సెప్టెంబ‌ర్ 7న Apple నుంచి ఏడు కొత్త డివైజ్‌లు రానున్నాయ్‌!

|

ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం Apple, త‌మ కంపెనీ నుంచి త‌దుపరి తరం iPhoneలను ఆవిష్కరించడానికి సిద్ధ‌మ‌వుతోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 7వ తేదీన పెద్ద ఈవెంట్ ను నిర్వహించేందుకు స‌న్నాహాలు చేస్తోంది. iPhone 14 లైనప్ నాలుగు కొత్త మోడళ్లను కలిగి ఉండే అవకాశం ఉంది. దానితో పాటు మూడు కొత్త ఐప్యాడ్ మోడల్స్ కూడా ఉంటాయ‌ని తెలుస్తోంది. అదే విధంగా, వచ్చే నెలలో జరగనున్న ఈవెంట్‌లో Apple మ‌రిన్ని ఆవిష్క‌ర‌ణ‌లు చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు స‌మాచారం.

 
సెప్టెంబ‌ర్ 7న Apple నుంచి ఏడు కొత్త డివైజ్‌లు రానున్నాయ్‌!

Apple కంపెనీ iPhone 14 Mini విడుద‌ల చేయ‌నుందా!
Apple మినీ వేరియంట్‌ను నిలిపివేయాలని యోచిస్తోందని మరియు iPhone 14 మాక్స్‌ను లైనప్‌లో నాల్గవ మోడల్‌గా తీసుకురావచ్చని గతంలో నివేదికలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ప్ర‌ముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ వెల్ల‌డించిన తాజా నివేదిక మాత్రం iPhone 14 మినీ ఈ సంవత్సరం ఆవిష్క‌రించ‌బ‌డుతుంద‌ని పేర్కొంది. iPhone 14 Maxకు బదులుగా, కంపెనీ సెప్టెంబర్ 7 ఈవెంట్‌లో iPhone 13 మినీ సీక్వెల్‌ను తీసుకువస్తుందని Blass 91Mobiles ద్వారా క్లెయిమ్ చేయ‌బ‌డింది.

టిప్‌స్టర్, ఐఫోన్ 14 మ్యాక్స్ కు సంబంధించి ఎటువంటి విష‌యాన్ని తెల‌ప‌లేదు కానీ, ఈ మ్యాక్స్ డివైజ్‌ నాన్-ప్రో మోడల్ అయినప్పటికీ ఫారమ్ ఫ్యాక్టర్ పరంగా ఐఫోన్ 14 ప్రో మాక్స్‌తో సమానంగా ఉంటుందని మునుపటి నివేదికలు తెలిపాయి. ఐఫోన్ 14 సిరీస్‌లో వస్తున్న నాలుగు మోడళ్ల పేర్లు ఏమిటో ఇప్ప‌టి వ‌ర‌కు అధికారికంగా అయితే తెలియ‌రాలేదు. కానీ, ఐఫోన్ 14, ఐఫోన్ 14 మినీ, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ తో గత రెండేళ్లలో కంపెనీ అనుసరించిన నమూనా మాదిరే లాంచ్ అవొచ్చు అని ప‌లు రూమ‌ర్ల ద్వారా తెలుస్తోంది.

సెప్టెంబ‌ర్ 7న Apple నుంచి ఏడు కొత్త డివైజ్‌లు రానున్నాయ్‌!

iPhone 14 లైనప్‌తో పాటు మూడు కొత్త ఐప్యాడ్ మోడల్‌లు ప్రారంభించబడతాయని టిప్‌స్టర్ పేర్కొన్నాడు. వీటిలో ఐప్యాడ్ 10.2 (10వ తరం), ఐప్యాడ్ ప్రో 12.9 (6వ తరం) మరియు ఐప్యాడ్ ప్రో 11 (4వ తరం) ఉండే అవకాశం ఉంది. ఈ క్ర‌మంలో వచ్చే నెల యాపిల్ ఏడు డివైజ్‌ల‌ను స్టాక్ చేయడానికి ప్లాన్ చేస్తోందని టిప్‌స్ట‌ర్ ద్వారా వెల్ల‌డైంది.

నాలుగు ఐఫోన్ 14 మోడల్‌లు మరియు మూడు ఐప్యాడ్ టాబ్లెట్‌లు ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కాబోతున్నాయనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే... లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 7న మరియు మొదటి సేల్ సెప్టెంబర్ 16న జరగవచ్చని గ‌త నివేదికలు సూచించాయి. ఇదే గ‌న‌క జ‌రిగితే.. యాపిల్ కంపెనీ త‌మ ఉత్ప‌త్తుల సేల్స్‌లో ఈ సీజన్ బిజీగా మార‌నుంది.

సెప్టెంబ‌ర్ 7న Apple నుంచి ఏడు కొత్త డివైజ్‌లు రానున్నాయ్‌!

రాబోయే సిరీస్‌లో ప్ర‌త్యేక‌త‌లు!
గత సంవత్సరం మాదిరిగానే, Apple ఐఫోన్ 14 లైనప్‌లో నాలుగు కొత్త మోడళ్లను లాంచ్ చేస్తుంద‌ని భావిస్తున్నారు. మొట్టమొదటిసారిగా, కంపెనీ 6.7-అంగుళాల డిస్‌ప్లేతో నాన్-ప్రో-మాక్స్ iPhone 14 వేరియంట్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే, ఇది నాచ్ లేకుండా, ప్రో మోడల్‌లలో కొత్త కెమెరా డిజైన్ మరియు ఫేస్ ఐడి సెన్సార్ కటౌట్‌లను క‌లిగి ఉంటుంద‌ని భావిస్తున్నారు.

 

iPhone 14 నాన్-ప్రో మోడల్‌లలో iPhone 13 నుండి A15 బయోనిక్ చిప్‌ను ఉప‌యోగిస్తుంద‌ని తెలుస్తోంది. మరోవైపు, iPhone 14 ప్రో మరియు ప్రో మాక్స్ మోడల్‌లు సరికొత్త ఆపిల్ సిలికాన్ A16 బయోనిక్ SoCని అందిస్తున్న‌ట్లు స‌మాచారం. అదనంగా, iPhone 14 ప్రో వేరియంట్‌లు కొత్త 48MP కెమెరా సెన్సార్‌తో రానున్నాయ‌ని లీకుల ద్వారా తెలుస్తోంది.

ధ‌ర‌లు ఎలా ఉండ‌బోతున్నాయి!
ఇటీవలి ఊహాగానాల ప్రకారం, iPhone 14 ధర iPhone 13 మాదిరిగానే ఉంటుందని అంచనా వేయబడింది. కంపెనీ ఇప్పుడు iPhone 14ని భారతదేశంలో తయారు చేస్తున్నందున, ఐఫోన్ 13 లాంచ్ ధరతో పోల్చినప్పుడు.. iPhone 14 ను కొంచెం తక్కువ ధరకు లాంచ్ చేయవచ్చు అని అంతా భావిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Apple To Launch iPhone 14 Mini On September 7; New iPads Incoming

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X