దివ్యాంగుల కోసం 13 ప్రత్యేక ఎమోజీలను విడుదల చేసిన యాపిల్..

టెక్ దిగ్గజం యాపిల్ ఇప్పుడు దివ్యాంగుల పాలిట వరంగా మారనుంది. ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులను దృష్టిలో ఉంచుకొని తమ సంస్థలోని యూనికోడ్ కన్సార్టియంతో కలిసి వారికి సహాయపడేందుకు ప్రయత్నం చేస్తోంది.

|

టెక్ దిగ్గజం యాపిల్ ఇప్పుడు దివ్యాంగుల పాలిట వరంగా మారనుంది. ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులను దృష్టిలో ఉంచుకొని తమ సంస్థలోని యూనికోడ్ కన్సార్టియంతో కలిసి దివ్యాంగులకు సహాయపడేందుకు ప్రయత్నం చేస్తోంది. యాపిల్ కు చెందిన పలు మెసేజింగ్ ప్లాట్ ఫామ్స్ లో ప్రత్యేకమైన 13 రకాల ఎమోజీలను తయారుచేసింది. అది కూడా దివ్యాంగులకు అవసరం తరచూ అవసరం అయ్యేవి.
ఈ కొత్త ఎమోజీల సెట్ లో ఓ సర్వీస్ డాగ్, ప్రాస్థెటిక్ లింబ్స్, అలాగే వీల్ చెయిర్ లాంటి ఎమోజీలకు స్థానం కల్పించింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమోజీల్లో ఏవి కూడా దివ్యాంగులకు అవసరాలకు ఉపయోగపడటం లేదని, అందుకు కోసం కొత్తగా ఎమోజీలను తయారు చేసినట్లు యాపిల్ తెలిపింది.

 
apple

ఇలాంటి ఎమోజీలను తయారు చేయడం ద్వారా దివ్యాంగులు సైతం కమ్యూనికేషన్ చేయడం సులువు అవుతుంది. అంతేకాదు రకరకాల పనులను చేసుకునేందుకు వీలు కలుగుతుంది. ముఖ్యంగా అంధుల కోసం ప్రత్యేక ఎమోజీలను తయారు చేసేందుకు యాపిల్ సంస్థ ప్రతిష్టాత్మకమైన కౌన్సిల్ ఆఫ్ ది బ్లైండ్ తో సంప్రదింపులతో పాటు పలు సూచనలు అందుకుంది. అంతేకాదు సెరిబ్రల్ పాల్సీ ఫౌండేషన్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ డెఫ్ వంటి సంస్థలు సైతం ఈ ఎమోజీల తయారీలో పాల్గొన్నాయి. ఈ ఎమోజీలను మార్కెట్లోకి విడుదల చేసే ముందు యూనికోడ్ కన్సార్టియం పలు ఎన్జీవోలను సంప్రదించి ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అంతేకాదు పలు సూచనలను సైతం పొందింది. ప్రస్తుతం ఈ ఎమోజీలు యాండ్రయిడ్, ఐవోఎస్ ప్లాట్ ఫాంలలో లభ్యమవుతున్నాయి.

Best Mobiles in India

English summary
Apple wants 13 new emojis for the differently-abled More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X