ఆపిల్ సిఈవోకి అత్యధిక పారితోషకం

2011వ సంవత్సారనికి గాను ప్రపంచంలో అత్యధిక జీతం తీసుకునే ఉద్యోగిగా ఆపిల్ కంపెనీ సీఈవో 'టిమ్ కుక్' చరిత్ర సృష్టించాడు. టిమ్ కుక్‌కి
ఆపిల్ చెల్లించే 1మిలియన్ స్టాక్ యూనిట్స్‌ని ప్రస్తుత ధర మార్కెట్లో సుమారుగా $378 మిలియన్లు. ఐతే ఈ స్టాక్స్‌ని ఆపిల్ 2016 ఆగస్టులో కొంత చెల్లించగా, మిగిలిన సగ భాగాన్ని 2021 ఆగస్టులో చెల్లించనున్నట్లు ప్రెస్ ఓ కధనంగా ప్రచురించింది.
ఫెర్పామెన్స్ బోనస్, జీతం రెండూ కలగలుపుకోని టిమ్ కుక్‌కి $900,000 రానుంది. ఇందులో టిమ్ కుక్ రిటైర్‌మెంట్ ఎకౌంట్‌కి $16,520 చెల్లిస్తుండడం విశేషం. ఆపిల్ మాజీ ఛైర్మన్, కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ బ్రతికున్న సమయంలో సంవత్సరానికి గాను $1 తీసుకోగా, స్టీవ్ జాబ్స్‌కు సొంతంగా 5.5 మిలియన్ షేర్స్‌ని కలిగి ఉన్నాడు.
వీటన్నింటిని కలగలుపుకుంటే స్టీవ్ జాబ్స్ కేవలం $580 మిలియన్ల విలువ చేసే13,754 రెగ్యులర్ షేర్స్ కలిగి ఉన్నాడు. ఇక 2010వ సంవత్సరానికి గాను అత్యధిక జీతాన్ని తీసుకున్న వయాకామ్ ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫిలిప్ డామన్ ఈ సంవత్సరం $84.5 మిలియన్లను కలిగి ఉన్నాడు. టిమ్ కుక్ ప్యాకేజిని గమనించినట్లేతే 2010వ సంవత్సరంలో మొదటి తొమ్మిది మంది ప్యాకేజిలతో సమానం. ఈ విషయంపై ఆపిల్ స్పందిస్తూ టిమ్ కుక్ గతంలో ఛీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ సేవలను విజయవంతంగా నిర్వహించడమే కాకుండా ఆపిల్ అభివృద్దికి తనదైన సహాకారాన్ని అందించారని అన్నారు.


Click it and Unblock the Notifications








