మనిషి ప్రాణాలను కాపాడిన ఆపిల్ వాచ్ ఎస్‌ఓఎస్ పీచర్
టెక్నాలజీ రోజు రోజుకు అమిత వేగంతో పెరిగిసోతోంది. చనిపోతున్న మనుషులను కాపాడే టెక్నాలజీ వచ్చేసింది. అలాగే గుండెల్ మార్చే టెక్నాలజీ, హార్ట్ రేట్ కనుగొని సత్వరం చికిత్స అందించే టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.

దిగ్గజ టెక్నాలజం ఆపిల్ నుంచి వచ్చిన వాచ్ ఓ మనిషి ప్రాణాలను కాపాడింది. నమ్మలేకపోయినా ఇది నిజం. చికాగోలో ఈ ఘటన జరిగింది. నేను ఈ రోజు ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం నా ఆపిల్ వాచ్' ఇది..ఓ పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఓ వ్యక్తి అన్న మాట. పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

జెట్ స్కీ సహాయంతో సముద్రంలోకి
ఫిలిప్ ఎషో అనే అమెరికా జాతీయుడు జెట్ స్కీ సహాయంతో సముద్రంలోకి వెళ్లాడు. అక్కడి నుంచి చికాగో నగర అందాలను కెమెరాలో బంధించాలనేది అతడి ఆలోచన. అయితే ఇంతలో అతడికి ఊహించని ప్రమాదం ఎదురైంది. అలల ఉదృతి ఎక్కువగా ఉండటంతో..ఫిలిప్ నడుపుతున్న జెట్ స్కీ ఒక్కసారిగా పల్టీ కొట్టింది. దీంతో ఫిలిప్ సముద్రంలో పడిపోయాడు. అదృష్టవశాత్తూ అతడు వేసుకున్న లైఫ్ జాకెట్ అతడిని నీళ్లలో మునిగిపోకుండా కాపాడింది.

ఆపిల్ వాచ్‌లోని ఎస్‌ఓఎస్ పీచర్
ఈ ఘటనలో అతడు తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. తను ప్రమాదంలో పడ్డానన్న సమాచారాన్ని ఏలా చేరవేయాలో తెలియలేదు. మరోపక్క అలలు అతడిని మాటిమాటికీ నీటి లోపలకు లాగేస్తున్నాయి. పరిసరాల్లో ఉన్న ఇతర నౌకలు అతడిని గుర్తించలేని పరిస్థితి. ఏం చేయాలో పాలుపోని స్థితిలో చివరి ప్రయత్నంగా తన ఆపిల్ వాచ్‌లోని ఎస్‌ఓఎస్ పీచర్‌ను ఆన్ చేశాడు. నన్ను రక్షించండి అనే సందేశాన్ని బ్రొడ్ కాస్ట్ చేశాడు.

క్షణాల్లో రెస్పాన్స్
అంతే క్షణాల్లో రెస్పాన్స్ వచ్చింది. తనను కాపాడేందుకు హెలికాఫ్టర్ రావడం చూసి అతడి ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఆ తరువాత హెలికాఫ్టర్ నుంచి సిబ్బంది కిందకు దిగడం..అతడికి నీళ్లలోనుంచి బయటకు లాగడం అన్నీ చకచకా జరిగిపోయాయి. కాగా ఈ ఘటనపై స్పందించిన ఫిలిప్ ఆపిల్ వాచే తనను కాపాడిందని తెలిపాడు.

ఎస్ఓఎస్ ఫీచర్ ద్వారా కాల్ చేయగానే
అతడు ఎస్ఓఎస్ ఫీచర్ ద్వారా కాల్ చేయగానే..వెంటనే సదరు పోన్ నుంచి స్థానిక అత్యవసర సర్వీసుల సిబ్బందికి సమాచారం చేరిపోయింది. ఇందులో అతడు ఉన్న లోకేషన్ వివారాలు కూడా ఉన్నాయి. సమాచారం సరైన సమయంలో అందటంతో అధికారులు వెంటనే స్పందించి ఫిలిప్‌ను కాపాడగలిగారు.ఇలా అత్యవసరమైన పరిస్థితుల్లో ఆపిల్ వాచ్ ప్రాణాలు కాపాడటం ఇదే కొత్త కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి.

ముఖ్య విషయం ఏంటంటే..?
అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. అమెరికాలో అయితే..ఆపద సమయంలో ప్రభుత్వ అధికారులకు వెనువెంటనే సమాచారం చేరవేస్తుంది. ఇతర దేశాల్లో అయితే..ప్రమాద సమయంలో ఎవరికి సమాచారం అందించాలనేది వినియోగ దారులు ముందుగా సెలక్ట్ చేసుకోవాలి


Click it and Unblock the Notifications








