IPhone 13 సిరీస్ లో సంస్థ ఉపయోగించే కొత్త ఫీచర్స్ ఇవే!!!

|

కుపెర్టినో టెక్ దిగ్గజం ఆపిల్ ఈ సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్‌ నెలలో కొత్త ఐఫోన్ 13 సిరీస్‌తో విడుదల కానుంది. ఈ టెక్ దిగ్గజం ఐఫోన్ 13 సిరీస్‌లో వినియోగదారులు అనేక సంవత్సరాలుగా కోరుతున్న అనేక పెద్ద మార్పులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ లీకుల ప్రకారం ఐఫోన్ 13 సిరీస్ గతంలో ఏ ఇతర ఐఫోన్ కంటే పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుందని భావిస్తున్నారు. ఐఫోన్‌ల బ్యాటరీ పనితీరుతో కాస్త నిరుత్సాహపడిన ఆపిల్ అభిమానులకు ఇది శుభవార్త. అంతేకాకుండా ఐఫోన్ 13 సిరీస్ విస్తృత mmWave 5G సపోర్ట్‌తో వస్తుందని భావిస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

IPhone 13 సిరీస్ లో A15 బయోనిక్ 5nm+

IPhone 13 సిరీస్ లో A15 బయోనిక్ 5nm+

కొన్ని లీక్ల ప్రకారం ఐఫోన్ 13 సిరీస్‌ సరికొత్త A15 బయోనిక్ చిప్‌సెట్ 5nm+ ప్రాసెస్‌పై ఆధారపడి ఉండే అవకాశం ఉంది. ఇంకా ఆపిల్ ఐఫోన్‌ల కోసం mmWave 5G సపోర్ట్‌ను USA వెలుపల iPhone 13 సిరీస్‌తో పరిచయం చేయవచ్చు.

PF అకౌంట్ లేదా UAN తో ఆధార్‌ని లింక్ చేయడం ఎలా?PF అకౌంట్ లేదా UAN తో ఆధార్‌ని లింక్ చేయడం ఎలా?

25W ఫాస్ట్ ఛార్జింగ్

అంతేకాకుండా ఐఫోన్ 13 సిరీస్ డివైస్ లు పెద్ద బ్యాటరీలతో ప్యాక్ చేయబడి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా వినియోగదారులు 25W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతును కూడా పొందే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే ఐఫోన్ 13 సిరీస్ డివైస్ ల నాచ్ చిన్నదిగా ఉంటుందని భావిస్తున్నారు. ఆపిల్ ఐఫోన్ 13 ఫోన్ 1TB వేరియంట్‌తో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

పెద్ద బ్యాటరీ

ఐఫోన్ కొత్త సిరీస్ లలో పెద్ద బ్యాటరీతో పాటుగా వేగవంతమైన ఛార్జింగ్ మద్దతు ఫీచర్లను కలిగి ఉండడం వినడానికి చాలా బాగుంది. అయితే ఈ పరికరాల ధర గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రారంభించిన ఐఫోన్ 12 సిరీస్‌తో సమానంగా ఉండాలి. ఐఫోన్ 13 సిరీస్‌తో వినియోగదారులు పొందగలిగే మరో ప్రధాన అప్‌గ్రేడ్ అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే. ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో 120Hz రిఫ్రెష్ రేట్‌కి మద్దతు ఇవ్వడానికి Apple శామ్‌సంగ్ LTPO డిస్‌ప్లేను ఉపయోగించవచ్చు. చిప్ కొరతతో ఐఫోన్ 13 సిరీస్ ఎలా ప్రభావితమవుతుందో చెప్పడం లేదు. అయితే ఆపిల్ తన అభిమానుల అభ్యర్ధనలను పరిష్కరిస్తోంది మరియు ఐఫోన్ 13 సిరీస్‌లో అప్‌గ్రేడ్ హార్డ్‌వేర్‌ని తీసుకువస్తుందని వినడం ఓదార్పునిస్తుంది.

Best Mobiles in India

English summary
Apple Upcoming iPhone 13 Expected Comes With mmWave 5G Support New Features

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X