8 గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లను నిషేధించాలంటూ ఆపిల్ దావా!

Posted By: Prashanth

8 గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లను నిషేధించాలంటూ ఆపిల్ దావా!

 

ఆపిల్, సామ్‌సంగ్‌ల మధ్య కొనసాగుతున్న వైరం రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. తాజాగా యూఎస్ మార్కెట్ నుంచి 8 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లను నిషేదించాలంటూ ఆపిల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

నిషేధించాలంటూ కోర్టుకు సమర్పించిన నివేదికలో ఆపిల్ పేర్కొన్న గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‍‌‌ల వివరాలు:

గెలాక్సీ ఎస్ 4జీ,

గెలాక్సీ ఎస్2 (ఏటీ&టీ),

గెలాక్సీ ఎస్2 (స్కై రాకెట్),

గెలాక్సీ ఎస్2 (టీ-మొబైల్),

గెలాక్సీ ఎస్2 (ఎపిక్ 4జీ),

గెలాక్సీ ఎస్ షోకేస్,

డ్రాయిడ్ ఛార్జ్,

గెలాక్సీ ప్రివెయిల్.

సామ్‌సంగ్‌కు చెందిన 8 గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు పేటెంట్ హక్కులను ఉల్లంఘించిన తీరును ఉటంకిస్తూ ఆపిల్ విడుదల చేసిన చార్ట్‌ను కింద చూడొచ్చు. ఆపిల్ దాఖలు చేసిన పిటీషన్ సెప్టంబర్ 20న వాదనలకు రానుంది.

8 గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లను నిషేధించాలంటూ ఆపిల్ దావా!

ఆపిల్ టార్గెట్ చేసిన 8 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లలో చాలా వరకు ఐఫోన్‌తో పోలిస్తే తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. ఈ ప్రభావం వ్యాపారం పై చూపుతుండటంతో ఆపిల్, సౌత్ కొరియా టెక్ దిగ్గజం పై గుర్రుగా ఉంది. ఈ పిటీషన్‌కు సంబంధించి రుజువులు ఆపిల్ వద్ద ధృడంగా ఉండటంతో కోర్టు తీర్పు ఆపిల్‌కు అనుకూలంగా వచ్చే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read In English

గడిచిన శుక్రవారం అమెరికాలోని శాన్‌‌‌జోస్‌ కోర్టులో సామ్‌సంగ్ పై ఆపిల్‌ వేసిన పెటెంట్‌ కేసుకు సంబంధించి తీర్పు ఆపిల్‌కు అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. ఆపిల్‌కు బిలియన్‌ డాలర్లు చెల్లించాలని సామ్‌సంగ్‌ను న్యాయస్థానం ఆదేశించింది. అయితే సామ్‌సంగ్ మాత్రం తీర్పుతో సంతృప్తి చెందలేదు పైకోర్టుకు వెళతామని ప్రకటించింది. దీన్ని వదిలిపెట్టే ప్రసక్తిలేదని తేల్చి చెప్పింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

droid-charge

droid-charge

galaxy-prevail

galaxy-prevail

galaxy-s-4g

galaxy-s-4g

galaxy-s-showcase

galaxy-s-showcase

galaxy-s2-att

galaxy-s2-att

galaxy-s2-epic-4g

galaxy-s2-epic-4g

galaxy-s2-skyrocket

galaxy-s2-skyrocket

galaxy-s2-t-mobile

galaxy-s2-t-mobile
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot