UPI ఆన్‌లైన్ పేమెంట్ లతో మోసపోతున్నారా? ఈ తప్పులే కారణాలు అయిఉంటాయి

|

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ లేదా UPI అనేది ప్రస్తుత రోజులలో ఆన్‌లైన్ పేమెంట్ల కోసం వినియోగిస్తున్న మరియు అత్యంత ప్రాచుర్యం పొందిన పేమెంట్ మోడ్‌లలో ఒకటి. UPI అనేక మంది వాటాదారులతో పాటుగా వివిధ ఆర్థిక సంస్థలతో కలిసి పని చేస్తుంది. పేమెంట్ ప్రక్రియని UPIని మరింత సౌలభ్యంగా మార్చింది. కాకపోతే ప్రజాదరణ పెరగడంతో పాటుగా మోసాలు మరియు స్కామ్‌లకు కూడా అవకాశం మరింత పెరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా UPI వినియోగదారులకు సంబంధించిన అనేక స్కామ్‌లు వెలుగులోకి వచ్చాయి. అటువంటి స్కామ్‌లు UPI పేమెంట్ కి శాపంగా మారుతున్నది. డబ్బును చెల్లించడానికి లేదా స్వీకరించడానికి UPIని ఉపయోగిస్తున్నప్పుడు మోసం జరిగే అవకాశాలను తగ్గించడానికి ఎలాంటి నియమాలను పాటించాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

తెలియని నెంబర్ల పట్ల జాగ్రత్త వహించండి

తెలియని నెంబర్ల పట్ల జాగ్రత్త వహించండి

మీకు తెలియని లేదా అనుమానాస్పదంగా ఉన్న నంబర్ ను గుర్తించినట్లయితే కనుక దానికి పేమెంట్లను చేయడం లేదా స్వీకరించడం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. మీరు ప్రత్యేకంగా ఓపెన్ వెబ్ సోర్స్‌లలో షేర్ చేయబడిన ఫోన్ నంబర్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు ఆన్ లైన్ లో ఆహారం లేదా పానీయాలను పొందడానికి వాటి యొక్క అవుట్‌లెట్‌ల ఫోన్ నంబర్‌లతో పేమెంట్ ని కొనసాగించే ముందు దానిని ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయడం ఎల్లప్పుడూ ఉత్తమమైన పద్ధతి.

డబ్బును స్వీకరించడానికి ఎప్పుడూ పిన్‌ని ఉపయోగించకండి

డబ్బును స్వీకరించడానికి ఎప్పుడూ పిన్‌ని ఉపయోగించకండి

మోసాలు లేదా స్కామ్‌లు జరిగినట్లు వచ్చే ఫిర్యాదులలో మొదటి స్థానంలో ఈ విధానం ఉంటుంది. డబ్బును స్వీకరించడానికి బ్యాంక్ మీ పిన్‌ను ఎప్పటికీ అడగదు అని గుర్తుంచుకోండి. మోసగాళ్లు మాత్రమే ఇటువంటి విధానాన్ని అనుసరిస్తారు. వీరు డబ్బును పంపుతామని వాగ్దానం చేస్తూ ఈ విధానాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తారు. వారు చివరికి డబ్బును అంగీకరించడానికి వారి పిన్‌ను నమోదు చేయమని రిసీవర్‌ని అడుగుతారు. ఇటువంటి సందర్భంలో మీరు పిన్‌ని నమోదు చేస్తే కనుక వారి ఉచ్చులో పడి మీ యొక్క మొత్తం డబ్బును కోల్పోతారు.

తక్కువ వ్యాలిడిటీతో OTT ప్రయోజనాలతో లభించే జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే...తక్కువ వ్యాలిడిటీతో OTT ప్రయోజనాలతో లభించే జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే...

యాదృచ్ఛిక పేమెంట్ రిక్వెస్ట్

యాదృచ్ఛిక పేమెంట్ రిక్వెస్ట్

UPI అప్లికేషన్‌లు నిర్దిష్ట UPI IDల నుండి పేమెంట్ రిక్వెస్ట్లను ట్రాక్ చేసే స్పామ్ ఫిల్టర్‌ని కలిగి ఉన్నాయి. మీకు అలాంటి నోటిఫికేషన్ వస్తే కనుక మరింత జాగ్రత్తగా ఉండాలి. అవతలి వ్యక్తి మోసగాడు కాదని మీకు 100 శాతం ఖచ్చితంగా తెలిస్తే మాత్రమే అటువంటి పేమెంట్ ని కొనసాగించండి. మీరు 'పే' లేదా 'డిక్లైన్' ఎంపికను పొందుతారు. కావున మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా మీరు 'డిక్లైన్' ఎంపికను క్లిక్ చేయాలి అని గుర్తుంచుకోండి.

ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన కొన్ని ప్రాథమిక విషయాలు

ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన కొన్ని ప్రాథమిక విషయాలు

** అపరిచితుల వద్ద ఎట్టిపరిస్థితులలోనూ మీ పిన్‌ను బహిర్గతం చేయరాదు.

** యాంటీ-వైరస్ మరియు బయోమెట్రిక్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉంచండి.

** తెలియని సోర్స్ నుండి వచ్చే ఇమెయిల్‌లు లేదా లింక్‌లను ఓపెన్ చేయకపోవడం అన్ని వేళల మంచిది.

** మీ వివరాలను మీ బ్యాంక్‌తో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం ఉత్తమం.

** పేమెంట్ చేస్తున్న సమయంలో మీరు విశ్వసించే సురక్షిత WiFi కనెక్షన్‌లను మాత్రమే ఉపయోగించండి.

** మీ ఆర్థిక లావాదేవీలు మరియు బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్‌లను ట్రాక్ చేస్తూ మీ అకౌంటులో అనుమానాస్పద ప్రవర్తనపై నిఘా ఉంచండి.

 

Best Mobiles in India

English summary
Are you Cheating With UPI Online Payments? These Mistakes are The Main Reasons

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X