ఇండియా మరో ఆపిల్ రిటైల్ స్టోర్.. ఎప్పుడు ఓపెన్ కానుందంటే?
Apple Bengaluru Store : ఆపిల్ నుంచి తాజాగా కీలక ప్రకటన వెలువడింది. త్వరలో బెంగళూరులో రిటైల్ స్టోర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ రెండో తేదీన ఈ స్టోర్ ను (Apple Hebbal) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఇప్పటికే భారత్ లో రెండు చోట్ల రిటైల్ స్టోర్స్ ను ఆపిల్ ఇప్పటికే ఏర్పాటు చేసింది.
ఎప్పుడు ఓపెన్ కానుంది?
బెంగళూరులో సెప్టెంబర్ 2 వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు Apple Hebbal స్టోర్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ముంబైలో ఆపిల్ BKC స్టోర్, ఢిల్లీలో ఆపిల్ సాకెత్ స్టోర్ ను ఏర్పాటు చేసింది. త్వరలో ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ కానుందనే లీక్స్ నేపథ్యంలో ఆపిల్ నుంచి తాజాగా ప్రకటన వచ్చింది.

డిజైన్ విడుదల :
అయితే బెంగళూరులో ఆపిల్ ప్రారంభించనున్న రిటైల్ స్టోర్ డిజైన్ ను కూడా ఆవిష్కరించింది. నెమలి నుంచి ప్రేరణ పొందినట్లుగా ఉంది. ఈ బెంగళూరులో ఆపిల్ రిటైల్ స్టోర్ ఫినిక్స్ మాల్ లో ఏర్పాటు కానుంది. ఆపిల్ ఇతర రిటైల్ స్టోర్‌ల తరహాలోనే ఉంటుంది. ఈ స్టోర్‌లో ఆపిల్ స్పెషలిస్ట్‌లు, కస్టమర్‌ల కోసం ఇతర బృందాలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
టుడే ఎట్ ఆపిల్ :
ఈ స్టోర్‌లో టుడే ఎట్ ఆపిల్ సెషన్‌లను కూడా నిర్వహిస్తుందని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో వినియోగదారులు నేరుగా ఆపిల్ నిపుణులతో మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇందుకోసం ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ప్రత్యేక సెషన్‌లలో ప్రొడక్టివిటీ సహా ఇతర అంశాలను కవర్ చేస్తారని తెలుస్తోంది. తొలిసారి ఆపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని భావిస్తున్నవారికి ఈ కార్యక్రమం ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే ముంబై, ఢిల్లీలో స్టోర్స్ :
ఆపిల్ సంస్థ తొలిసారిగా 2023 ఏప్రిల్ నెలలో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో Apple BKC రిటైల్ స్టోర్‌ను ప్రారంభించింది. అనంతరం దేశరాజధాని ఢిల్లీలోని సిటీవాక్ మాల్‌లో ఆపిల్ సాకేత్ స్టోర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దక్షిణాదిలో బెంగళూరులో త్వరలో మరో స్టోర్ రానుంది.
సెప్టెంబర్‌లోనే ఐఫోన్ 17 సిరీస్! :
ప్రస్తుతం ఉన్న లీక్స్ ఆధారంగా ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ సెప్టెంబర్‌లో జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 17, ఐపోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాజ్స్ మోడల్స్ లాంచ్ కానున్నాయి. గత సిరీస్‌లో ఉన్న ప్లస్ మోడల్‌కు బదులుగా ఈసారి ఎయిర్ మోడల్‌ను తీసుకొస్తున్నారు.
అయితే ఐఫోన్ 17 ఎయిర్ మోడల్ సన్నని ప్రీమియం ఫోన్‌గా ఉండనున్నట్లు లీక్స్ వచ్చాయి. దీంతోపాటు గత సిరీస్‌తో పోలిస్తే హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ పరంగానూ అనేక మార్పులు రానున్నట్లు లీక్స్ ఆధారంగా తెలుస్తోంది. ముఖ్యంగా కెమెరా విభాగం, బ్యాటరీ సామర్థ్యాలు మరింత మెరుగవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ మోడల్ బ్యాటరీ తక్కువగా ఉన్నా.. మెరుగైన సామర్థ్యాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications







