ఆపిల్ AI డాక్టర్.. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ఎలా ఉపయోగపడుతుంది..?
ఆపిల్ (Apple) ఇప్పటికే గ్యాడ్జెట్స్ అనేక హెల్త్ ఫీచర్‌లు, ట్రాకర్‌లు, ఎమర్జెన్సీ ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఆపిల్ వాచ్ సహా ఇతర డివైజ్‌లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఈ ఫీచర్ల ద్వారా ఇప్పటికే ఎంతో మంది యూజర్‌ల ప్రాణాలను కాపాడించింది. వారి ఆరోగ్య సమస్యలను ముందుగా గుర్తించి. అప్రమత్తం చేసింది. దీంతోపాటు ఎమర్జెన్సీ సమయాల్లో వైద్యసాయం అందేలా పనిచేసింది. ఇందులో ఫాల్ డెటెక్షన్, SOS వంటి అనేక ఫీచర్‌లు ఉన్నాయి. ఏయే ఫీచర్‌లు ఎలాంటి సందర్భాల్లో యూజర్లు రక్షించాయో వంటి వివరాలు ఇప్పటికే వివిధ సందర్భాల్లో వెల్లడయ్యాయి.
మరిన్ని కచ్చితమైన సలహాలు :
తాజాగా అందుతున్న వివరాల ఆధారంగా ఆపిల్ మరిన్ని కొత్త ఫీచర్‌లను తీసుకురానుంది. ఆపిల్ ప్రస్తుతం తన ఉత్పత్తుల ద్వారా ECG, హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2, స్లీప్ ట్రాకర్ సహా మరిన్ని ఫీచర్‌లను కలిగి ఉంది. అయితే ప్రస్తుతం AI డాక్టర్ ఫీచర్ పైన పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మార్క్ గుర్మాన్ ఈ వివరాలను వెల్లడించారు. దీని ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని కచ్చితమైన సూచనలు ఇచ్చే అవకాశం ఉంది.

AI మోడల్‌గా :
మార్క్ గుర్మాన్ తాజా నివేదిక ఆధారంగా ఆపిల్ అతిపెద్ద హెల్త్ మెట్రిక్స్ పైన (Apple AI Doctor) పనిచేస్తోంది. ఈ ఫీచర్ హెల్త్ యాప్‌లో వర్చువల్ డాక్టర్ తరహాలో ఉంటుందని తెలుస్తోంది. ఆపిల్ యూజర్ల హెల్త్ డేటా ఆధారంగా సూచనలు చేస్తుందని సమాచారం. ఈ ఫీచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుందని తెలుస్తోంది.
ప్రత్యేక బృందాలను నియమించుకున్న ఆపిల్ :
ఇందుకోసం యాపిల్ ఇప్పటికే నిపుణులు అయిన వైద్యులను నియమించుకుందని, వీరి ద్వారా తన హెల్త్ AI ఫీచర్‌కు ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్ మల్బరీ పేరుతో హెల్త్ యాప్ పైన పనిచేస్తుందని సమాచారం. ఈ కొత్త ఫీచర్‌లు iOS 19 లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఆపిల్ డివైజ్‌లు సేకరించిన వివరాల ఆధారంగా కీలక సిఫార్సులు చేసే AI హెల్త్ కోచ్‌గా వ్యవహరిస్తుందని తెలుస్తోంది. ఆపిల్ వాచ్ సహా ఇతర ఉత్పత్తుల ద్వారా హార్ట్ రేట్, స్లీప్ సైకిల్, ఇతర ఆరోగ్యానికి సంబంధించిన అనేక వివరాలు సేకరిస్తుంది. ఆపిల్ మెషిన్ లెర్నింగ్ సామర్థ్యాలతో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను విశ్లేషించి, నివేదిక రూపంలో అందిస్తుంది.
వివిధ విభాగాల్లో వైద్యుల నియామకం :
అయితే ఈ ఆపిల్ అందించే ఆరోగ్య సూచనలు ఎంత కచ్చితత్వంతో ఉంటాయనే సందేశాలు ఎవరికైనా రావచ్చు. ఇందుకోసం ఆపిల్ ప్రత్యేక వైద్య బృందాలను నియమించుకుంది. స్లీప్ సైన్స్, ఫిజికల్ థెరపీ, కార్డియాలజీ, న్యూట్రిషన్ రంగాల్లో నిపుణులను ఎంపిక చేసుకుంది. వీరి ద్వారా తన AI మోడల్‌కు ట్రైనింగ్ ఇస్తోంది.
అయితే ఇందులో సబ్‌స్క్రిప్షన్ తరహా ప్లాన్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై పూర్తి స్థాయిలో సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. ఆపిల్ హెల్త్ యాప్‌లో త్వరలో మరిన్ని ఫీచర్‌లు జతకానున్నట్లు తెలుస్తోంది. ఆహార నియమాలు సహా కేలరీల ఖర్చు వంటి ఫీచర్‌లు ఉండే అవకాశం ఉంది.
ఆపిల్ AI హెల్త్ మోడల్‌పై త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆపిల్ హెల్త్ ట్రాకర్‌లు, ఫీచర్‌లు యూజర్లకు సాయం చేస్తున్నాయి. ఈ కొత్త మోడల్ కూడా ఆపిల్ యూజర్‌లకు మరింత సహాయంగా ఉండే అవకాశం ఉంది. అయితే దీనిపై ఆపిల్ ఎటువంటి ప్రకటన చేయలేదు.


Click it and Unblock the Notifications








