సంచలనం రేపుతున్న ఆపిల్ కొత్త ప్రాజెక్ట్

Written By:

రోజు రోజుకు పెరిగిపోతున్న వ్యర్థాలతో గాలి,నీరు, భూమి మొత్తం కలుషితం అవుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో ప్రకృతి విపరీతంగా కలుషితం అవుతుందంటూ పర్యావరణ వేత్తలు గగ్గోలు పెడుతున్నారు. వాడేసిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లతో ఎలక్ట్రానిక్ వ్యర్థ్యాలు విపరీతంగా పెరిగి భూ వినాశనం తప్పేటట్లు లేదు. వీటని రీ సైక్లింగ్ చేయకపోతే రానున్న కాలంలో పెనువినాశనం తప్పదని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ దశలో ఆపిల్ కంపెని ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Read more :ఇది కోలుకోలేని షాక్ : స్మార్ట్‌ఫోన్లే తుఫాకులు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాడేసిన వ్యర్థాలు తగిన విధంగా రీసైకిల్ చేయకపోతే

1

వాడేసిన వ్యర్థాలు తగిన విధంగా రీసైకిల్ చేయకపోతే భూమి, గాలి, నీరు మరింత కలుషితమవుతుందని ఆందోళన చెందుతున్న వారందరికీ ఇదో శుభవార్తే.

ఈ సమస్యకు ఓ రోబోతో చెక్ చెప్పేందుకు

2

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్..ఈ సమస్యకు ఓ రోబోతో చెక్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఫొటోలో కనిపిస్తున్నది ఆ రోబోనే. పేరు లియాం.

స్టోర్స్‌లోకి తిరిగి వచ్చిన ఐఫోన్లను

3

స్టోర్స్‌లోకి తిరిగి వచ్చిన ఐఫోన్లను ఏ భాగానికి ఆ భాగాన్ని విడదీసి అవసరమైన వాటిని మళ్లీ వాడుకునేందుకు, సులువుగా రీసైకిల్ చేసేందుకు దీన్ని వాడుకోవాలని ఆపిల్ నిర్ణయించింది.

మొత్తం 29 రోబో ప్లాట్‌ఫామ్స్ ఉన్న లియామ్

4

మొత్తం 29 రోబో ప్లాట్‌ఫామ్స్ ఉన్న లియామ్ ఏక కాలంలో 40 వరకూ ఐఫోన్లను రీసైకిల్ చేయగలదు.

స్క్రూలను విడదీయడం మొదలుకొని

5

గట్టిగా బిగించిన స్క్రూలను విడదీయడం మొదలుకొని, ఫోన్ బ్యాటరీల్లోని రసాయనాలను వేరు చేయడం వరకూ... అన్ని కఠినమైన, సంక్లిష్టమైన పనులు చేపట్టేందుకు ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి.

ఆసక్తికరమైన ఈ వీడియో

6

మరిన్ని వివరాలకు... ఆసక్తికరమైన ఈ వీడియో చూడండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write Apple Tackles E Waste With iPhone Recycling Robot Liam
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting