Apple watchOS 9 అప్‌డేట్‌లో కొత్త ఆరోగ్య ఫీచర్ల చేరికలు అనేకం...

|

ఆపిల్ టెక్ కంపెనీ నిర్వహించిన WWDC 2022 ఈవెంట్లో తన యొక్క కొత్త విడుదలలను ప్రకటించింది. ఈ సందర్భంగా ఆపిల్ కంపెనీ తన యొక్క ఆపిల్ వాచ్ కోసం సరికొత్త సాఫ్ట్‌వేర్ WatchOS 9ని కూడా ప్రకటించింది. వాచ్‌ఓఎస్ 9తో పాటు ఆపిల్ డెవలపర్ ప్రోగ్రామ్‌లో సభ్యులుగా ఉన్న డెవలపర్‌ల కోసం macOS యొక్క తదుపరి వెర్షన్ macOS వెంచురాను కూడా ప్రవేశపెట్టింది. వాచ్‌ఓఎస్ 9 యొక్క పబ్లిక్ బీటా వచ్చే నెలలో ఐఫోన్ 14 లాంచ్ సమయంలో విడుదల చేయనున్నది.

ఆపిల్ WatchOS 9

ఆపిల్ WatchOS 9 లో వివిధరకాల కొత్త హెల్త్ మరియు ఫిట్‌నెస్ ఫీచర్‌లు మరియు కొత్త వాచ్ ఫేస్‌లు మెరుగైన అనుభవంతో పొందుపరిచింది. WatchOS 9 వినియోగదారుల యొక్క నాడి వ్యవస్థను తరచుగా ట్రాక్ చేయడానికి మరియు పర్యవేక్షించడానికి అనుమతించే AFib హిస్టరీ ఫంక్షన్‌ను కూడా కలిగి ఉంది. ఇది వినియోగదారుల గుండె యొక్క సంకేతాలను ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తుంది. కావున ఇది ఉత్తమ చికిత్సలను కనుగొనడంలో మరియు జీవనశైలిలో మార్పులను సూచించడంలో వైద్యులకు సహాయం చేయడం కోసం మరింత ఉపయోగకరంగా ఉంటుంది అని ప్రజలు గమనించవలసి ఉంటుంది.

ఆపిల్ watchOS 9

ఆపిల్ watchOS 9 కొత్త అప్‌డేట్‌లో చేర్చబడిన మెడిసన్ యాప్ సాయంతో మీ ప్రిస్క్రిప్షన్‌లు, విటమిన్‌లు మరియు సప్లిమెంట్‌లను ఎప్పుడైనా తెలివిగా మరియు అప్రయత్నంగా ట్రాక్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇందులో వినియోగదారులు అప్పుడప్పుడు ఉపయోగించే మందులను నమోదు చేయవచ్చు మరియు వారు క్రమం తప్పకుండా తీసుకోవాల్సిన ప్రిస్క్రిప్షన్‌ల గురించి కూడా రిమైండర్‌లను అందుకుంటారు. యూజర్ల వద్ద ఆపిల్ వాచ్ లేకపోయినా కూడా వినియోగదారులు హెల్త్ యాప్ ద్వారా వారి మెడిసిన్ వివరాలను ట్రాక్ చేయవచ్చు.

watchOS9

ఆపిల్ watchOS9 కొత్త అప్‌డేట్‌లో ప్లేటైమ్, ఆస్ట్రానమీ, లూనార్ మరియు మెట్రోపాలిటన్ అనే నాలుగు కొత్త వాచ్ ఫేస్‌లు చేర్చబడ్డాయి. వీటితో పాటుగా కొత్త అప్‌డేట్‌లో హార్ట్ రేట్ జోన్‌ వంటి కొత్త ట్రైనింగ్ మోడ్ ఫీచర్‌లు కూడా ఉన్నాయి. watchOS9 అప్‌డేట్‌తో వినియోగదారులు తమ యాపిల్ వాచ్‌లో క్రౌన్‌ని ఉపయోగించడం ద్వారా వ్యాయామ సమయాలను వీక్షించవచ్చు. స్ట్రైడ్ లెంగ్త్, గ్రౌండ్ కాంటాక్ట్ టైమ్ మరియు వర్టికల్ ఆసిలేషన్ వంటి వర్కౌట్ వీక్షణల కోసం రన్నింగ్ ఫారమ్ మెట్రిక్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. స్లీపింగ్ పర్యవేక్షణ కోసం కూడా WatchOS 9 అప్‌డేట్‌లో కొన్ని దశలు చేర్చబడ్డాయి. WatchOS 9తో ఆపిల్ వాచ్ స్లీప్ ట్రాకింగ్‌లో ఇప్పుడు మోర్ REM, కోర్ మరియు డీప్ స్లీప్ వంటి కొన్ని దశలను చేర్చింది. ఒక కొత్త మెడ్స్ యాప్ యూజర్ యొక్క మందుల రికార్డు మరియు షెడ్యూల్‌ను కూడా ఉంచుతుంది.

ఆపిల్ వాచ్

ఆపిల్ వాచ్ వినియోగదారులు తమ ఆపిల్ వాచ్ ద్వారా ఆరు అదనపు కీబోర్డ్ భాషలను మరియు వారి ఇంటి గాడ్జెట్‌లను నియంత్రించడానికి అనుమతించే ఫ్యామిలీ సెటప్‌ను కూడా ఉపయోగించుకోగలరు. అదనంగా watchOS9 కొత్త అప్ డేట్ లో ఫేస్ ఎడిటర్ కూడా ఉంది. ఇది వినియోగదారులు తమ వాచ్ ఫేస్‌లను అనుకూలీకరించడానికి అనుమతిస్తుంది. ఈ ఏడాది చివర్లో వినియోగదారులకు అందుబాటులో ఆపిల్ WatchOS 9 అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆపిల్ వాచ్ సిరీస్ 4, ఆపిల్ వాచ్ సిరీస్ 5, ఆపిల్ వాచ్ సిరీస్ 6, ఆపిల్ వాచ్ సిరీస్ 7 మరియు ఆపిల్ వాచ్ SE తాజా అప్‌డేట్‌లకు అనుకూలంగా ఉంటాయి.

Best Mobiles in India

English summary
Apple WatchOS 9 New Update Comes With Additional Health Features and Medications App

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X