ఆపిల్ WWDC 2025.. ఆపిల్ ఇంటెలిజెన్స్‌లో కొత్త ఫీచర్‌లు, iOS 26, tvOS 26, macOS 26 సహా కీలక ప్రకటనలు..!
ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ (Apple WWDC 2025) ప్రారంభం అయింది. ఇందులో అనేక ప్రకటనలు వచ్చాయి. ముఖ్యంగా iOS 26 ను ప్రకటన చేసింది. ఇప్పటి వరకు iOS 18 మాత్రమే ఉండగా.. iOS 19 కు బదులుగా iOS 26 పేరుతో ప్రకటన చేసింది. 2026 క్యాలెండర్ ఇయర్‌కు అనుగుణంగా ఈ OS పేరులో మార్పులు చేసింది. దీంతోపాటుగా మరో కీలక మార్పును గమనించవచ్చు.
తాజాగా ప్రకటన చేసిన OS లో లిక్విడ్ గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. 2013 ఈవెంట్లో iOS 7 ప్రకటన తర్వాత దీనిని భారీ మార్పుగా పరిగణించవచ్చు. లిక్విడ్ గ్లాస్ డిజైన్ iOS 26 లో ప్రత్యేకంగా ఉండనుంది. ఈ కొత్త ఇంటర్‌ఫేస్ ద్వారా యూజర్లు మరింత మెరుగైన అనుభూతిని పొందుతారని ఆపిల్ చెబుతోంది.

లిక్విడ్ గ్లాస్ కేవలం డిజైన్ పరంగా మార్పులనే కాకుండా ఇంటర్‌ఫేస్ మరింత మెరుగైన, సహజమైన అనుభూతిని అందిస్తుందని చెబుతోంది. ఆపిల్ విజన్ ప్రోలో కనిపించే.. విజువల్ ఎలిమెంట్స్‌ను ఈ OS లోనూ కనిపిస్తాయని చెబుతోంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి iOS 26 అందుబాటులోకి వస్తుంది.
*దీంతోపాటు ఈ ఆపిల్ WWDC 2025 లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అనేక ప్రకటన చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫీచర్‌లతోపాటు టెస్టింగ్ దశలో ఉన్న ఫీచర్‌లు ఈ సంవత్సరం చివరి నాటికి విడుదల చేస్తామని తెలిపింది. ఇందులో లైవ్ ట్రాన్స్‌లేషన్, ఆపిల్ వాచ్ వర్కౌట్ బడ్డీ, విజువల్ ఇంటెలిజెన్స్‌లో ChatGPT ఇంటిగ్రేషన్, జెన్‌మోజీ అప్‌డేట్స్ కూడా ఉన్నాయి.
* ఈ సంవత్సరం మరిన్ని ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో ముఖ్యంగా మెసేజ్ యాప్స్ వంటి ప్లాట్‌ఫాంలకు లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను ఇంటిగ్రేట్ చేయనున్నారు. ఫలితంగా మెసేజింగ్ యాప్, ఫేస్‌టైం, ఫోన్ యాప్ ద్వారా ఇతర భాషల వారితోనూ సౌకర్యవంతంగా సంభాషించేందుకు అవకాశం ఉంటుంది.
లైవ్ ట్రాన్స్‌లేషన్ పూర్తిగా ఆన్ డివైజ్ ఫీచర్ గానే ఉంటుంది. ఫలితంగా భద్రతా పరంగా ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఆటోమేటిక్‌గానే లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ పనిచేస్తుంది. ఫలితంగా సులభంగా ఇతరులతో చాట్ చేసేందుకు అవకాశం కలుగుతుంది.
ఫేస్‌టైం లోనూ ఆటోమేటిక్‌గా లైవ్ క్యాప్షన్స్ జనరేట్ కానున్నాయి. ఇతర భాషల వ్యక్తుల మాటలను లైవ్ ట్రాన్స్‌లేట్ చేసి, మనకు వినిపిస్తుంది. దీంతోపాటు విజువల్ ఇంటెలిజెన్స్‌ను కూడా అప్‌డేట్ చేస్తుంది. ఫలితంగా డివైజ్ కెమెరా ద్వారానే ChatGPT నుంచి అనేక సమాధానాలు రాబట్టవచ్చు.
* macOS 26 అప్‌డేట్ M సిరీస్ mac ప్రో మోడల్స్, Mac studio, macbook air మోడల్స్ కు సపోర్టు చేస్తుంది. ఈ వెర్షన్ డెవలపర్‌లకు ప్రస్తుతం అందుబాటులో ఉండగా.. వచ్చే నెలలో బీటా వెర్షన్‌ను లాంచ్ చేస్తామని ఆపిల్ తెలిపింది. దీంతోపాటు tvOS 26 అప్‌డేట్ ద్వారా మెరుగైన ఫేస్‌టైం అనుభూతిని పొందుతుందని చెబుతోంది. టీవీ OS అప్‌డేట్‌లో లైవ్ క్యాప్షన్ ఫీచర్ అనేక భాషలకు సపోర్టు చేస్తుంది.


Click it and Unblock the Notifications