అలెక్సా రోబో వచ్చేస్తోంది, నేరుగా మీ దగ్గరకే

By Gizbot Bureau
|

అమెజాన్‌ కంపెనీకి చెందిన వాయిస్‌ అసిస్టెంట్‌ 'అలెక్సా గురించి అందరికీ తెలిసిందే. దీని సేవలు ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయ్యాయి. గూగుల్‌ అసిస్టెంట్‌ తరహాలో 'వాయిస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ’తో పనిచేసే అలెక్సా మనకు నచ్చిన పాటను ఇంటర్నెట్‌ నుంచి వెతికి వినిపించడమే కాకుండా ఆటోమేషన్‌ ద్వారా మన ఇంట్లోని టీవీలను, ఫ్యాన్లను, లైట్లను కంట్రోల్‌ చేస్తోంది.

అలెక్సా రోబో వచ్చేస్తోంది, నేరుగా మీ దగ్గరకే

కూర్చున్న చోటు నుంచి లేవకుండానే అలెక్సాకు ఆదేశాలు జారీ చేయడం ద్వారా టీవీలు, ఫ్యాన్లు, లైట్లను ఆన్‌, ఆఫ్‌ చేయవచ్చు. ఇంకా ఎన్నో రకాల సేవలను అమెజాన్ అలెక్సా అందిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అమెజాన్ సరికొత్త టెక్నాలజీతో దాన్ని రోబో రూపంలో ముందుకు తీసుకురాబోతోంది.

అలెక్సా రోబో

అలెక్సా రోబో

అమెజాన్‌ కంపెనీ మన నడుము ఎత్తుగల అలెక్సా రోబోను తయారు చేస్తోందని, దీనికి ఇంజనీర్ల సాయం కూడా తీసుకుంటోందని ‘బ్లూమ్‌బెర్గ్‌ డాట్‌ కామ్‌' వెబ్‌సైట్‌ వెల్లడించింది. దీనికి ‘వెస్టా' అని కూడా నామకరణం చేసిందట.

వీల్స్‌ మీద ప్రయాణించే సౌదుపాయం

వీల్స్‌ మీద ప్రయాణించే సౌదుపాయం

దీనికి వీల్స్‌ మీద ప్రయాణించే సౌదుపాయం ఉంటుంది. వాయిస్‌ కమాండ్‌ ద్వారా అది ఎక్కడ ఉన్న దాన్ని మన దగ్గరికి పిలుచుకోవచ్చు. అంటే ఇంటి ముందుకు, పెరట్లోకి దాని పిలిపించుకొని దాని సేవలు వినియోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

నడుము ఎత్తు రోబో అవసరమా

నడుము ఎత్తు రోబో అవసరమా

అయితే వినియోగదారుల నుంచి దీనిపై అనేక సెటైర్లు వినిపిస్తున్నాయి. అరచేతిలో అమరే ‘అలెక్సా'ను ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లే సౌకర్యం ఉన్నప్పుడు ఎందుకు నడుము ఎత్తు రోబోను తయారు చేయడం అన్న ప్రశ్న కూడా వినియోగదారులకు తలెత్తుతోంది.

ప్రైవసీకి భంగం

ప్రైవసీకి భంగం

ఇంట్లో మనం మాట్లాడుకునే ప్రతి మాటను అలెక్సా లాంటి వాయిస్‌ అసిస్టెంట్లు రికార్డు చేస్తున్నాయని, వాటి వల్ల ఇంట్లోని మనుషులకు ప్రైవసీ లేకుండా పోతోందని వారు ఆరోపిస్తున్నారు. అలెక్సాను రోబో స్థాయికి తీసుకెళ్లినప్పుడు అందులో వేరే విశేషాలు ఏవో ఉండనే ఉంటాయని ‘అమెజాన్‌' వినియోగదారులు ఆశిస్తున్నారు.

యువతి ప్రాణాలు కాపాడిన అలెక్సా

యువతి ప్రాణాలు కాపాడిన అలెక్సా

ఇదిలా ఉంటే అలెక్సా.. ప్లే మ్యూజిక్‌, అలెక్సా వాట్స్‌ వెదర్ టుడే? అలెక్సా వాట్స్ మై క్యాలెండర్‌ టుడే? అని వాయిస్‌ తో అడిగితే సమాధానం ఇచ్చే అమెజాన్‌ అలెక్సా.. ఏకంగా ఓ యువతిని ప్రాణాపాయం నుంచి రక్షించింది. ఈ ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. మెక్సికోలో తన ప్రియురాలు ఎవరితోనూ ఫోన్‌ లో మాట్లాడుతున్నట్లు గమనించిన ప్రియుడు.. ఆమె తనను మోసం చేస్తుందని.. ఆమెను చావబాదాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేని యువతి గట్టిగా ఏడ్చింది. వాయిస్‌ విన్న అలెక్సా.. వెంటనే పోలీసులకు ఆటోమేటిక్‌ ఫోన్‌ చేసింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్న ఖాకీలు.. సదరు యువకుడిని అరెస్ట్ చేశారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు.

Best Mobiles in India

English summary
Are You Ready For an Alexa Robot to Follow You Around?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X