అత్యాచారం కేసులో శిక్ష పడేలా చేసిన ఆపిల్ వాచ్

|

ఒకో సారి మనం ఇష్టపడి కొనుకున్న వస్తువులు మనలని కాపాడతాయి. మనం పెంచుకుంటున్న కుక్కలు,జంతువులు మనుషులను ప్రమాదాల నుండి కాపాడడం సినిమాలలో చూసాము. అలాగే నిజజీవితాలలో కూడా జరిగాయి అని చాలా చూసాము. అలాగే కేవలం ఒక వాచ్ అత్యాచారం నుండి ఒక మహిళను రక్షించగలదని ఎవరు మాత్రం ఉహించగలరు చెప్పండి. కానీ ఆమె తను ఇష్టపడి కొనుకున్న ఆపిల్ వాచ్ ఆమెను కాపాడింది.

ఆపిల్ వాచ్
 

ఇటీవల కాల్గరీలో ఒక మహిళ విషయంలో జరిగిన ఒక సంఘటన ద్వారా ఇది నిజమైంది. ఆపిల్ వాచ్ ఇతర రెగ్యులర్ వాచ్ లాగా కేవలం గంటలు మరియు నిమిషాలు చూపించడమే కాకుండా చాలా పనులు ఎలా చేయగలదో ఇది మరొక తాజా ఉదాహరణ. జాన్ జోసెఫ్ మాకిండో అనే వ్యక్తి ఒక అమ్మాయిపై మక్కువతో అత్యాచారానికి పాల్పడితే ఈ వాచ్ ఆమెను అత్యాచారం చేయకుండా కాపాడింది.

CBC తెలిపిన వివరాల

CBC తెలిపిన వివరాలలోకి వెలితే ఆ మహిళ రాత్రి పూట తన ఇంటిలో నిద్రపోతున్నపుడు తన కుక్కలు మొరిగే శబ్దానికి మేల్కొన్నప్పుడు తన ఇంటి చుట్టూ కదులుతున్న ఒక చీకటి బొమ్మను చూసి బయపడింది. ఆమె సహాయం కోసం తన ఫోన్‌ కోసం వెతకగా అది తాను నిద్రపోయే ముందు ఉంచిన ప్రదేశంలో లేదు అని గ్రహించింది. అప్పటికే ఆమె జరుగుతున్న పరిణామాలను గ్రహించి సహాయం కోసం తాను ధరించిన ఆపిల్ వాచ్ సహాయంతో పోలీసులకు ఫోన్ చేసింది. అలాగే తన ప్రియుడికి కూడా మెసేజ్ పంపింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆ మహిళ యొక్క వంటగదిలో దాక్కున్న నిందితుడిని గుర్తించి తలుపులు పగలగొట్టి అతడిని పట్టుకున్నారు.

60వేల కోట్లు ప్రభుత్వనికి చెల్లించనున్న టెలికామ్ కంపెనీలు60వేల కోట్లు ప్రభుత్వనికి చెల్లించనున్న టెలికామ్ కంపెనీలు

కోర్టు
 

తరువాత అతనిని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఆ మహిళపై లైంగికంగా దాడి చెసే ఉద్దేశంతో రాత్రి పూట ఆమె ఇంటి లోపలికి ప్రవేశించాడనే ఆరోపణలపై కాల్గరీలోని కోర్టులో మంగళవారం మాకిండో నేరాన్ని అంగీకరించారు. నేరం అంగీకరించినందుకు అతనికి కఠిన శిక్షను కోర్టు విధించింది. అదృష్టం బాగా ఉంటే మనం ఇష్టపడి కొన్న వస్తువులు మనల్ని ఎలా కాపాడుతాయా ఈమె విషయంలో మళ్ళి నిరూపించబడింది.

జియో కొత్త ప్లాన్లతో యూజర్లకు ఎంత వరకూ లాభం ...పాత ధరలు ఇవే!జియో కొత్త ప్లాన్లతో యూజర్లకు ఎంత వరకూ లాభం ...పాత ధరలు ఇవే!

మరొక సంఘటన

మరొక సంఘటన

ఆపిల్ వాచ్ తన వినియోగదారులను రక్షించడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో వాషింగ్టన్కు చెందిన గేబ్ బర్డెట్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఆపిల్ వాచ్ ద్వారా తన తండ్రి బాబ్ బర్డెట్ ప్రాణాలను ఎలా రక్షించాడో పోస్ట్ చేశాడు. బాబ్ మౌంటెన్ బైకింగ్ చేస్తున్నప్పుడు పడిపోయి అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. అదృష్టవశాత్తూ అతను ఆపిల్ వాచ్ ధరించి ఉన్నాడు. అది 2018 నుండి ఫాల్ డిటెక్షన్ ను గుర్తించే లక్షణాన్ని కలిగి ఉంది. అప్పుడు ఈ వాచ్ ఫాల్ డిటెక్షన్ను గుర్తించి వెంటనే గేబ్‌కు ఒక మెసేజ్ పంపింది. అది ప్రమాదం జరిగిన ప్రదేశంతో పాటు ప్రమాద విషయాన్ని తెలియజేసింది. బాబ్ తన కొడుకు వద్దకు అత్యవసరంగా చేరుకొని కాపాడుకోగలిగాడు.

BSNL ట్రిపుల్-ప్లే సర్వీస్ కోసం Yupp టీవీతో ఒప్పందంBSNL ట్రిపుల్-ప్లే సర్వీస్ కోసం Yupp టీవీతో ఒప్పందం

ఇసిజి ఫీచర్

మరొక సంఘటనలో ఆపిల్ వాచ్ సిరీస్ 4 యొక్క ఇసిజి ఫీచర్ దాని యజమాని ప్రాణాలను ఎలా కాపాడిందనే దానిపై టిమ్ కుక్ ఈ ఏడాది జనవరిలో ఇలాంటి కథనాన్ని పంచుకున్నారు. గడియారం గుండె దడను గుర్తించి సకాలంలో రోగ నిర్ధారణ ఇవ్వడం ద్వారా మనిషికి సహాయపడింది. అతనికి ఇది రెండవ సారి ఎటాక్ రావడం అని నిర్ధారణ చేసుకొని సకాలంలో ఆపరేషన్ చేయించుకున్నాడు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Apple Watch Saves A Woman From Rape Attempt

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X