Apple Watch సాయంతో కిడ్నాపర్ల నుంచి మహిళను కాపాడిన పోలీసులు

|

కిడ్నాప్ అయిన ఒక మహిళను దుండగుల నుండి ఎంతో చాకచక్యంగా కాపాడడానికి పోలీసులు టెక్నాలజీని వినియోగించారు. అందులోను ఆ మహిళ వాడుతున్న ఆపిల్ వాచ్ పోలీసులకు సహాయపడడం గమనార్హం. ఈ సంఘటన యుఎస్‌లో జరిగింది. టెక్సాస్‌లోని సెల్మాలో పోలీసులు కిడ్నాప్ చేసిన మహిళను గుర్తించడానికి ఆమె ధరించిన ఆపిల్ వాచ్‌లోని SOS ఫీచర్‌ను ఉపయోగించారు. ఈ ఆపిల్ వాచ్ బాధితురాలి యొక్క ఖచ్చితమైన లైవ్ లొకేషన్ డేటా సమాచారంను అందించింది. దీని ద్వారా పోలీసులు ఆమెను రక్షించగలిగారు. అంటే ఆపిల్ వాచ్ ఒక ప్రాణాన్ని కాపాడింది.

 
Apple Watch That Help Locate The Kidnapped Woman in US

ఆపిల్ వాచ్‌ SOS ట్రాకింగ్ ఫీచర్

 

ఈ సంఘటనకు సంబంధించిన వివరాల విషయానికి వెళితే టెక్సాస్‌లోని సెల్మాలో ఉన్న ఒక మహిళ తన కుమార్తె కిడ్నప్ అయినట్లు పోలీసులను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన పోలీసు అధికారులు మహిళ యొక్క మొబైల్ ఫోన్‌ను ట్రాక్ చేయడానికి అత్యవసర సెల్యులార్ పింగ్‌ను ఉపయోగించారు అయితే కాల్ మిడ్-వే డిస్కనెక్ట్ అయినట్లు గుర్తించారు. తరువాత బాధితురాలు ఆపిల్ వాచ్ వాడుతున్నట్లు గుర్తించి ఈస్ట్ సోంటెర్రా బ్లవ్‌డిలోని హయత్ ప్లేస్ హోటల్‌లో ఆమె ఖచ్చితమైన స్థానాన్ని చూపిస్తున్నట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు పార్కింగ్ స్థలంలోని ఒక వాహనంలో మహిళను కనుగొని ఆమెను కాపాడారు. కిడ్నాపర్ అడాల్బెర్టో లాంగోరియా అనే వ్యక్తి ఆ సమయంలో అక్కడి నుండి పారిపోయాడు కాని తరువాత అతన్ని అరెస్టు చేసారు.

Apple Watch That Help Locate The Kidnapped Woman in US

ఆపిల్ వాచ్ హృదయ స్పందన ఫీచర్ తో ప్రాణాలను కాపాడిన ఘటన

ఆపిల్ వాచ్ మనుషుల ప్రాణాలను కాపాడడం నివేదించడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని నెలల క్రితం ఆపిల్ వాచ్ యొక్క గుండె పర్యవేక్షణ ఫీచర్ సాయంతో 25 ఏళ్ల వ్యక్తి యొక్క హృదయ స్పందనలో అవకతవకలను గుర్తించడమే కాకుండా అతని ప్రాణాలను రక్షించడంలో సహాయపడింది. నవంబరులో ఈ 25 ఏళ్ల వ్యక్తి ఆపిల్ వాచ్ ధరించి ఉండడంతో తన విశ్రాంతి సమయంలో హృదయ స్పందన రేటు నిమిషానికి 210 బీట్ల వద్ద అసాధారణంగా ఎక్కువగా ఉందని హెచ్చరికలను పొందడంతో వెంటనే వైద్యుడిని సంప్రదించడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అలాగే ఇంతకుముందు ఆపిల్ వాచ్ హృదయ స్పందన రేటు పర్యవేక్షణ హెచ్చరికలతో 76 ఏళ్ల వ్యక్తి ప్రాణాన్ని కాపాడటానికి సహాయపడింది.

Best Mobiles in India

English summary
Apple Watch That Help Locate The Kidnapped Woman in US

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X