Apple WWDC 2025.. లైవ్ ట్రాన్స్‌లేషన్ నుంచి వర్కౌట్ బడ్డీ వరకు ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు..!
ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2025 (Apple WWDC 2025) లో ఆపిల్ ఇంటెలిజెన్స్ కీలక అప్‌డేట్స్‌ను పరిచయం చేసింది. ఐఫోన్, ఐప్యాడ్, Mac, ఆపిల్ వాచ్, విజన్ ప్రో డివైజ్‌లకు లైవ్ ట్రాన్స్‌లేషన్, విజువల్ టూల్స్ వంటి అనేక అప్‌డేట్స్ అందుబాటులోకి రానున్నాయి. ఆపిల్ ఏఐ మోడల్ తొలిసారిగా డెపలపర్‌లు ఉపయోగించుకొనేందుకు అవకాశం కల్పించింది. యూజర్లు అందరికీ ఈ సంవత్సరం చివర్లో వచ్చే అవకాశం ఉంది.
లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ మెసేజ్‌లకు, ఫేస్‌టైమ్, ఫోన్ కాల్స్ కూడా అందుబాటులోకి రానుంది. వివిధ భాషల యూజర్ల మధ్య టైక్ట్స్, వాయిస్ సంభాషణలను రియల్ టైమ్‌లో ట్రాన్స్‌లేషన్ చేయవచ్చు. అన్ని టాన్సిలేషన్స్ పూర్తిగా డివైస్ లోనే జరుగుతుందని తెలిపింది. ఫలితంగా ప్రైవసీ పరంగా ఎటువంటి భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం లేదు.

విజువల్ ఇంటెలిజెన్స్ యూజర్లకు అవసరాలకు అనుగుణంగా కంటెంట్, బ్రౌజింగ్‌పై అవగాహన కల్పిస్తుంది. ఐఫోన్‌లో స్క్రీన్‌షాట్ తీసేందుకు ఉపయోగించే బటన్‌తో ఈ విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ను యాక్టివేట్ చేయవచ్చు. యూజర్లు ప్రతిసారి కాపీ, పేస్ట్ ద్వారా కాకుండా ఆన్ స్క్రీన్ కంటెంట్ గురించి వివరాలు తెలుసుకోవచ్చు.
జెన్‌మోజీ, ఇమేజ్ ప్లేగ్రౌండ్ ను అప్‌డేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. దీంతో అనేక ఎమోజీలను కలిపేందుకు మరియు కొత్తగా సృష్టించేందుకు అవకాశం ఉంటుంది. జెన్‌మోజీ ద్వారా ఫేసియల్ ఎక్స్‌ప్రెషన్స్, హెయిర్‌స్టైల్ ను రిఫ్లెక్ట్ చేయగలుగుతుంది. దీంతో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ పోలికలను సులభంగా క్రియేట్ చేయవచ్చు.
ఆపిల్ వాచ్‌లకు వర్కౌట్ బడ్డీ ఫీచర్ కొత్తగా రానుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకొని, రియల్‌టైం సహా ఇతర ఫీడ్‌బ్యాక్‌ను అందిస్తుంది. మీ ఫిట్‌సెస్ హిస్టరీ, హార్ట్ రేట్ సహా అనేక వివరాలను పరిగణనలోకి తీసుకుంటుంది. రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ వంటి సాధారణ వ్యాయామాలకు కూడా సపోర్టు చేస్తుంది. ఈ ఫీచర్ పనిచేసేందుకు బ్లూటూత్ హెడ్‌ఫోన్, ఆపిల్ ఇంటెలిజెన్స్‌ను సపోర్టు చేసే ఐఫోన్ అవసరం కానుంది.
షార్ట్‌కట్ యాప్ ద్వారా అనేక పనులను సులభంగా పూర్తి చేయవచ్చు. సమ్మరీ, నోట్స్, ఇమేజ్ క్రియేషన్ వంటి పనులను ఆటోమేటిక్‌గా క్రియేట్ చేయవచ్చు. షార్ట్‌కట్ యాప్ పూర్తి ఆపిల్ డివైజ్‌లోనే పనిచేయాలా లేదా క్లిష్టమైన సమస్యల కోసం ChatGPT ని ట్యాప్ చేయాలా అనేది యూజర్లే నిర్ణయం తీసుకోవచ్చు.
ఆపిల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ఆపిల్ డెవలపర్ ప్రొగ్రాం ద్వారా అందుబాటులో ఉంది. వచ్చే నెలలో పబ్లిక్ బీటా వెర్షన్ అందుబాటులోకి రానుంది. అయితే ఏయే డివైజ్‌లకు సపోర్టు చేస్తుంది. మరియు అందుబాటులోకి రానుందనే సందేహం వచ్చి ఉంటుంది.
అయితే ఇందులో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ తోపాటు ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఉన్నాయి. దీంతోపాటు M1 లేదా అంతకంటే లేటెస్ట్ చిప్‌సెట్‌తో పనిచేసే ఐప్యాడ్‌లు, Macs సపోర్టు చేస్తాయి. దీంతోపాటు A17 ప్రో చిప్‌సెట్‌తో పనిచేసే ఐప్యాడ్ మినీ కూడా సపోర్టు చేస్తుంది.


Click it and Unblock the Notifications