార్యక్రమం ద్వారా యాపిల్ రెడ్ ఐపాడ్ నానో సుమారు ఛారిటీ కార్యక్రమాలకు $180 మిలియన్లను అందించింది.

గతంలో యాపిల్ కంపెనీ సీఈవోగా స్టీవ్ జాబ్స్ ఉన్నప్పుడు ఛారిటీ కార్యక్రమాలకు తనవంతు సహాయం అందించడమే కాకుండా, మొదటి పాత్రలో ఉండి వాటిని సక్సెస్ చేసేవాడు. అదే బాటలో ఇప్పుడున్న సీఈవో టిమ్ కుక్ కూడా తనవంతు సహాయ సహాకారాలను ఛారిటీలకు అందించే భాగంలో ఈరోజు ఈ యాపిల్ రెడ్ నానోలకు శ్రీకారం చుట్టారు. పోయిన నెలలోనే యాపిల్ కంపెనీ ఈ ఛారిటీ కార్యక్రమానికి గాను సుమారు $1.3 మిలియన్ విరాళాలను అందించడం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot