సముద్రంలో పడిపోయిన ఆపిల్ వాచ్ సంవత్సరం తర్వాత కూడా పనిచేస్తోంది.. అసలు ఏం జరిగింది..?
ఆపిల్ స్మార్ట్‌వాచ్ లు అనేక హెల్త్ ట్రాకర్ల ను కలిగి ఉంటాయి. అయితే తాజాగా ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూబా డైవింగ్ కు వెళ్లిన ఓ వ్యక్తి సముద్రంలో తన ఆపిల్ స్మార్ట్‌వాచ్ ను (Apple Watch) పొగొట్టుకున్నారు. అయితే ఇలాంటి సందర్భాల్లో ఆ వాచ్‌ను రికవరీ చేయడం చాలా కష్టమనే చెప్పాలి. అయితే తాజా ఘటనలో ఓ స్కూబా డ్రైవర్ పొగొట్టుకున్న వాచ్‌ను సంవత్సరం తర్వాత పొందారు. అప్పటికీ కూడా ఆ స్మార్ట్‌వాచ్ పనిచేస్తుండడం ఆశ్చర్యానికి గురిచేసిందని స్కూబా డైవర్ తెలిపారు.
జురాడ్ బ్రిక్ అనే వ్యక్తి తరచూ స్కూబా డైవింగ్ చేస్తుంటారు. వెళ్లిన ప్రతిసారి ఆపిల్ స్మార్ట్‌వాచ్‌ను ధరిస్తుంటారు. అయితే తాజా ఘటనలో స్కూబా డైవింగ్ చేస్తున్న సమయంలో అతని వాచ్‌ను పొగొట్టుకున్నట్లు గుర్తించారు. స్కూబా డైవింగ్ సమయంలో అక్కడి అందాలను చూసి మైమరచిపోయానని.. తన వాచ్ సముద్రంలో పడిపోయిన విషయాన్ని గుర్తించలేదని తెలిపారు.

తన ఆపిల్ వాచ్ దొంగతనానికి గురికాకుంటే.. ఫైండ్ మై నెట్‌వర్క్ ద్వారా గుర్తించాలని నిర్ణయించుకున్నాడు. దీంతోపాటు ఫైండ్ మై నెట్‌వర్క్ లో తమ ఆపిల్ వాచ్‌ను పోగొట్టుకున్నానని రిపోర్టు చేయాలని భావించాడు. ఏదైనా అద్భుతం జరిగి తన వాచ్ తిరిగి వస్తుందని అభిప్రాయపడినట్లు తెలిపారు.
అయితే ఒక రోజు ఆపిల్ వాచ్ పోగొట్టుకున్న ప్రాంతానికి సమీపంలో జురాడ్ బ్రిక్ కు వాయిస్ మెయిల్ వచ్చింది. బ్రిక్‌కు చెందిన ఆపిల్ వాచ్ ను గుర్తించామన్నది దాని సారాంశం. అయితే ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. సంవత్సరం క్రితం సముద్రంలో పొగొట్టుకున్న వాచ్ ఇప్పటికీ పనిచేస్తున్నట్లు బ్రిక్ గుర్తించారు. చివరికి తన ఆపిల్ వాచ్‌ను పొందానంటూ బ్రిక్ ఆనందం వ్యక్తం చేశారు.
ఆపిల్ స్మార్ట్ వాచ్ అనేక స్మార్ట్ ఫీచర్ లను కలిగి ఉంటోంది. ఇందులో హెల్త్ ట్రాకర్ లు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకు సరైన సమయంలో చికిత్స అందేలా అప్రమత్తం చేస్తున్నాయి. దీంతోపాటు SOS లేదా ఫాల్ డిటెక్షన్ ఫీచర్ లు మెరుగైన ఫలితాలను అందిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన అనేక ఘటనలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి.
*గత నెలలో ప్రచురితం అయిన కెనడా గ్లోబల్ న్యూస్ కథనం ప్రకారం.. కెనడాలో అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న 44 ఏళ్ల ట్రావిస్ చామర్స్.. తన కుమారుడితో కలిసి హాకీ ఆడుతుండగా.. అకస్మాత్తుగా గుండెలో కొన్ని మార్పులు మరియు తలనొప్పి వస్తున్నట్లు గ్రహించాడు. అయితే తొలుత సాధారణ ఎలర్జీగా భావించాడు. అయితే ఆపిల్ మాత్రం తీవ్ర హెచ్చరికలను జారీచేసింది.
హార్ట్ రేట్ అసాధారణంగా ఉందని హెచ్చరించింది. దీంతో కాసేపు విశ్రాంతి తీసుకొనేందుకు ట్రావిస్ చామర్స్ ప్రయత్నం చేశారు. అయినా ఆపిల్ వాచ్ నుంచి హెచ్చరిక సందేశాలు వస్తున్నాయి. దీంతో వెంటనే హాస్పిటల్‌కు వెళ్లారు. దీంతో పరీక్షించిన డాక్టర్లు స్వల్ప స్థాయి గుండె పోటుగా నిర్ధారించారు. సరైన సమయానికి హెచ్చరికలు పంపిన ఆపిల్ స్మార్ట్‌వాచ్‌కు ట్రావిస్ చామర్స్ ధన్యవాదాలు తెలిపారు.


Click it and Unblock the Notifications







