Apple Watch Series 8 డిస్‌ప్లే, డిజైన్‌ వివరాలు లీక్ అయ్యాయి!!

|

కుపెర్టినో టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ ఐఫోన్ 14 సిరీస్‌ను సెప్టెంబర్ 13 న లాంచ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. దీనితో పాటుగా కొత్త స్మార్ట్ వాచ్ యొక్క సిరీస్ 8ని కూడా ప్రారంభించాలని యోచిస్తోంది. ఆపిల్ సంస్థ నుంచి రాబోయే వాచ్ సిరీస్ 8 కి సంబందించిన కొన్ని లీక్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ సమాచారం ప్రకారం ఇది ఫ్లాట్ డిస్‌ప్లేతో సరికొత్త డిజైన్‌ను కలిగి ఉండవచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ShrimpApplePro అనే లీకర్ ప్రకారం రాబోయే ఆపిల్ వాచ్ సిరీస్ 8 ఫ్లాట్ ఫ్రంట్ గ్లాస్ డిస్‌ప్లేతో వస్తుందని తెలిపారు. అయితే దీని యొక్క మొత్తం డిజైన్ ఎలా ఉంటుందనే దాని గురించి ఇంకా స్పష్టమైన పూర్తి సమాచారం లేదు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

"ఆపిల్ బ్రాండ్ నుంచి రాబోతున్న కొత్త వాచ్ యొక్క డిస్‌ప్లే కోసం ఫ్లాట్ ఫ్రంట్ గ్లాస్ ని కలిగి ఉంటుంది అని కొన్ని లీక్ లతో విన్నాను. యాపిల్ వాచ్ సిరీస్ 8 లో ఈ ఫ్రంట్ గ్లాస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రీడిజైన్ హౌసింగ్ మోడల్ గురించి ఇంకా పూర్తి సమాచారం తెలియాలసి ఉంది, ఇలస్ట్రేషన్ ఇమేజ్ మాత్రమే నిజం కాదు" అని ShrimpApplePro ఒక ట్వీట్‌లో పేర్కొంది.

ఆపిల్ వాచ్ సిరీస్ 7 లాంచ్‌

గత సంవత్సరం ఆపిల్ వాచ్ సిరీస్ 7 లాంచ్‌లతో కంపెనీ 41mm మరియు 45mm స్క్రీన్ సైజులను పరిచయం చేసింది. దానితో పాటు ఆపిల్ వాచ్ సిరీస్ 7లో డిస్‌ప్లే యొక్క బెజెల్ పరిమాణాన్ని కూడా తగ్గించింది. కానీ ఇప్పుడు బ్లూమ్‌బెర్గ్ యొక్క మార్క్ గుర్మాన్ యొక్క కొత్త నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో లాంచ్ కానున్న కొత్త మోడల్ ఆపిల్ బ్రాండ్ చరిత్రలో అతిపెద్ద కావచ్చు.

 

యాపిల్ వాచ్ సిరీస్ 7 లోని ఫీచర్ల విషయానికి వస్తే మనిషి యొక్క శరీర ఉష్ణోగ్రతలను కొలిచే ఫీచర్‌ను పరిచయం చేయాలని యోచించింది. అయితే అది అల్గారిథమ్‌ను ఆప్టిమైజ్ చేయలేనందున అది సాధ్యం కాలేదు. అందువల్ల టెక్ దిగ్గజం దీనిని రాబోయే వాచ్ సిరీస్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు. యాపిల్ వాచ్ సిరీస్ 8 లో శరీర ఉష్ణోగ్రత సెన్సార్‌తో లభించే అవకాశం ఉంది. యాపిల్ వాచ్ సిరీస్ 8 వేగవంతమైన చిప్ మరియు అధునాతన స్లీప్ ప్యాటర్న్‌లు మరియు స్లీప్ అప్నియాను గుర్తించగల స్లీప్ ట్రాకింగ్‌తో సహా మెరుగైన కార్యాచరణ ట్రాకింగ్ ఫీచర్‌లను పొందుతుందని భావిస్తున్నారు. డిజైన్ పరంగా స్మార్ట్‌వాచ్ పరిమాణం విషయానికి వస్తే కూడా పెద్ద డిజైన్ అప్‌డేట్‌లను చూడకపోవచ్చు. అలాగే వాచ్ సిరీస్ 8 కారు క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ను పొందుతుందని మునుపటి నివేదికలు సూచించాయి.

ఐఫోన్ 14 మ్యాక్స్ లీక్ స్పెసిఫికేషన్‌ల వివరాలు

ఐఫోన్ 14 మ్యాక్స్ లీక్ స్పెసిఫికేషన్‌ల వివరాలు

ఐఫోన్ 14 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ కి సంబందించిన స్పెసిఫికేషన్స్ వివరాలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ లీక్ సమాచారం ప్రకారం ఆపిల్ సంస్థ నుంచి రాబోయే ఐఫోన్ 14 మ్యాక్స్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.68-అంగుళాల ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 2,778×1,284 పరిమాణంలో 458 పిక్సెల్‌ల(PPI) సాంద్రతను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుత జెనరేషన్ A15 బయోనిక్ SoCతో రన్ అవుతూ 6GB LPDDR4X RAMతో జతచేయబడి వస్తుంది. ప్రస్తుతం అదే చిప్ తో ఐఫోన్13 సిరీస్ ఫోన్లు మరియు కొత్త ఐఫోన్ SE (2022) కూడా శక్తిని పొందుతున్నాయి. గత లీక్‌ల ప్రకారం ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్14 ప్రో మాక్స్ ఫోన్లు రెండు కూడా A16 బయోనిక్ SoCలతో శక్తిని పొందే అవకాశం ఉంది. ఆపిల్ సంస్థ నుంచి రాబోయే ఐఫోన్ 14 మ్యాక్స్ ఫోన్ లోని ఆప్టిక్స్ విషయానికి వస్తే ఇది 12-మెగాపిక్సెల్ సెన్సార్‌లతో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో ప్యాక్ చేయబడి వస్తుందని భావిస్తున్నారు. అలాగే ఈ హ్యాండ్‌సెట్ 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉండి నాచ్ ఫీచర్ మరియు ఫేస్ ID అన్ లాక్ తో వస్తుంది అని భావిస్తున్నారు.

iOS 15.5 కొత్త అప్‌డేట్

iOS 15.5 కొత్త అప్‌డేట్

కుపెర్టినో టెక్ దిగ్గజం ఆపిల్ తన యొక్క ఐఫోన్ వినియోగదారుల కోసం తాజాగా iOS 15.5 సాఫ్ట్‌వేర్ అప్ డేట్ ని విడుదల చేసింది. ఇది WWDC 2022 లో iOS 16 లాంచ్ అవుతుంది అని భావిస్తున్న కొన్ని వారాల ముందు రావడం విశేషం. iOS 15.5 అప్‌డేట్ ఆపిల్ వాలెట్ మరియు పాడ్‌క్యాస్ట్‌లకు కొత్త అనుభవాలను అందించడమే కాకుండా సెక్యూరిటీ పరిష్కారాల జాబితాను కూడా కలిగి ఉంటుంది. అదనంగా ఇది యాప్‌లో కొనుగోళ్లపై నియంత్రణ ఒత్తిడిని పరిష్కరించడానికి సహాయపడుతుంది అని ఆపిల్ సంస్థ పేర్కొంది. iOS 15.5తో పాటు ఆపిల్ ఐప్యాడ్ OS 15.5ని కూడా అర్హత కలిగిన ఐప్యాడ్ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది.

Best Mobiles in India

English summary
Apple Watch Series 8 Flat Display New Design Features Leaked: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X