Just In
- 3 hrs ago
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- 22 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 24 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 1 day ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
Don't Miss
- News
girlfriend: సీక్రేట్ గా పెళ్లి, కొండ మీద రొమాన్స్, పోలీసు అధికారి కొడుకు ఏం చేశాడంటే, ఇంట్లోనే కిల్లర్!
- Sports
ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుంది.. టీమిండియాపై మాజీ లెజెండ్ నమ్మకం
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Movies
Waltair Veerayya: చిరంజీవికి చెడు అలవాట్లు, జోక్ కాదు బ్రదర్.. రైటర్ బీవీఎస్ రవి కామెంట్స్!
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
iPhone 14 సహా, రానున్న iPhone సిరీస్‌లలో పలు కీలక మార్పులు!
Apple కంపెనీ నుంచి త్వరలో iPhone 14 సిరీస్ మొబైల్స్ విడుదల కానున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ నెలలో విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు టెక్ వర్గాలు ఇప్పటికే లీకులిచ్చాయి. అయితే, ఈ రాబోయే iPhone 14 సరీస్ మొబైల్స్ యాపిల్ పాత మోడల్స్ తో పోలిస్తే పలు ప్రధాన మార్పులతో రానున్నట్లు సమాచారం. చిప్ విషయంలోనే కాకుండా, ధర మరియు పలు మార్పులతో రానున్నాయి.

యాపిల్ కంపెనీ పాత జనరేషన్ చిప్‌తో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడం ఇదే తొలిసారి. iPhone 14, iPhone 14 మాక్స్ రెండు మోడల్స్ కూడా iPhone 13 మాదిరి A15 బయోనిక్ చిప్‌తో రానున్నట్లు తెలుస్తోంది. కానీ, ప్రో ఫోన్లు మాత్రం కొత్త చిప్‌సెట్‌తో రానున్నాయి. iPhone 14 Pro, iPhone 14 Pro Max మొబైల్స్ A16 బయోనిక్ చిప్‌తో రానున్నాయని అంచనా.
ఇందుకు సంబంధించి ప్రముఖ టెక్ విశ్లేషకుడు మింగ్ చి కువో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రాబోయే iPhone 14, iPhone 14 మాక్స్ రెండు మోడల్స్ కూడా iPhone 13 మాదిరి A15 బయోనిక్ చిప్‌తో రానున్నట్లు తెలుస్తోంది. యాపిల్ భవిష్యత్తులో కూడా ఇదే పద్దతి అవలంభించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో iPhone 15, iPhone 15 మాక్స్ లకు పాత A16 బయోనిక్ చిప్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఇక iPhone 15 ప్రో మోడల్స్ కు మళ్లీ కొత్త బయోనిక్ చిప్ A17 ను అందుబాటులోకి తేనుంది. ఈ పద్దతిని యాపిల్ ఎందుకు పాటిస్తోందంటే.. ఐఫోన్ ప్రియులు లేటెస్ట్ చిప్ సెట్ కలిగిన యాపిల్ మొబైల్ ను వినియోగించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ధర ఎక్కువ కలిగిన ప్రో మోడల్స్ కొనుగోలు చేయాల్సి వస్తుంది. చిప్‌సెట్ ధరలు తీవ్రంగా పెరిగిన క్రమంలోనే యాపిల్ సంస్థ ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవే కాకుండా iPhone 14 సిరీస్‌లో మరిన్ని మార్పులు:
iPhone 13 ప్రారంభ ధరతో పోలిస్తే, బేస్ మోడల్ ఐఫోన్‌ల ధర కూడా బాగానే పెరుగుదల ఉండబోతోంది. అలాగని iPhone 14 మాక్స్ ధర ఎంత ఉంటుందనేది ఖచ్చితంగా చెప్పలేం. గ్యాడ్జెట్ టెండెన్సీ నివేదికలో ఉదహరించిన డేటా ప్రకారం, iPhone 14 Pro 128GB వేరియంట్ ప్రారంభ ధర $1,100 ఉండొచ్చని అంచనా. మరోవైపు, iPhone 14 Pro Max 128GB బేస్ వేరియంట్ ధర $1,200 ఉండొచ్చని నివేదిక అంచనాల ప్రకారం తెలుస్తోంది. ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్‌లో మెరుగైన ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను కూడా ఉపయోగించబోతున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఇక ప్రో మోడల్స్ విషయానికి వస్తే వీటికి ఈ సారి నాచ్ లేకుండా వస్తున్నాయని లీకు నివేదికలు పేర్కొన్నాయి.
కొత్త iPhone 14 స్మార్ట్‌ఫోన్ 3,279mAh బ్యాటరీతో వస్తుందని, మరియు iPhone 14 Pro 3,200mAh బ్యాటరీతో రావచ్చని ఇటీవలి నివేదిక లీకులిచ్చింది. మరోవైపు, చైనా మార్కెట్లో ఐఫోన్ 13 తో పోలిస్తే ఐఫోన్ 14కు డిమాండ్ ఉండబోతుందని కువో తెలిపారు. డిమాండ్‌ను ముందుగా గుర్తించిన పలువురు చైనీస్ డిస్ట్రిబ్యూటర్‌లు, రిటైలర్లు ముందస్తుగా తగినంత సప్లై కోసం అధిక డిపాజిట్లు చేస్తున్నట్లు కువో తన సర్వే ద్వారా తెలిసినట్లు పేర్కొన్నారు.

iPhone14 మ్యాక్స్ లీక్ స్పెసిఫికేషన్‌ల వివరాలు
iPhone14 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ కి సంబందించిన స్పెసిఫికేషన్స్ వివరాలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ లీక్ సమాచారం ప్రకారం ఆపిల్ సంస్థ నుంచి రాబోయే ఐఫోన్ 14 మ్యాక్స్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.68-అంగుళాల ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 2,778×1,284 పరిమాణంలో 458 పిక్సెల్‌ల(PPI) సాంద్రతను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుత జెనరేషన్ A15 బయోనిక్ SoCతో రన్ అవుతూ 6GB LPDDR4X RAMతో జతచేయబడి వస్తుంది. ప్రస్తుతం అదే చిప్ తో ఐఫోన్13 సిరీస్ ఫోన్లు మరియు కొత్త ఐఫోన్ SE (2022) కూడా శక్తిని పొందుతున్నాయి. గత లీక్‌ల ప్రకారం ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్14 ప్రో మాక్స్ ఫోన్లు రెండు కూడా A16 బయోనిక్ SoCలతో శక్తిని పొందే అవకాశం ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470