Home
News

Apple WWDC 2024 :ఈవెంట్ తేదీ, టైమింగ్ ఖరారయ్యాయి! ఏమేమి లాంచ్ కాబోతున్నాయి

Apple WWDC 2024 ఈవెంట్ ఇప్పుడు మరి కొన్ని వారాల దూరంలో మాత్రమే ఉంది మరియు ఆపిల్ యొక్క కీనోట్ ఈవెంట్ కోసం తేదీ మరియు టైమింగ్ ను కంపెనీ ధృవీకరించింది. ఆపిల్ దాని అతిపెద్ద ఈవెంట్ లలో WWDC 2024 ఈవెంట్‌ ఒకటిగా భావించబడుతుంది. ఇక్కడ డెవలపర్‌లు మరియు ఇతర వ్యక్తులు కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లు మరియు కంపెనీ కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్న AI పురోగతిని నిశితంగా పరిశీలిస్తారు. AI వార్తల గురించి కంపెనీ అధికారికంగా ఎటువంటి సూచనలను అందించలేదు, అయితే టిమ్ కుక్, ఇటీవల వారి ప్రణాళికల గురించి చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఇప్పుడు WWDC 2024 ఈవెంట్ త్వరలో ఉన్నందున ఇందులో ప్రకటించే అవకాశం ఉంది.

ఆపిల్ WWDC 2024 కీనోట్ ఈవెంట్ తేదీ, టైమింగ్ మరియు ఎక్కడ చూడాలి వివరాలు
ఆపిల్ WWDC 2024 జూన్ 10న ప్రారంభమై వచ్చే జూన్ 14 వరకు కొనసాగుతుంది. మీరు భారతదేశంలో ప్రత్యక్ష ప్రసార ఈవెంట్‌ను చూస్తున్నట్లయితే, ప్రధాన ముఖ్య కార్యక్రమం సోమవారం, జూన్ 10, 10 AM PT లేదా 10:30 PM IST కి జరుగుతుంది.

Apple WWDC 2024 Event Launch Date

ఈ లైవ్ కీనోట్ నుండి అన్ని అప్‌డేట్‌లను పొందడానికి మీరు మొదటి రోజున ఆపిల్ ఈవెంట్‌ల పేజీకి వెళ్లవచ్చు లేదా మీరు ఆపిల్ యొక్క యూట్యూబ్ పేజీ లో కూడా చూడవచ్చు. ఇక్కడ ఈ కీనోట్ ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఆపిల్ WWDC 2024 లో ఏమేమి లాంచ్ కాబోతున్నాయి:
ఈ ఆపిల్ WWDC 2024 లో AI, IOS 18 మరియు మరిన్నింటిని మనము చూడవచ్చు.
ఆపిల్ WWDC 2024 కీనోట్ తప్పనిసరిగా సంబంధిత పరికరాల కోసం కొత్త iOS 18, iPadOS 18, watchOS అప్‌డేట్ మరియు macOS వెర్షన్‌ను విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఆపిల్ కూడా AI గురించి ప్రపంచం ముందు ప్రకటించే అవకాశం ఉంది

ఇంకా, కొత్త ఐఫోన్ 16 మోడళ్ల కోసం డివైజ్‌లో బేక్ చేయబడే GenAI ఫీచర్ల యొక్క సొంత వెర్షన్‌పై కంపెనీ పని చేస్తోందని చెప్పబడింది. ఆపిల్ iOS 18కి పెద్ద మార్పులు చేస్తుందని భావిస్తున్నారు. ఇది గత సంవత్సరాలలో వచ్చిన అతిపెద్ద అప్‌గ్రేడ్ అవుతుందని భావిస్తున్నారు.

ఇందులో హోమ్ స్క్రీన్‌ను అనుకూలీకరించడానికి మరిన్ని ఆప్షన్లు మరియు కొత్తగా Siri ఉన్నాయి. ఆపిల్ వారి AI అప్లికేషన్‌లను ఐఫోన్ లలో తీసుకురావడానికి ఒప్పందం కోసం OpenAI మరియు Google తో చర్చలు జరుపుతున్నట్లు కూడా చెప్పబడింది. ఈ వివరాలు ఈ ఈవెంట్‌లో ధృవీకరించే అవకాశం ఉంది.

WWDC లో OS యొక్క అధికారిక లాంచ్ కి ముందు, Apple ఇప్పటికే అనేక కొత్త ఫీచర్లను లీక్ చేసింది. ఐ-ట్రాకింగ్ కెపాబిలిటీ, మ్యూజిక్ హాప్టిక్స్, జెనరేటివ్ AI వంటి ఫీచర్లు ఉన్నాయి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple WWDC 2024 Event Launch Date And Timings Confirmed. Expected To Launch Ai, iOS 18, TvOS And More.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X