మార్కెట్లోకి యాపిల్ కొత్త ఐపాడ్ టచ్@ధర రూ.16,900

Posted By:

టెక్నాలజీ దిగ్గజం యాపిల్ కొత్త ఐపాడ్ టచ్ ( iPod touch)ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. పింక్, ఎల్లో, బ్లూ కలర్ వేరియంట్‌లలో లభ్యమయ్యే ఈ పోర్టబుల్ మీడియా ప్లేయర్ 16జీబి వర్షన్ ధరను రూ.16,900గా యాపిల్ ప్రకటించింది. 32జీబి వర్షన్ ధర రూ.20,900. 64జీబి వర్షన్ ధర రూ.24,900 అని యాపిల్ పేర్కొంది.

మార్కెట్లోకి యాపిల్ కొత్త ఐపాడ్ టచ్@ధర రూ.16,900

ఈ ఐపోడ్ టచ్‌లో నిక్షిప్తం చేసిన 5 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా ద్వారా హైడెఫినిషన్ రికార్డింగ్ సాధ్యమవుతుంది. 4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే, ఏ5 ప్రాసెసింగ్ చిప్, ఫేస్‌టైమ్ కెమెరా ఈ కొత్త ఐపాడ్ టచ్‌కు ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తాయి. ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైస్ స్పందిస్తుంది. సెప్టంబర్ తరువాత ఈ మీడియా ప్లేయర్ ఐఓఎస్ 8 వర్షన్ ఆపరేటింగ్ సిస్టంను సపోర్ట్ చేస్తుంది. కెమెరా యాప్ ఫిల్టర్స్ వంటి 200 పైగా ప్రత్యేక ఫీచర్లను ఈ డివైస్ కలిగి ఉంది.

యాపిల్ తన మొట్టమొదటి ఐపాడ్‌ని 2001లో ప్రవేశపెట్టింది. ఆ తరువాత పలు మార్పు చేర్పులతో ఐపాడ్ షఫుల్, ఐపాడ్ నోనా, ఐపాడ్ టచ్, ఐపాడ్ క్లాసిక్ వేరియంట్‌లలో ఐపాడ్‌లను యాపిల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం సెప్టంబర్ 28, 2013తో ముగిసిన ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా యాపిల్ 2.63 కోట్ల ఐపాడ్‌లను విక్రయించింది.


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot