జూన్ 5న ఆపిల్ WWDC "ప్రత్యేక కార్యక్రమం".. అప్‌డేట్లు, ఫీచర్లపై కీలక ప్రకటనలు..!
ఆపిల్ డెవలపర్ కాన్ఫరెన్స్ WWDC జూన్ 5న ప్రారంభం అవుతుంది. అదేరోజు సుమారు రెండు గంటల కీనోట్‌తో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఆపిల్ పార్క్‌లో రోజంతా జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో iOS, MacOS ఇతర ఆపిల్ ఉత్పత్తులపై రానున్న అప్‌డేట్లపై ప్రకటన చేయనుంది. మిక్సిడ్ రియాలిటీ హెడ్‌సెట్‌తోపాటు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొన్ని ప్రకటనలను చూడవచ్చు.
అయితే దీనిపై ఆపిల్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. xrOSకు సంబంధించినది కావచ్చు. మిక్సిడ్ రియాలిటీ హెడ్‌సెట్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫాం. తాజా సమాచారం ప్రకారం.. ఈ హెడ్‌సెట్ జూన్‌లో నిర్వహించనున్న డెవలపర్ కాన్ఫరెన్స్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.

ఆపిల్ కార్యక్రమానికి హాజరయ్యే డెవలపర్‌లు ఆదివారం చెక్‌ఇన్ కోసం నమోదు చేసుకోవచ్చు. జాన్ 5, సోమవారం ఉదయం సమావేశం ప్రారంభం అవుతుంది. ఉదయం 10 గంటలకు ఆ రోజు జరగాల్సిన వివిధ కార్యక్రమాల వివరాలతో ఉపన్యాసం ఉంటుంది.
అనంతరం స్టేట్ ఆఫ్ ది యూనియన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఆ సమావేశంలో వివిధ ప్రకటనలపై సమాచారం అందుతుంది. ఆపిల్ పార్క్‌లోని ది రింగ్ పేరిట ఉన్న భవనంలో అతిథులుగా వస్తున్న డెపలపర్లు అందులో సైన్‌అప్ కావచ్చు. సోమవారం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం ఆపిల్ డిజైన్ అవార్డు కార్యక్రమం జరగనుంది.
మంగళవారం ఆపిల్ డెవలపర్ సెంటర్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. గత సంవత్సరం ఈ సెంటర్‌ను ప్రారంభించారు. అయితే సమావేశం కొందరికే ఆహ్వానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రత్యేక సమావేశంలో ఏయే అంశాలపై చర్చిస్తారనే దానిపై ఆపిల్ సమాచారం వెల్లడించలేదు.
ఆపిల్ యొక్క వార్షిక WWDC కార్యక్రమంలో iOS 17, iPadOS 17, macOS 14, watchOS 14, tvOS 17 వంటి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, కొత్త ఫీచర్లు ఆవిష్కరించబడతాయి. ఈ సంవత్సరం ఈ కార్యక్రమంలో ఆపిల్ తొలి రియాలిటీ ప్రో హెడ్‌సెట్ లాంచ్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ హెడ్‌సెట్ లాంచ్ కొత్త సాఫ్ట్‌వేర్ ఫ్లాట్‌ఫాం మరియు డెవలపర్ టూల్స్‌తో సమానంగా ఉండనుంది.
వీటితో పాటు ప్రస్తుతం ఆపిల్ 15 అంగుళాల మాక్‌బుక్ ఎయిర్‌పై పనిచేస్తుంది. ఈ WWDC కార్యక్రమంలో దీనిని ప్రకటించే అవకాశం ఉంది.
ఆపిల్ ఇప్పటికే తన ఉత్పత్తులు M2, M2ప్రో మరియు M2 మ్యాక్స్ చిప్‌లను విడుదల చేసింది. మ్యాక్‌బుక్ 15in ఈ సంవత్సరం తిరిగి వచ్చే అవకాశం ఉంది. సుమారు రెండు వేరియంట్లలో ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అందులో ఒకటి M2 చిప్, మరొకటి ప్రీమియం M2 ప్రోతో రానుందని సమాచారం.
అయితే ఈ మోడల్‌ను ఎలా పిలుస్తారనేది చర్చ జరుగుతుంది. M2 ప్రో డివైజ్‌కు అధునాతన కూలింగ్ టెక్నాలజీతో రానుందని తెలుస్తోంది. ప్రస్తుత మ్యాక్‌బుక్ ఎయిర్‌లో ఫ్యాన్ కూడా లేదు. అందువల్ల ఈ మోడల్ రీ డిజైన్ అని అర్థం చేసుకోవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








