ఆపిల్ ఐఫోన్ 4ఎస్ 'సిరి' ప్రకటనలు అధ్బుతం

Posted By: Prashanth

ఆపిల్ ఐఫోన్ 4ఎస్ 'సిరి' ప్రకటనలు అధ్బుతం

 

ట్రెడిషనల్ ఎడ్వర్టైజ్‌మెంట్స్‌, సంప్రదాయానికి ఆపిల్ పెట్టింది పేరు. మొట్ట మొదటి సారి తాత వారి యొక్క మనవడుని చూసుకుంటే ఎంత అనుభూతిని పొందుతారో.. ఆపిల్ ప్రకటనలు చూసే ప్రతి ఒక్కరూ అలాంటి అనుభూతినే పొందుతారు. స్టీవ్ జాబ్స్ మరణాంతరం ఆపిల్ కంపెనీ విడుదల చేసిన 'ఐఫోన్ 4ఎస్'‌లో ఉన్న కొత్త ఫీచర్ "సిరి" మీద విడుదల చేసిన రెండు టివి ప్రకటనలు ఆపిల్‌కు కొత్త ఊతాన్నిస్తున్నాయి.

సిరి ఫీచర్ మీద ఆపిల్ రెండు ప్రకటనలు విడుదల చేసింది...

* రాక్ గాడ్

* రోడ్ ట్రిప్

రాక్ గాడ్: ఓ సంగీతకారుడు కొత్త గిటార్ కనుగొనేందుకు సాంగ్‌ని ప్లే చేసి, టెక్ట్స్ మేసేజ్ ద్వారా తన యొక్క బ్యాండ్ మేట్స్‌ని కనుకుక్కోవడానికి ఈ పరికరాన్ని ఉపయోగిస్తాడు. ఈ ప్రకటనను చూసిన చిన్న పిల్లాడు కూడా సిరి ఉపయోగం ఏమిటో వివరించ కలిగే సత్తా ఉంటుంది.

రోడ్ ట్రిప్: ఐఫోన్ 4ఎస్‌లో ఉన్న సిరిని ఉపయోగించి ట్రావెలర్స్‌కి తమ ఏరియాలో ఏమైనా ప్రమాదాలు జరిగినప్పడు గ్యాస్‌ని కోనుగొనడానికి, జిపిఎస్ ఐఫోన్ 4ఎస్‌లో ఏ విధంగా ఉపయోగించువచ్చో దీని ద్వారా తెలుస్తుంది.

ఈ రెండు ప్రకటనలను చూడాలనుకునే పాఠకులు

http://www.youtube.com/watch?v=-UpmQN55q2g&feature=player_embedded

http://www.youtube.com/watch?v=-G8fG1bKgQo&feature=player_embedded లింక్స్ ద్వారా యూట్యూబ్‌లో చూడొచ్చు.

ఆపిల్ కంపెనీ టెక్నాలజీకి మానవీతను జోడించి ఈ రెండు ప్రకటనలను చిత్రీకరించిన తీరు అధ్బుతం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot