Home
News

ఇవాళే ఆపిల్ WWDC 2025.. ఎప్పుడు ప్రారంభం కానుంది.. లైవ్‌ వివరాలు..!

Apple WWDC 2025 : ఆపిల్‌ WWDC (వరల్డ్ వైడ్‌ డెవలపర్ కాన్ఫరెన్స్‌) 2025 ఇవాళ ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఆపిల్‌ అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా ఈ ఈవెంట్‌ లైవ్‌ వీక్షించవచ్చు. దీంతోపాటు ఆపిల్‌ డెవలపర్‌ యాప్‌, ఆపిల్‌ టీవీ యాప్‌, సంస్థ వెబ్‌సైట్ ద్వారా కీ నోట్‌ తోపాటు ఇతర ఆన్‌లైన్ సెషన్స్‌ను చూడవచ్చు.

ఆపిల్‌ WWDC 2025 ఈవెంట్ ద్వారా అనేక కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఈవెంట్‌లో ఎటువంటి డివైజ్‌లను ఆవిష్కరించే అవకాశం లేదని తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్‌ సంబంధిత ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌తోపాటు మరిన్ని డివైజ్‌లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

apple WWDC 2025

సాఫ్ట్‌వేర్ పరంగా iOS 26, iPadOS 26, macOS 26, watchOS 26, visionOS 26 పేరుతో కొత్త అప్‌డేట్స్‌పై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు మార్క్‌ గుర్మాన్‌ వెల్లడించిన వివరాల ఆధారంగా థర్డ్ పార్టీ డెవలపర్‌లు వారి సొంత యాప్స్‌లో AI ఫీచర్లను సపోర్టు చేసేందుకు వీలుగా కొన్ని నిర్ణయాలు ప్రకటన చేసే అవకాశం ఉంది.

సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్ పరంగా :
ఈ సంవత్సరం రెండో భాగంలో ఈ అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది. సంవత్సరం ఆధారంగా ఈ అప్‌డేట్స్‌ పేర్లు ఉంటాయని తెలుస్తోంది. ఫలితంగా ఆపిల్‌ డివైజ్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్ పరంగా యూజర్లలో స్పష్టత ఉంటుందని తెలుస్తోంది.

డిజైన్స్‌లో కీలక మార్పులు! :
గతంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా iOS మరియు iPadOS డిజైన్స్‌లో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆపిల్‌ ఇన్‌ బిల్ట్‌ యాప్స్‌ను సులభంగా ఉపయోగించుకొనేలా ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు లైవ్‌ ట్రాన్స్‌లేషన్‌, ఆపిల్‌ మ్యూజిక్ యాప్‌లో యానిమేటెడ్‌ ఆర్ట్‌ వర్క్‌ కనిపించే అవకాశం ఉంది.

దీంతోపాటు watchOS 26, tvOS 26 సహా ఇతర ఫీచర్‌లతో మార్పులు ఉండే అవకాశం ఉంది. వాచ్‌ఓఎస్‌లో విజువల్‌గా మార్పులు ఉండే అవకాశం ఉంది. టీవీఓఎస్‌లో కూడా మార్పులపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కార్‌ప్లే లోనూ కొన్ని విజువల్‌ అప్‌డేట్స్‌ వచ్చే అవకాశం ఉంది.

దీంతోపాటు ఎయిర్‌పాడ్స్‌ ప్రో 2, ఎయిర్‌పాడ్స్ 4 హెడ్‌ గెశ్చర్స్‌ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. ఈ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ కే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అయితే OS పేర్లు మార్పు ఈవెంట్‌లో హైలెట్‌గా నిలిచే అవకాశం ఉంది. అయితే దీనిపై లీక్స్ మినహా ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ప్రస్తుతం ఉన్న లీక్స్‌ ఆధారంగా ఐఫోన్‌ 17 సిరీస్‌ ఫోన్‌లు ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో లాంచ్‌ కానున్నాయి. ఇందులో భాగంగా ఐఫోన్ 17, ఐఫోన్‌ 17 ఎయిర్‌, ఐఫోన్‌ 17 ప్రో, ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ విడుదల కానున్నాయి. ఈ సంవత్సరం ఐఫోన్‌ 17 ఎయిర్‌ ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
apple WWDC 2025 will start from today here are the live stream details and expected announcements
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X