చచ్చిపోబోతున్న మనిషిని కాపాడుతున్న ఆపిల్ వాచ్

By Gizbot Bureau
|

గ్లోబల్ టెక్ రంగంలో దూసుకుపోతున్న అమెరికా దిగ్గజం ఆపిల్ నుంచి వచ్చే ఏ ఉత్పత్తి అయినా జనాలను విపరీతంగా ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ కంపెనీ నుంచి వచ్చే ప్రతి ఉత్పత్తి వినియోగదారుల మనసు దోచుకుంటోంది. అంతే కాకుండా ఆరోగ్యపరంగా మనుషుల్ని కాపాడటంలో కూడా ఆపిల్ ఉత్పత్తులు అన్ని కంపెనీల కంటే ముందు ఉన్నాయి.

 
Apple Watch Series 4 helps a doctor to save a life in a restaurant

దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఆపిల్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఆపిల్ వాచ్. కొద్ది క్షణాల్లో హార్ట్ ఎటాక్ రాబోతున్న వారిని రక్షిస్తోంది. ముందుగానే వారిని అలర్ట్ చేస్తోంది. మనిషిలో క్రిటికల్ హెల్త్ కండీషన్ ఎలా ఉంది.. కాసేపట్లో ఎలా ఉండబోతుంది, హెల్త్ సమస్య ఏంటో అచ్చం డాక్టర్ మాదిరిగానే చెప్పేస్తోంది. ఆపిల్ నుంచి వచ్చిన ఆపిల్ వాచ్ సిరీస్ 4 మనిషి హార్ట్ బీట్స్ నుంచి.. అన్నిరకాల లక్షణాలను ముందుగానే గుర్తిస్తోంది.

యువకుడిని రక్షించిన వాచ్

యువకుడిని రక్షించిన వాచ్

మనిషిలో A-Fib (హృదయ స్పందనలో మార్పుల రేటు)తేడాను కొన్ని సెకన్ల వ్యవధిలో Apple Watch Series 4 గుర్తించగలదు. సకాలంలో వైద్య చికిత్స అందితే మనిషి ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. 2018 ఏడాదిలో టంపా బే కు చెందిన యువకుడి ప్రాణాలను Apple Watch Series 4 కాపాడింది. ఆతని మెడికల్ కండీషన్ క్రిటికల్ గా ఉందని ముందుగానే హెచ్చరించడంతో సకాలంలో ట్రీట్ మెంట్ చేయించుకున్నాడు. అది అప్పుడు వైరల్ అయింది.

 శాన్ డియోగోలో ఘటన

శాన్ డియోగోలో ఘటన

మళ్లీ ఇప్పుడు ఆపిల్ స్మార్ట్ వాచ్ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. కాలిఫోర్నియాలోని ఓ రెస్టారెంట్ లో ఈ ఘటన జరిగింది. ఆపిల్ స్మార్ట్ వాచ్ సాయంతో సెకన్ల వ్యవధిలో శాన్ డియోగో కు చెందిన వైద్యుడు సదరు వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. రెస్టారెంట్ కు వెళ్లిన ఓ ఫిజిషియన్ డాక్టర్ తన చేతికి ఆపిల్ స్మార్ట్ వాచ్ ధరించాడు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. అది గమనించిన డాక్టర్.. వెంటనే తన చేతికి ధరించిన ఆపిల్ స్మార్ట్ వాచ్ ను ఆ వ్యక్తికి పెట్టాడు. వాచ్ లోని ECG ఫీచర్.. వెంటనే అతడి మెడికల్ కండీషన్ ఏంటో పసిగట్టేసింది. వాచ్ స్ర్కీన్ డిస్ ప్లేపై మెడికల్ కండీషన్ ఏంటో డిస్ ప్లే అయింది. వైద్యుడు సకాలంలో ట్రీట్ మెంట్ చేయడంతో ప్రాణాలు దక్కాయి.

 ECG ఫీచర్ ద్వారా..
 

ECG ఫీచర్ ద్వారా..

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆపిల్ వాచ్ సిరీస్ 4, ECG ఫీచర్ ద్వారా ఒక వ్యక్తి హార్ట్ కండీషన్ గుర్తించిన తొలి కేసు ఇదే. ఆపిల్ కంపెనీ.. ఈ స్మార్ట్ వాచ్ ను గత ఏడాదిలో రిలీజ్ చేసింది. ఫాల్ డిటెక్షన్, ECG ఫీచర్లు ఉన్న ఈ స్మార్ట్ వాచ్ ఇండియాలో ప్రారంభ ధర రూ.40వేల 990వరకు ఉంటుందని అంచనా. ప్రస్తుతానికి ఇండియాలో ఆపిల్ స్మార్ట్ వాచ్ అందుబాటులో లేదు. యూఎస్, యూరోప్, హాంగ్ కాంగ్ దేశంలోని యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. సాధ్యమైనంత తొందరగా ఆపిల్ వాచ్ సిరీస్ 4 ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం.

హార్ట్ బీట్ రేటు పడిపోవడం

హార్ట్ బీట్ రేటు పడిపోవడం

అట్రియల్ ఫిబ్రిలేషన్ లేదా A-fib (హార్ట్ బీట్ రేటు పడిపోవడం) గురించి చాలామందికి అవగాహన ఉండదు. దీని ద్వారా హార్ట్ బీట్ రెగ్యులర్ కంటే నెమ్మదిగా కొట్టుకోంటుంది. రక్తం గడ్డుకట్టే ప్రమాదం ఉంది. ఫలితంగా హార్ట్ ఫెయ్యిలర్ అయి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ పరిస్థితిని ముందుగానే గుర్తించి తక్షణమే వైద్యసాయం అందించాల్సి ఉంటుంది. Apple Watch Series 4 దీనిని తక్షణమే గుర్తించి దీనికి కావాల్సిన చికిత్సను డిస్ ప్లేలో చూపిస్తుంది. తద్వారా మనిషి ప్రాణాలను అది కాపాడుతుంది.

  ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ద్వారా సేవ్

ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ద్వారా సేవ్

ఆపిల్ స్మార్ట్‌వాచ్ 4లో ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ఉంటుంది. ఈ వాచ్ ధరించినవాళ్లు కిందపడిపోతే కుటుంబ సభ్యుల్ని ఈ ఫాల్ డిటెక్షన్ ఫీచర్ అప్రమత్తం చేస్తుంది. ఆ ఫీచరే స్వీడన్‌కు చెందిన వ్యక్తికి ఎంతో ఉపయోగపడింది. అతను కిచెన్‌లో కిందపడగానే... సమీపంలో ఉండే తన అత్తకు అలర్ట్ మెసేజ్ వెళ్లింది. ఆమె వెంటనే అక్కడికి చేరుకొని అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. కిందపడ్డ వ్యక్తి 60 సెకన్లలో పైకి లేవకపోతే ఆపిల్ వాచ్ నేరుగా ఎమర్జెన్సీ సర్వీసెస్‌కు సమాచారం ఇస్తుంది.

లొకేషన్‌ని మెసేజ్

లొకేషన్‌ని మెసేజ్

అంతేకాదు... ఎమర్జెన్సీ కాంటాక్ట్‌కు కూడా లొకేషన్‌ని మెసేజ్ చేస్తుంది. ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ఆపిల్ వాచ్ 4 అన్ని మోడల్స్‌లో ఉంటుంది. ఈ ఫీచర్ మ్యాన్యువల్‌గా యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. అతను తన వాచ్‌లో ఈ ఫీచర్ యాక్టివేట్ చేశాడు కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. 65 ఏళ్లు పైబడ్డ వారందరికీ ఫాల్ డిటెక్షన్ ఫీచర్ డిఫాల్ట్‌గా సెట్ చేసి ఉంటుంది. దీంతో పాటుగా ఆపిల్ వాచ్‌లో ఈసీజీ ఫీచర్ కూడా ఉంది. ఆర్టిలర్ ఫిబ్రిలేషన్‌ని గుర్తిస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Apple Watch Series 4 helps a doctor to save a life in a restaurant

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X