Home
News

ఆపిల్‌ నుంచి త్వరలో ఏయే ఉత్పత్తులు లాంచ్ కానున్నాయో తెలుసా.. ఫోల్డబుల్‌ ఐఫోన్లు, ఐప్యాడ్‌లు సహా..!!

ప్రముఖ టెగ్‌ దిగ్గజం ఆపిల్‌ (Apple Upcoming Products list) సంస్థ త్వరలో అనేక ఉత్పత్తులను లాంచ్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ జాబితాలో ఐఫోన్ SE, ఫోల్డబుల్‌ ఐఫోన్‌, ఫోల్డబుల్‌ ఐప్యాడ్‌ లను అభివృద్ధి చేస్తోంది. దీంతోపాటు OLED స్క్రీన్‌లతో కూడిన ఐప్యాడ్‌లను కూడా త్వరలో ఆవిష్కరించనుందని తెలుస్తోంది.

ఆపిల్‌ నుంచి త్వరలో రానున్న ఉత్పత్తులు! :
టిప్‌స్టర్‌ techreve ఆధారంగా ఈ ఉత్పత్తులను 2024 -27 మధ్య కాలంలో లాంచ్‌ కానున్నాయి. 2025 సంవత్సరం తొలిరోజుల్లో ఐఫోన్‌ SE 4 ను మిడ్‌రెంజ్‌ సెగ్మెంట్‌లో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఐఫోన్‌ SE 4 (iPhone SE 4 Smartphone) గతం కంటే మెరుగైన డిజైన్‌, OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

Apple Upcoming Products

ఫోల్డబుల్‌ ఐఫోన్‌, ఐప్యాడ్‌..: దీంతో పాటుగా ఆపిల్‌ సంస్థ 2026 సంవత్సరంలో 8 అంగుళాల ఫోల్డబుల్‌ ఐఫోన్‌ ( Foldable iPhone ) ను లాంచ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తోంది. అనంతరం 20 అంగుళాల ఫోల్డబుల్‌ ఐప్యాడ్‌ ( Foldable iPad ) ను 2027 సంవత్సరం నాటికి విడుదల చేయాలని ఆపిల్‌ ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే దీనిపై గతంలోనే లీక్‌లు బయటకు వచ్చాయి.

ఈ ఉత్పత్తులతోపాటు 2027 సంవత్సరంలో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రియాలిటీ గ్లాస్‌ను కూడా విడుదల చేయనుంది. అయితే దీని గురించి ఎక్కువ సమాచారం వెల్లడికాలేదు. దీంతోపాటు అందుబాటు ధరలో ఆపిల్‌ విజన్‌ ప్రో ( Apple Vision Pro ) ను 2026 సంవత్సరంలో లాంచ్‌ చేయనున్నారని తెలుస్తోంది. దీంతో మిక్సిడ్ రియాలిటీ ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆపిల్ సంస్థ నిర్ణయించుకుంది.

OLED డిస్‌ప్లేతో..: ఈ ఆపిల్‌ ఉత్పత్తులతోపాటు 2026 నాటికి OLED మ్యాక్‌బుక్‌ ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. మరియు 11 అంగుళాలు, 12.9 అంగుళాల ఐప్యాడ్‌ ప్రో OLED వెర్షన్‌లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సంవత్సరం చివరి నాటికే ఈ రెండు వెర్షన్‌లను లాంచ్‌ చేసే అవకాశం ఉంది. అయితే ఇవి కేవలం లీక్‌లు మాత్రమే వీటిపై ఆపిల్ సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

జూన్‌లో WWDC .. కీలక ప్రకటనలకు అవకాశం : అయితే ఆపిల్‌ వరల్డ్‌వైడ్‌ డెవలపర్‌ కాన్ఫరెన్స్ ( WWDC ) జూన్‌ 2024లో జరగనుంది. ఈ ఈవెంట్‌లో iOS 18 పైన సంస్థ ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతోపాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ సహా ఇతర సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లపై ఆపిల్‌ సంస్థ నుంచి కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple Upcoming Products list has leaked iphone SE 4 foldable iphone and more
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X