ఇదుగోండి యాపిల్ కొత్త స్మార్ట్‌వాచ్

|

Apple తన ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు యాపిల్ స్మార్ట్‌వాచ్ సిరీస్ 2ను కూడా ఆవిష్కరించింది. మొదటి జనరేషన్ యాపిల్ స్మార్ట్‌వాచ్‌కు అప్‌డేటెడ్ వర్ష‌న్‌గా వస్తోన్న సిరీస్ 2 యాపిల్ వాచ్ మొత్తం మూడు మేజర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

Read More : యాపిల్ ఐఫోన్ 7 వచ్చేసింది, ఇండియాలో ధర ఎంత? రిలీజ్ డేట్ ఎప్పుడు..?

 ఇదుగోండి యాపిల్ కొత్త స్మార్ట్‌వాచ్

అల్యుమినియమ్, స్టెయిన్‌లెస్ స్టీల్, సిరామిక్ వైట్. వీటికి పాపులర్ ఫ్యాషన్ బ్రాండ్ Hermes సరికొత్త స్ట్రాప్స్‌ను సమకూరుస్తోంది. రన్నర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాపిల్ వాచ్ నైక్+ ఎడిషన్ అందుబాటులో ఉంటుంది.

Read More : షాకింగ్ నిజాలు.. iPhone తయారీ ఖర్చు అంత తక్కువా..?

#1

#1

యాపిల్ వాచ్ సిరీస్ 2 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. watchOS 3 ఆపరేటింగ్ సిస్టం పై వాచ్ రన్ అవుతుంది. సరికొత్త డ్యుయల్ కోర్ ప్రాసెసర్‌‍ను వాచ్‌లో నిక్షిప్తం చేసారు.

#2

#2

సెకండ్ జనరేషన్ OLED డిస్‌ప్లే వ్యవస్థను యాపిల్ ఈ వాచ్‌లో పొందుపరిచింది. 50 మీటర్ల లోతైన నీటిలో పడినప్పటికి చెక్కుచెదరని వాటర్ ఫ్రూప్ స్టాండర్డ్‌తో వస్తోన్న ఈ వాచ్‌లో ప్రత్యేకమైన జీపీఎస్‌ సిస్టంను ఇన్‌స్టాల్ చేసారు. ఈ వాచ్‌లో పోకోమన్‌ గో గేమ్ కూడా ఆడుకోవచ్చు.

#3
 

#3

వాచ్ సిరీస్ 2 లాంచ్‌తో పాటు యాపిల్ తన మొదటి జనరేషన్ స్మార్ట్‌వాచ్‌ను డ్యుయల్ కోర్ ప్రాసెసర్‌తో అప్‌గ్రేడ్ చేసింది. ఈ అప్‌గ్రేడెడ్ వాచ్‌లను యాపిల్ వాచ్ సిరీస్ 1గా పిలుస్తారు. ఇండియన్ మార్కెట్లో యాపిల్ వాచ్ సిరీస్ 2 ధర రూ.32,900. గోల్డ్, రోజ్ గోల్డ్, సిల్వర్/స్పేస్ గ్రే అల్యుమినియమ్, సిల్వర్/స్పేస్ బ్లాక్ స్టెయిన్ లెస్ స్టీల్ కలర్ ఆప్సన్‌లలో ఈ వాచ్‌లు అందుబాటులో ఉంటాయి.

#4

#4

సిరామిక్ ఎడిషన్ యాపిల్ వాచ్ సిరీస్ 2 ప్రారంభ వేరియంట్ ధర రూ.1,10,900గా ఉంటుంది. ఇదే సమయంలో యాపిల్ వాచ్ సిరీస్ 1 ధర రూ.23,900గా ఉంటుంది. గోల్డ్, రోజ్ గోల్డ్, సిల్వర్ ఇంకా స్పేస్ గ్రే కలర్ వేరియంట్‌లలో ఈ వాచ్‌లు అందబాటులో ఉంటాయి.

#4

#4

యాపిల్ విప్లవాత్మక ఆవిష్కరణల్లో యాపిల్ వాచ్ ఒకటి. స్టీవ్ జాబ్స్ కలలు కన్న టెక్నాలజీలలో ఇది కూడా ఒకటి!

#5

#5

ప్రత్యేకమైన కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో రూపకల్పన కాబడిన మొదటి యాపిల్ స్మార్ట్‌వాచ్‌కు ‘డిజిటల్ క్రౌన్' ప్రధాన ఆకర్షణ కానుంది. వాచ్ కుడివైపు భాగంలో ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ క్రౌన్ బటన్‌ను ప్రెస్ చేయటం ద్వారా వాచ్ డిస్‌ప్లేను తాకకుండానే ఆన్ - స్ర్కీన్ యాక్షన్‌లను నిర్విహించుకోవచ్చు.

#6

#6

జిటల్ క్రౌన్ బటన్ యాపిల్ వాచ్‌కు హోమ్ బటన్ గాను ఉపయోగపడుతుంది. ఈ బటన్ ద్వారానే యాపిల్ వాయిస్ సెర్చ్ ఫీచర్ ‘సిరీ'ని యాక్సెస్ చేసుకోవచ్చు.

#7

#7

యాపిల్ వాచ్ డిస్‌ప్లే పటిష్టమైన ఫ్లెక్సిబుల్ రెటీనా ప్యానల్‌ను కలిగి ఉంటుంది. పటిష్టమైన సఫైర్ గ్లాస్‌ను వాచ్ డిస్‌ప్లే పై అమర్చారు.

#8

#8

నోటిఫికేషన్ అందిన ప్రతిసారి ఓ నిగూఢమైన వైబ్రేషన్‌ ఈ స్మార్ట్ వేరబుల్ డివైస్‌లో నిక్షిప్తం చేసిన టాప్టిక్ ఇంజిన్ వాచ్‌కు నోటిఫికేషన్ అందిన ప్రతిసారి ఓ నిగూఢమైన వైబ్రేషన్‌ను కలగజేస్తుంది.

#9

#9

వాచ్‌ను ధరించిన యూజర్ తన మణికట్టును రైస్ చేసిన ప్రతి సారి వాచ్ డిస్‌ప్లే యాక్టివేట్ అవటంతో పాటు సమయాన్ని చూపిస్తుంది.

#10

#10

వాచ్‌లోని డిజిటల్ క్రౌన్ బటన్‌ను స్క్రోల్ చేయటం ద్వారా వాచ్ హోమ్ స్ర్కీన్ ను జూమ్ లేదా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాచ్‌ స్ర్కీన్ పై చేతి వేలితో కుడి, ఎడమ వైపులకు స్వైప్ చేయటం ద్వారా క్యాలెండర్ ఈవెంట్స్, వాతావరణం, హార్ట్ రేట్, లోకేషన్ వంటి వివరాలను పొందవచ్చు.

#11

#11

వాచ్‌ స్ర్కీన్ పై చేతి వేలితో క్రిందకు స్వైప్ చేయటం ద్వారా నోటిఫికేషన్‌లను తెలుసుకోవచ్చు.

#12

#12

ఇన్‌కమింగ్ కాల్స్‌ను సైలెన్స్‌లో ఉంచాలంటే ఇన్‌కమింగ్ కాల్స్‌ను సైలెన్స్‌లో ఉంచాలంటే వాచ్‌ స్ర్కీన్ పై అర చేతిని అడ్డుగా ఉంచితే చాలు. వాచ్‌ స్ర్కీన్ పై చేతి వేలితో పైకి స్వైప్ చేయటం ద్వారా ఫోన్ ఫీచర్‌ను పింగ్ చేసుకోవచ్చు.

#13

#13

వాచ్ బ్యాండ్‌ను మరింత బిగుతు చేయటం ద్వారా మెరుగైన హార్ట్‌రేట్‌ను పొందవచ్చు వాచ్‌లోని డిజిటల్ క్రౌన్ అలానే సైడ్ బటన్‌లను ఏక కాలంలో ప్రెస్ చేయటం ద్వారా స్ర్కీన్ షాట్‌ను తీసుకోవచ్చు. డిజిటల్ క్రౌన్‌ను కొద్ది సేపు ప్రెస్ చేసి ఉంచటం వల్ల సిరి యాప్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Apple Watch Series 2 launched and it is waterproof, prices start at Rs 32,900. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X