ఇండియాలో ఆపిల్ రిటైల్ స్టోర్స్..

Posted By: Prashanth

ఇండియాలో ఆపిల్ రిటైల్ స్టోర్స్..

 

ఆపిల్ ఓ బ్రాండ్‌కు సూచన. ఎవరైనా ఆపిల్ ఉత్పత్తిని ఉపయోగిస్తున్నారంటే వారు సొసైటీలో లగ్జరీయస్ అన్నమాటే. వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న ఆపిల్ కంపెనీ లండన్, అమెరికా, జపాన్, చైనా లాంటి దేశాలలో రిటైల్ స్టోర్స్‌ని ఏర్పాటు చేసింది. భారత్‌లో ఉన్న ఆపిల్ అభిమానులకు నేను చెప్పే విషయం ఆనందాన్ని కలిగించే అంశం. ఆనందం కలిగించే విషయం ఏమిటంటే భారతదేశంలో ఉన్న ప్రధాన నగరాలలో ఆపిల్ కొత్తగా రిటైల్ స్టోర్స్‌ని ఓపెన్ చేయనున్నట్లు సమాచారం.

ఆపిల్ కొత్తగా ఇండియాలో రిటైల్ స్టోర్స్‌ని ప్రారంభించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం బిజినెస్‌ని విస్తరించుకునే భాగంలో కార్యక్రమేనని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది మాత్రమే కాకుండా ఆపిల్ ఎప్పుడైతే ఇండియాలో తమయొక్క రిటైల్ స్టోర్స్‌ని ప్రారంభిస్తుందో, ఆ తర్వాత ఇండియాలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ధరలు కూడా క్రమంగా తగ్గనున్నాయని అన్నారు. 2012వ సంవత్సరంలో ఆపిల్ భారతదేశం మొత్తం మీద 25 రిటైల్ స్టోర్స్‌ని ఓపెన్ చేయనుంది. దీంతో ఆపిల్ ఉత్పత్తులు ఇండియాలో ఓ సరిక్రొత్త సంచలనానికి నాంది పలకనున్నాయని అందరూ భావిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot