Home
News

iPhone 15 pro, iPhone 15 pro max ఫోన్లు విడుదల.. ధర, ఫీచర్లు.. !

ఆపిల్‌ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న iphone 15 pro, iphone 15 pro max స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు కొత్త కస్టమైజెడ్‌ యాక్షన్‌ బటన్‌లను కలిగి ఉంటాయి. ఫోటోలు తీయడం సహా ఇతర అనేక పనులకు ఈ బటన్‌లు ఉపయోగపడతాయి.

ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ఫ్లాట్‌ ఎడ్జ్‌ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ ఫోన్లు కూడా ఇదే డిజైన్‌ కలిగి ఉన్నాయి. అల్యూమినియం ఫ్రేమ్ కారణంగా ఈ ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్లు చాలా తేలికగా ఉంటాయని ఆపిల్‌ సంస్థ చెబుతోంది.

iphone 15 pro and iphone 15 pro max launched

ఈ రెండు ఫోన్లు ప్రోమోషన్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తాయి. అయితే ఐఫోన్ 15 ప్రో 6.1 అంగుళాల డిస్‌ప్లే, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు A17 ప్రో బయోనిక్‌ చిప్‌ ఆధారంగా పనిచేస్తాయి. మెరుగైన పనితీరును కనబరుస్తాయి. ఈ రెండు ఫోన్లు మల్టీ టాస్కింగ్‌, సమర్థవంతంగా శక్తిని ఉపయోగించుకుంటాయి.

ఆపిల్‌ ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మాక్స్‌ రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా టైప్‌-C పోర్టును కలిగి ఉంటాయి. అయితే USB 3 పోర్టు ద్వారా వేగవంతమైన బదిలీ వేగాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్ల కెమెరా విభాగాలను ఆపిల్ అప్‌గ్రేడ్‌ చేసింది.

iphone 15 pro and iphone 15 pro max launched

ఆపిల్‌ ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మాక్స్‌ స్మార్ట్‌ఫోన్లు పెరిస్కోపిక్‌ లెన్స్‌తోపాటు ట్రిపుల్‌ కెమెరా వ్యవస్థను కలిగి ఉంటాయి. 48MP ప్రధాన కెమెరాతోపాటు అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, టెలీఫోటో లెన్స్‌ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. దీంతోపాటు మెరుగైన ఫోటోగ్రఫీ, AI అల్గారిథం కారణంగా తక్కువ కాంతిలోనే చాలా నాణ్యమైన ఫోటోలు తీసుకోవచ్చు.

ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మాక్స్‌ స్మార్ట్‌ఫోన్లు iOS 17 ఆధారంగా పనిచేస్తాయి. ఫలితంగా కొత్త ఫీచర్లు సహా మెరుగైన పనితీరును కలిగి ఉంటాయి. అయితే ఐఫోన్ 15 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 128GB ధర రూ.134,900గా ఉంది. అదే ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ 256GB వేరియంట్‌ రూ.159,900గా ఉంది.

* అయితే ఈ ఈవెంట్‌లో ఐఫోన్‌ 15, 15 ప్లస్‌ ఫోన్లు కూడా విడుదల అయ్యాయి. ఇవి OLED సూపర్‌ రెటినా డిస్‌ప్లేతో వస్తాయి. గరిష్ఠ బ్రైట్‌నెస్‌ 2000 నిట్స్‌ వరకు ఉంటుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లు వేర్వేరు డిస్‌ప్లే సైజులను కలిగి ఉంటుంది. ఐఫోన్ 15.. 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అదే 15 ప్లస్‌ 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Apple wonderlust event 2023 live apple iphone 15 pro and iphone 15 pro max launched
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X