ఆపిల్ WWDC 2025 ఎప్పుడు ప్రారంభం కానుంది.. ఏయే ప్రకటనలకు అవకాశం ఉంది..?
ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) 2025 జూన్ 9 వ తేదీ నుంచి 13 వ తేదీ మధ్య జరగనుంది. ఆపిల్ పార్క్‌లో ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌లో టెక్నాలజీ డెవలప్‌మెంట్స్ సహా ఫీచర్‌లు, సాఫ్ట్‌వేర్స్ గురించి అనేక వివరాలు వెల్లడి కానున్నాయి. ఆపిల్ WWDC 2025 ఈవెంట్‌ను లైవ్ టెలికాస్ట్ అందుబాటులో ఉంటుంది. ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, అనేక వివరాలు వెల్లడిస్తారు. భారత్ కాలమానం ప్రకారం జున్ 9 వ తేదీ 10 PM గంటలకు ఈవెంట్ ప్రారంభం కానుంది.
ఆపిల్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ లో (Apple WWDC 2025) నేరుగా పాల్గొనేందుకు కూడా అవకాశం ఉంటుంది. డెవలపర్స్‌తోపాటు ఇతర నిపుణులు హాజరయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఆపిల్ స్టూడెంట్ ఛాలెంజ్ విజేతలు కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. ఆపిల్ వెబ్‌సైట్‌తోపాటు ఆపిల్ డెవలపర్ యాప్ ద్వారా ఇందు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆపిల్ WWDC 2025 కార్యక్రమంలో ఆపిల్ ఉత్పత్తులు మరియు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, OS అప్‌డేట్స్ సహా ఇతర మార్పుల గురించి వివరిస్తారు. iOS, iPadOS, VisionOS, watchOS, tvOS పై అప్‌డేట్స్ సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు కీలక అంశాలపై లోతైన చర్చలు జరగనున్నాయి.
ఆపిల్ సీఈవో కీనోట్ అనంతరం అనేక టెక్నికల్ సెషన్స్‌ను నిర్వహిస్తారు. ఆపిల్ నిపుణులతో సుమారు 100 పైగా సెషన్స్‌ను నిర్వహిస్తారు. ఆపిల్ నిపుణులతో డెవలపర్‌లు నేరుగా సమావేశం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఫలితంగా అనేక అంశాలపై సరైన సమాచారం తెలుసుకొనేందుకు అవకాశం ఉంటుంది.
ఆపిల్ డెవలపర్ ప్రొగ్రాం, ఆపిల్ డెవలపర్ ఎంటర్‌ప్రైజ్ ప్రొగ్రాం మెంబర్లు.. ఆపిల్ నిపుణులతో నేరుగా ఆన్‌లైన్ ద్వారా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్, డిజైన్, డెవలపర్ టూల్స్ పైన చర్చించేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ లో అనేక కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.
ఆపిల్ WWDC 2025 iOS 19, iPadOS 19, macOS 16, watchOS 12, tvOS 19, iOS 19, iPadOS 19 పై కీలక అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు మరిన్ని కీలక ప్రకటనలకు అవకాశం ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఆపిల్ ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్స్ విడుదల కానున్నాయి. ఐఫోన్ 17 ఎయిర్ మోడల్ అల్ట్రా స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇటీవలే ఎయిర్ మోడల్ బ్యాటరీ వివరాలు లీక్ అయ్యాయి.
ఈ లీక్స్ ఆధారంగా ఐఫోన్ 17 ఎయిర్ మోడల్ 2800mAh బ్యాటరీతో లాంచ్ కానుందని తెలుస్తోంది. తక్కువ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నా.. ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇచ్చే విధంగా ప్రత్యేక టెక్నాలజీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications







