రూ.5,000కే యాపిల్ స్మార్ట్‌వాచ్

ఈకామర్స్ దిగ్గజం Flipkart యాపిల్ ఉత్పత్తుల పై సరికొత్త ఆఫర్లను మార్కెట్లో అనౌన్స్ చేసింది. జనవరి 21న ప్రారంభమైన ఈ ఆఫర్లు జనవరి 31 వరకు అందుబాటులో ఉంటాయి.

రూ.5,000కే యాపిల్ స్మార్ట్‌వాచ్

అన్ని బ్రాండ్‌ల సర్వీస్ సెంటర్ల వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోండి

ఈ 10 రోజుల సేల్ పిరియడ్‌లో భాగంగా ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ కాంబో కొనుగోళ్ల పై రూ.22,500 వరకు క్యాష్‌బ్యాక్‌లను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఈ కాంబో ప్యాక్‌లలో భాగంగా మొదటి జనరేషన్ యాపిల్ వాచ్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 2, యాపిల్ మ్యాక్‌బుక్స్ అందుబాటులో ఉంటాయి. క్యాష్‌బ్యాక్ ఆఫర్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొదటి డీల్

మొదటి కాంబో డీల్ ఆఫర్‌లో భాగంగా కస్టమర్ ఐఫోన్7 లేదా ఐఫోన్ 7 ప్లస్‌తో పాటు మొదటి జనరేషన్ యాపిల్ వాచ్‌ను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. దీని పై రూ.17,500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మొత్తం డీల్ విలువ రూ.63,300. ఈ డీల్‌లో భాగంగా యాపిల్ మొదటి జనరేషన్ వాచ్ ఖరీదు రూ.5,000గానూ, ఐఫోన్ 7 32జీబి వర్షన్ ఖరీదు రూ.58,300గాను ఉంది. మార్కెట్లో మొదటి జనరేషన్ యాపిల్ వాచ్ ధర రూ.22,500గా ఉంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ ద్వారా కొనుగోలు చేసినవారికి మాత్రమే ఈ కాంబో డీల్స్ వర్తిస్తాయి.

రెండవ డీల్

రెండవ కాంబో డీల్ ఆఫర్‌లో భాగంగా కస్టమర్ ఐఫోన్7 లేదా ఐఫోన్ 7 ప్లస్‌తో పాటు రెండవ జనరేషన్ యాపిల్ వాచ్‌ను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. ఈ డీల్ పై రూ.17,500 క్యాష్‌బ్యాక్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఈ డీల్‌లో భాగంగా యాపిల్ సెకండ్ జనరేషన్ స్మార్ట్‌వాచ్ ఖరీదు రూ.14,900గా ఉంది. మార్కెట్లో సెకండ్ జనరేషన్ యాపిల్ వాచ్ వాస్తవ ధర రూ.31,900 నుంచి ప్రారంభమవుతోంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ ద్వారా కొనుగోలు చేసినవారికి మాత్రమే ఈ కాంబో డీల్స్ వర్తిస్తాయి.

మూడవ డీల్

మూడవ కాంబో డీల్ ఆఫర్‌లో భాగంగా కస్టమర్ ఐఫోన్7 లేదా ఐఫోన్ 7 ప్లస్‌తో పాటు MacBook Airను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. ఈ డీల్ పై రూ.22,500 క్యాష్‌బ్యాక్‌ను ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఈ డీల్‌లో భాగంగా MacBook Air ధర రూ.39,900గా ఉంటుంది. మార్కెట్లో ఈ డివైస్ వాస్తవ ధర రూ.62,400. సిటీ బ్యాంక్ క్రెడిట్ ద్వారా కొనుగోలు చేసినవారికి మాత్రమే ఈ కాంబో డీల్స్ వర్తిస్తాయి.

ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌ ప్రత్యేకతలు..

మునుపటి ఐఫోన్ మోడల్స్‌తో పోలిస్తే, 25శాతం ప్రకాశవంతమైన డిస్‌ప్లే వ్యవస్థతో రూపుదిద్దదుకున్న ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌లలో వైడ్ కలర్ gamut, 3డీ టచ్ మేనేజ్ మెంట్, 3డీ టచ్ వంటి అంశాలు ఆకట్టుకుంటాయి.

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి..

యాపిల్ ఐఫోన్ 7 డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి, ఈ హ్యాండ్‌సెట్‌‌లో 4.7 అంగుళాల Retina HD డిస్‌ప్లేను ఏర్పాటు చేసారు. మరో వైపు ఐఫోన్ 7 ప్లస్‌, 5.5 అంగుళాల Retina HD డిస్‌ప్లేతో కనువిందు చేస్తుంది.

శక్తివంతమైన A10 Fusion ప్రాసెసర్‌తో

ఈ రెండు ఫోన్‌లు శక్తివంతమైన A10 Fusion ప్రాసెసర్‌తో వస్తున్నాయి. ఈ 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ గతేడాది యాపిల్ అందుబాటులోకి తీసుకువచ్చిన A9 ప్రాసెసర్‌తో పోలిస్తే 40 శాతం వేగంగా స్పందించగలదు. యాపిల్ సరికొత్త iOS 10 ఆపరేటింగ్ సిస్టం పై ఈ రెండు ఐఫోన్‌లు రన్ అవుతాయి. ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌ బేస్ మోడల్స్ 32జీబి వేరియంట్ నుంచి ప్రారంభమవుతాయి. 128జీబి, 256జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో కూడా ఈ ఫోన్‌లను
అందుబాటులో ఉంటాయి.

వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్

యాపిల్ తన కొత్త ఐఫోన్‌లలో హోమ్‌బటన్ వ్యవస్థను పూర్తిగా అప్‌గ్రేడ్ చేసింది. యూజర్లు తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. సరికొత్త టాప్టిక్ ఇంజిన్‌తో పని చేసే ఈ హోమ్‌బటన్ ఇప్పుడు మరింత ఫోర్స్ సెన్సిటవ్ గా అనిపిస్తుంది. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌లలో ఐపీ67 ప్రొటెక్షన్ స్టాండర్డ్‌తో కూడని వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ సామర్థ్యాలను పొందుపరిచారు. ఇవి నీటిలో పడినప్పటికి ఎటువంటి ప్రమాదాలకు గురికావు.

 

కెమెరా విభాగం..

ఇక కెమెరా విషయానికి వచ్చేసరికి ఈ ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌లలో విప్లవాత్మక ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో పాటు six element లెన్స్‌ను యాపిల్ నిక్షిప్తం చేసింది. TrueTone Flash ఫ్లాష్‌తో కూడిన 12 మెగా పిక్సల్ ప్రధాన కెమెరాను ఐఫోన్ 7 కలిగి ఉంటుంది. కెమెరాలో పొందుపరిచిన f/1.8 aperture మరింత బ్రైట్నెస్‌ను అందిస్తుంది. ఫోన్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 7 మెగా పిక్సల్. లైవ్ ఫోటోలను కూడా కస్టమైజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. మరోవైపు ఐఫోన్ 7 ప్లస్ రెండు 12 మెగా పిక్సల్ ప్రధాన కెమెరాలతో వస్తోంది. ఈ డ్యుయల్ కెమెరా సెటప్‌లో భాగంగా మొదటి కెమెరా వైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంటే, మరొక కెమెరా telephoto ఫీచర్ ను కలిగి ఉంటుంది. డీఎస్ఎలఆర్ తరహా డెప్త్ ఫోటోగ్రఫీని ఐఫోన్ 7 ప్లస్ అందించగలదు. ఫోన్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 7 మెగా పిక్సల్.

ప్రత్యేకమైన స్టీరియో స్పీకర్ వ్యవస్థ

యాపిల్ కొత్త ఐఫోన్ మోడల్స్ ప్రత్యేకమైన స్టీరియో స్పీకర్ వ్యవస్థతో వస్తున్నాయి. ఫోన్ టాప్ అలానే బోటమ్ భాగాల్లో ఏర్పాటు చేసిన స్పీకర్లు ఫోన్ వాల్యుమ్ స్థాయిని మరింత హై డైనమిక్ రేంజ్ లో అందిస్తాయి. యాపిల్ తన కొత్త ఫోన్‌లలో 3.5ఎమ్ఎమ్ ఆడియా జాక్ కు బదులుగా లైట్నింగ్ పోర్ట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

 

AirPods పేరుతో విప్లవాత్మక వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్

వైర్‌లెస్ ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను పై దృష్టిసారించిన యాపిల్ తమ ఐఫోన్ 7 మోడల్స్ కోసం AirPods పేరుతో విప్లవాత్మక వైర్ లెస్ ఇయర్ ఫోన్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది. యాపిల్ డిజైన్ చేసిన W1 చిప్ ఆధారంగా పనిచేసే ఈ ఇయర్‌ఫోన్‌ల సరికొత్త వైర్‌లెస్ ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను చేరువచేస్తాయి.

 

బ్యాటరీ విషయానికి వచ్చే సరికి

బ్యాటరీ విషయానికి వచ్చే సరికి ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌లలో శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థను యాపిల్ నిక్షిప్తం చేసింది. ఐఫోన్ 6ఎస్‌తో పోలిస్తే ఐఫోన్ 7 బ్యాటరీ 40 శాతం మెరుగుపరచబడి పనితీరును కనబర్చగలదట. మరోవైపు ఐఫోన్ 6ఎస్‌ ప్లస్‌తో పోలిస్తే ఐఫోన్ 7 ప్లస్‌ బ్యాటరీ అదనంగా 60 నిమిషాల బ్యాటరీ లైఫ్‌ను పెంచగలదట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple Watch on sale for Rs 5,000 with iPhone 7 combo purchases. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot