ఆపిల్ WWDC 2025 తేదీలు వచ్చేశాయ్.. ఎలాంటి ప్రకటనలు ఉండొచ్చు..!
టెక్ దిగ్గజం ఆపిల్ వార్షిక సమావేశం WWDC 2025 (వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్) తేదీలు వెల్లడయ్యాయి. ఈ వివరాలను ఆపిల్ వెల్లడించింది. అయితే ఎలాంటి ఉత్పత్తులను లాంచ్ చేయనుందో ప్రస్తుతం ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆపిల్ WWDC 2025 జూన్ 9 వ తేదీ నుంచి జూన్ 13 వ తేదీ వరకు జరగనుంది. అమెరికా కాలిఫోర్నియాలోని కుపెర్టినో ఆపిల్ క్యాంపస్‌లో ఈ సమావేశం జరుగుతుంది.
ఈ ఆపిల్ ఈవెంట్‌లో iOS 19 ను ఆవిష్కరించే అవకాశం ఉంది. దీంతోపాటు ఆపిల్ ఇంటెలిజెన్స్ కొత్త ఫీచర్లు, ఇతర సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ సహా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 ఎయిర్ స్మార్ట్‌ఫోన్ వివరాలను వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఆపిల్ WWDC ఈవెంట్‌లో పాల్గొనేందుకు డెవలపర్‌లకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు నిపుణులతో నేరుగా మాట్లాడే అవకాశం కలుగుతుంది. ఈ సమావేశంలో ఆపిల్ ఇంజినీర్‌లు, డిజైనర్‌లతో కనెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
ఆపిల్ వార్షిక సమావేశం 2025 లో iOS 19 ఆవిష్కరించే అవకాశం ఉంది. మరియు ఏయే డివైస్‌లు ఈ OS ను సపోర్టు చేస్తుందో జాబితాను వెల్లడించే అవకాశం ఉంది. iPadOS 19, VisionOS అప్‌డేట్స్‌తోపాటు ఆపిల్ ఇంటెలిజెన్స్‌లో మరిన్ని కొత్త ఫీచర్‌ల ప్రస్తావన ఉండొచ్చని భావిస్తున్నారు.
ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌పై ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటు హార్డ్‌వేర్ అప్‌డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. గతంలో నిర్వహించిన సమావేశాల్లో విజన్ ప్రో హెడ్‌సెట్ సహా అనేక ఉత్పత్తులను ఆవిష్కరించారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఆపిల్ నుంచి ఈ సంవత్సరం ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ కానుందని భావిస్తున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 17 ఎయిర్ హ్యాండ్‌సెట్ కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది. సరికొత్త డిజైన్ సహా ఇతర అప్‌డేట్స్‌తో ఈ ఫోన్ విడుదల కానుందని లీక్స్ వస్తున్నాయి. సన్నని ఐఫోన్‌గా నిలవనుందని తెలుస్తోంది.
ఈ ఈవెంట్‌ను ఆపిల్ డెవలపర్ యాప్, వెబ్‌సైట్, యూట్యూ్బ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈవెంట్ కోసం ఈపిల్ డెవలపర్ యాప్, వెబ్‌సైట్ ద్వారా వివరాలు వెల్లడి కానున్నాయి. ఆపిల్ డెవలపర్ కాన్ఫరెన్స్ కు హాజరయ్యే వారికి ముందుగానే పూర్తి సమాచారం అందిస్తారు.
టెక్నాలజీ పరంగా ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్‌కు ప్రత్యేకత ఉంది. ఎప్పటి నుంచో ఈ ఈవెంట్‌ను ఆపిల్ నిర్వహిస్తుంది. ఆపిల్ పార్క్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆపిల్ అప్‌డేట్స్, సహా టెక్నాలజీ పరంగా ఇతర అంశాలపై లోతైన చర్చ జరుగుతుంది.
ఆపిల్ నుంచి ఇప్పటికే ఐఫోన్ 16e, మ్యాక్‌బుక్ ఎయిర్ M4, ఐప్యాడ్ ఎయిర్ M3, మ్యాక్ స్టూడియో వంటి ఉత్పత్తులు విడుదల అయ్యాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ఐఫోన్ 17 సిరీస్ విడుదల కానుందని అంచనా వేస్తున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఫోన్‌లు విడుదల కానున్నాయి.
ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించిన అనేక వివరాలు లీక్ అయ్యాయి. ఐఫోన్ 17 ఎయిర్ హ్యాండ్‌సెట్ 5mm నుంచి 6.25mm థిక్‌నెస్‌ను మాత్రమే కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ సింగిల్ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications







