ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024.. కీలక ఫీచర్‌లతో iOS 18, ఐప్యాడ్OS 18, వాచ్OS 11 ప్రకటన..!!
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ ఇవాళ వరల్డ్‌వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 (Apple WWDC 2024) నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న iOS 18 ను ప్రకటన చేసింది. దీని ద్వారా హోమ్ స్క్రీన్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. యాప్ ఐకాన్‌లను డార్క్ మోడ్‌లోకి మార్చుకోవచ్చు. హోమ్ స్క్రీన్ ఐకాన్‌ల కలర్‌లు మార్చుకొనేందుకు వీలుంది. దీంతోపాటు పునరుద్ధరించిన కంట్రోల్ సెంటర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా యూజర్లు బటన్‌లను కస్టమైజ్ చేసుకోవచ్చు. మరియు సెట్సింగ్స్‌ను మార్చుకోవచ్చు. లాక్ స్క్రీన్ నుంచే ఈ మార్పులు చేయవచ్చు.
భద్రత పరంగా iOS 18 మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంటుంది. Lock an యాప్‌ను కలిగి ఉంటుంది. దీని ద్వారా ఐఫోన్‌లోని డేటాను మరింత భద్రతనిస్తుంది. యాప్‌లను ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టవచ్చు. మరియు లాక్ చేయవచ్చు. ఈ OS ద్వారా మెసెజ్‌లను మీకు కావాల్సిన సమయానికి షెడ్యూల్ చేయవచ్చు. మరియు ఎమోజీలను ఉపయోగించవచ్చు. మెసెజ్‌ల్లో యానిమేషన్లను కూడా పంపవచ్చు.

శాటిలైట్ ద్వారా కుటుంబ సభ్యులు, స్నేహితులు సహా ఇతరులకు మెసెజ్‌లను చేయవచ్చు. మెయిల్స్‌ను విభజించారు. ఫలితంగా మెరుగైన అనుభూతి కలుగుతుందని భావిస్తున్నారు. ఒకే దగ్గర మెయిల్‌లను చూసేందుకు వీలుంటుంది. ఐఫోన్‌లో గేమింగ్ అనుభూతిని మెరుగుపరిచేందుకు వీలుగా iOS 18 ను ప్రవేశపెట్టింది.
ఈ iOS 18 లో ఫోటోస్ విభాగంలో గణనీయమైన మార్పులు చేసింది. ఫోటో గ్రిడ్ స్టాండర్డ్‌గా ఉంటుంది. అయితే తేదీలు మరియు ప్రత్యేకతల ఆధారంగా విభజించేందుకు వీలుగా ఫిల్టర్ బటన్‌ను కలిగి ఉంటుంది. మీకు ఇష్టమైన ఫోటోలతో కూడిన ఫోల్డర్‌ను రూపొందించేందుకు వీలుగా కలెక్షన్స్ ఆప్షన్ ఉంటుంది. సమయం, వ్యక్తులు, విహారయాత్రలు సహా ఇతర అంశాల ఆధారంగా విభజించబడుతుంది.
ట్రెక్కింగ్ కోసం ప్రత్యేకమైన మ్యాప్‌లను కలిగి ఉంటుంది. దీంతోపాటు మెరుగైన కాలింగ్ అనుభవం కోసం వాయిస్ ఐసోలేషన్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. మరియు మరో ఆసక్తికరమైన ఫీచర్‌ను కలిగి ఉంది. ఫోన్ కాల్స్ వచ్చిన సమయంలో మాట్లాడేందుకు లేదా నిరాకరించేందుకు తల సౌజ్ఞల ద్వారా నియంత్రించవచ్చు. ఈ ఆపిల్ ఈవెంట్‌లో TVOS ను లాంచ్ చేసింది.
దీంతోపాటు సరికొత్త ఫీచర్‌లతో Watch OS 11 ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త OS ట్రైనింగ్ మోడ్ ను కలిగి ఉంటుంది. దీని ద్వారా రోజువారీ వ్యాయామాలను పర్యవేక్షించవచ్చు. దీంతోపాటు శ్వాస క్రియ రేటు, శరీర ఉష్ణోగ్రత, హార్ట్ రేట్‌ను పర్యవేక్షిస్తుంది. మరియు యూజర్లను అప్రమత్తం చేస్తుంది. ట్రాన్సిలేషన్, ఇతర రోజువారీ కార్యక్రమాలను ట్రాక్ చేస్తుంది. దీంతోపాటు వాచ్ ఫేస్‌లుగా మంచి ఫోటోలు ఎంచుకొనేందుకు సాయం చేస్తుంది.
దీంతోపాటు ఈ ఆపిల్ కార్యక్రమంలో ipadOS 18 ను లాంచ్ చేసింది. ఇది iOS 18 తరహా ఫీచర్‌లను కలిగి ఉంటుంది. హోమ్‌స్క్రీన్‌ను కస్టమైజ్ చేసుకోవడం, కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ OS షేర్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని ద్వారా స్క్రీన్‌ను షేర్ చేసుకోవచ్చు. ఈ OS మరో ముఖ్యమైన ఫీచర్‌ను కలిగి ఉంది.
ఈ OS క్యాలిక్యూలేటర్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. దీని ద్వారా భారీ మ్యాథ్స్ (Maths) ప్రశ్నలకు కూడా సులభంగా పరిష్కరించేలా మ్యాథ్ నోట్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు స్మార్ట్ స్క్రిప్ట్ ఆప్షన్‌ను కూడా కలిగి ఉంది. దీంతోపాటు మరెన్నో మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంది.
iOS 18 బీటా మరియు iPadOS 18 బీటా ఇతర అప్‌డేట్‌లు ఇవాళ్టి నుంచి డెవలపర్‌లకు అందుబాటులో ఉంటాయని ఆపిల్ వెల్లడించింది. అదే ఆపిల్ యూజర్లకు వచ్చే నెల నుంచి బీటా వెర్షన్‌లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. పూర్తి స్థాయిలో ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో వెల్లడి కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications