శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్‌పై కోర్టుకెక్కిన టెక్నాలజీ దిగ్గజం యాపిల్

Posted By: Staff

శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్‌పై  కోర్టుకెక్కిన టెక్నాలజీ దిగ్గజం యాపిల్

బోస్టన్: కొరియన్ కంపెనీ శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్‌పై టెక్నాలజీ దిగ్గజం యాపిల్ కోర్టుకెక్కింది. తమ ఐప్యాడ్ ట్యాబ్లెట్ పీసీలు, ఐఫోన్‌లను శామ్‌సంగ్ కాపీ కొడుతోందంటూ ఉత్తర కాలిఫోర్నియా కోర్టులో కేసు వేసింది. ప్రోడక్టు డిజైనింగ్ సహా ప్యాకేజింగ్, యూజర్ ఇంటర్‌ఫేస్ వంటివన్నీ మక్కీకి మక్కీ తమ ఉత్పత్తుల్లాగానే ఉన్నాయని యాపిల్ పేర్కొంది. దీన్ని పేటెంట్, ట్రేడ్‌మార్క్ హక్కుల ఉల్లంఘనగా పిటీషన్లో వివరించింది.

శామ్‌సంగ్ సొంతంగా టెక్నాలజీని అభివృద్ధి చేసుకోకుండా యథేచ్ఛగా తమ ఉత్పత్తులను కాపీ కొడుతోందని యాపిల్ ఆరోపించింది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ ఐ9000 మోడల్.. పూర్తిగా తమ ఐఫోన్ 3జీఎస్‌ను పోలి ఉండటాన్ని ఇందుకు నిదర్శనంగా చూపించింది. తాము సొంత టెక్నాలజీపైనే ఆధారపడతామని, అదే తమ విజయ రహస్యమని శామ్‌సంగ్ పేర్కొంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting