Home
News

యాపిల్ లవర్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. ఒకేసారి ఐదు అదిరిపోయే ప్రొడక్ట్స్ లాంచ్!

Apple: ఫోన్లు, ఇయర్‌బడ్స్, ట్యాబ్స్‌, కంప్యూటర్లు, వాచ్‌లు.. ఇలా చెప్పుకుంటూ పోతే యాపిల్ ప్రొడక్ట్స్ చాలానే ఉన్నాయి. టెక్నాలజీ ప్రపంచాన్ని ఏలేస్తున్న ఈ దిగ్గజం, యూజర్లను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది. అయితే, యాపిల్ కంపెనీ 2025లో బ్లాక్ యూనిటీ స్పోర్ట్ లూప్ బ్యాండ్ మినహాయించి ఇప్పటివరకు పెద్దగా కొత్త ప్రొడక్ట్స్ ఏమీ విడుదల చేయలేదు. కానీ వచ్చే నెలలోనే ఏకంగా ఐదు కొత్త ప్రొడక్టులను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అవేవో చూద్దాం.

* దుమ్ము రేపే ఫీచర్లతో ఐఫోన్ SE 4..

మార్చి-మే మధ్యలో లాంచ్ కానున్న ప్రొడక్ట్స్‌లో అసలైన హైలైట్ మాత్రం ఐఫోన్ SE 4 అనే చెప్పాలి. 2016లో SE సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంత పెద్ద అప్‌గ్రేడ్ ఎప్పుడూ రాలేదు. ఈ ఫోన్‌లో హోమ్ బటన్‌ను తీసేసి, ఐఫోన్ 14 లాంటి సరికొత్త డిజైన్‌తో తీసుకొస్తున్నారు. అలాగే క్వాల్‌కామ్ మోడెమ్స్‌కు గుడ్‌బై చెప్పేయనున్నారు.

Apple s Next Month Releases  5 Products You Can t Miss

యాపిల్ సొంతంగా తయారు చేసిన మోడెమ్‌తో రాబోతున్న మొట్టమొదటి ఐఫోన్ ఇదే. అంతేకాదు, ఛార్జింగ్ కోసం లైట్నింగ్ పోర్ట్ బదులు USB-C పోర్ట్‌ను కూడా పెట్టేస్తున్నారు. పేరు కూడా మార్చే ఆలోచనలో ఉన్నారంట, ఐఫోన్ SE 4 బదులు ఐఫోన్ 16E అని పిలుస్తారేమో.

* అదిరిపోయే ఫీచర్లతో ఐప్యాడ్ 11

యాపిల్ ఐప్యాడ్ లైనప్‌లో తక్కువ ధరలో లభించే ఐప్యాడ్ 11కి కూడా అప్‌డేట్ రాబోతోంది. దీనికి అప్‌డేట్ వచ్చి రెండేళ్లకు పైగా అయింది. ఈ కొత్త ఐప్యాడ్‌లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే, యాపిల్ ఇంటెలిజెన్స్ (యాపిల్ AI ఫీచర్లు) సపోర్ట్ చేస్తుంది. దీని ఫలితంగా పాటు స్టూడెంట్స్ చాలా ప్రయోజనాలు అందుకోనున్నారు.

డిజైన్‌లో మాత్రం పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు, ఎందుకంటే లాస్ట్ అప్‌డేట్‌లో కొత్త లుక్ వచ్చింది. కానీ స్పీడ్ మాత్రం అదిరిపోతుంది. ఐప్యాడ్ 11లో ఐఫోన్ 15 ప్రోలో వాడిన A17 ప్రో చిప్‌ను పెడుతున్నారట. ఇదే జరిగితే గేమ్స్‌తో పాటు మల్టీ టాస్కింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. అంతేకాదు ఇది ఎక్కువ సంవత్సరాలు ఉపయోగకరంగా ఉంటుంది.

* మ్యాక్‌బుక్ ఎయిర్ M4

కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ కూడా వస్తోంది, అది కూడా M4 చిప్‌తో కావడం విశేషం. మ్యాక్‌బుక్ ఎయిర్‌లో రీసెంట్‌గా M2, M3 మోడల్స్‌లో 16GB RAM అప్‌గ్రేడ్ చేశారు. ఈసారి మాత్రం పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ పెట్టారు. బ్లూమ్‌బెర్గ్ రిపోర్టర్ మార్క్ గుర్మాన్ ప్రకారం, ఈ ల్యాప్‌టాప్ మార్చి-మే కంటే ముందే రిలీజయ్యే ఛాన్స్ ఉందంట.

కెమెరా కూడా బాగుంటుందని అంటున్నారు, లేటెస్ట్ మ్యాక్‌బుక్ ప్రోస్‌లో ఉన్న సెంటర్ స్టేజ్ ఫీచర్ లాంటిది పెడతారేమో చూడాలి. యాపిల్‌ నుంచి బెస్ట్, పవర్ ఫుల్ ల్యాప్‌టాప్‌ కోరుకునే వారు దీన్ని అస్సలు మిస్ చేసుకోకూడదు. కంటెంట్ క్రియేషన్ నుంచి ప్రొఫెషనల్ వర్క్స్ వరకు అన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది.

* M3 ఐప్యాడ్ ఎయిర్

ఐప్యాడ్ ఎయిర్‌కి కూడా అప్‌డేట్ వస్తోంది. ఈ మోడల్‌లో M3 చిప్‌ను పెడుతున్నారు, దాని వల్ల పర్ఫార్మెన్స్ మరింత మెరుగుపడుతుంది. అంతేకాదు, ఈ ఐప్యాడ్ ఎయిర్ కోసం కొత్త మ్యాజిక్ కీబోర్డ్‌ను కూడా యాపిల్ రిలీజ్ చేయొచ్చు. చాలా శక్తివంతమైన పర్ఫామెన్స్ గల ట్యాబ్లెట్ కావాలనుకునే వారికి ఇదే మంచి ఆప్షన్ అవుతుంది.

* యాపిల్ స్మార్ట్ హోమ్ డిస్‌ప్లే

యాపిల్ ఫస్ట్ టైమ్ స్మార్ట్ డిస్‌ప్లేను లాంచ్ చేస్తోంది. ఇది హోమ్‌పాడ్ లాగే పనిచేస్తుంది, కానీ స్క్రీన్‌తో వస్తుంది. దీనిలోనూ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉంటాయి. స్క్రీన్ సైజ్ దాదాపు 7 అంగుళాలు ఉంటుందంట, దీన్ని గోడకు తగిలించుకోవచ్చు, స్పీకర్లకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. యాపిల్ స్మార్ట్ హోమ్ ప్రొడక్ట్స్‌లో డిస్‌ప్లేతో వస్తున్న ఫస్ట్ ప్రొడక్ట్ ఇదే.

* ఇంకా చాలా ఉన్నాయ్

ఇవే కాకుండా, కొత్త ఎయిర్‌ట్యాగ్ కూడా రాబోతోంది, దీనిలో బెటర్ అల్ట్రా-వైడ్‌బ్యాండ్ చిప్‌సెట్ ఉంటుందని టాక్. మ్యాక్ స్టూడియో, మ్యాక్ ప్రో మాత్రం ఈ మార్చి - ఏప్రిల్ నెలల్లో రావట్లేదు, అవి మిడ్-2025లో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. వాటి కోసం కూడా యాపిల్ యూజర్లు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇంకా iOS 18.4 అప్‌డేట్ కూడా మార్చిలో రావచ్చు. WWDC24లో అనౌన్స్ చేసిన యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఫైనల్‌గా ఈ అప్‌డేట్‌లో యాడ్ చేస్తారు. సిరి కూడా మరింత స్మార్ట్ అవుతుంది. దీనివల్ల యాపిల్ యూజర్లందరూ కూడా చాలా ప్రయోజనాలు పొందుతారు. వారి యూజర్ ఎక్స్‌పీరియన్స్ పెరుగుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple is expected to launch five new products this Spring: iPhone SE 4 with a new design and USB-C, iPad 11 with Apple Intelligence, MacBook Air M4, iPad Air M3, and a Smart Home Display.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X