BHIM UPIని ఉపయోగించి UAE లో కూడా మీరు కొనుగోలు చేయవచ్చు!!

|

మీరు తరచూ UAEకి ప్రయాణిస్తున్నారా? అయితే మీ కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక శుభవార్తను అందిస్తోంది. ఇది మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. NPCI యొక్క అంతర్జాతీయ ఆర్మ్ NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL) ఇప్పుడు BHIM UPI ని ప్రారంభించింది. ఈ BHIM UPI ఇప్పుడు UAE అంతటా ఉన్న NEOPAY టెర్మినల్స్‌లో అందుబాటులోకి వచ్చినట్లు ప్రకటించింది. ఈ కొత్త అప్‌డేట్‌తో UAEకి తరచూ ప్రయాణించే భారతీయ పౌరులందరూ BHIM UPIని ఉపయోగించి తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయగలరు.

NEOPAYతో

"UAEకి ప్రయాణించే మిలియన్ల మంది భారతీయులకు BHIM UPIని ఉపయోగించి సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా చెల్లింపులు చేయవచ్చు" అని సంస్థ తెలిపింది. NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL) మష్రెక్ బ్యాంక్ యొక్క పేమెంట్ అనుబంధ సంస్థ NEOPAYతో భాగస్వామ్యం కలిగి ఉండడంతోనే భారతీయ పౌరులు BHIM UPIని ఉపయోగించి ఆ దేశంలో UPI పద్దతిలో చెల్లింపులు చేయగలుగుతున్నారు.

UAE లో BHIM UPI ఆధారిత పేమెంట్స్

UAE లో BHIM UPI ఆధారిత పేమెంట్స్

BHIM UPI ఆధారంగా ఇప్పుడు UAE అంతటా పేమెంట్స్ చేయడానికి వినియోగదారులకు అనుమతిస్తుంది. కాకపోతే ఈ సర్వీస్ కేవలం NEOPAY టెర్మినల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది అని గమనించాలి.

"NEOPAYతో కొత్తగా భాగస్వామ్యం కుదరడంతో UAEలో BHIM UPI అందుబాటులోకి రావడాన్ని మేము సంతోషిస్తున్నాము. దీనితో భారతీయ పౌరులకు ఇష్టమైన పేమెంట్ విధానంగా ఉద్భవించిన BHIM UPIని ఉపయోగించి భారతీయ పర్యాటకులు అన్ని రకాల పేమెంట్స్ చేయడానికి వీలు కల్పిస్తుంది"అని NIPL CEO రితేష్ శుక్లా ఈ సందర్భంగా అన్నారు.

 

UAE లో BHIM UPI ఫీచర్ ఎలా పనిచేస్తుంది

UAE లో BHIM UPI ఫీచర్ ఎలా పనిచేస్తుంది

UAE లో BHIM UPI ఫీచర్ ని ఉపయోగించడం అనేది చాలా సులభం. ఇందుకోసం వినియోగదారులకు భారతదేశంలో రిజిస్టర్ చేయబడిన బ్యాంక్ అకౌంట్, UPI కనెక్టివిటీ మరియు దేశంలో పేమెంట్స్ చేయడానికి వినియోగదారులు ఉపయోగించగల UPI ఆధారిత యాప్ అవసరం అవుతుంది. కొత్త భాగస్వామ్యంతో NEOPAY టెర్మినల్స్ పేమెంట్స్ మొత్తాన్ని రూపాయిలలో మారుస్తూ వినియోగదారుల నుండి వసూలు చేస్తాయి.

మరొక దేశంలో UPI ఆధారిత చెల్లింపులు

మరొక దేశంలో UPI ఆధారిత చెల్లింపులు

ఇండియాలో కాకుండా మరొక దేశంలో UPI ఆధారిత చెల్లింపులు ప్రారంభించడం ఇది మొదటిసారి కాదు. గత ఏడాది జూలైలో భారతదేశం యొక్క BHIM UPIని ప్రపంచంలోనే మొదటిసారి భూటాన్ లో ప్రారంభం అయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు భూటాన్ కౌంటర్ లియోన్‌పో నామ్‌గే షెరింగ్ సంయుక్తంగా ఈ సర్వీసును వర్చువల్‌ పద్దతిలో ప్రారంభించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నేపాల్ సరిహద్దుల్లో కూడా డిజిటల్ చెల్లింపులను పెంచడానికి BHIM UPI ఇంటర్‌ఫేస్‌ను స్వీకరించింది. సింగపూర్ కూడా గత సంవత్సరం ఈ ప్లాట్‌ఫారమ్‌ను స్వీకరించినప్పటికీ కూడా 2022 నుంచి పనిచేస్తోంది.

Best Mobiles in India

English summary
Are You Travelling to UAE? Now You Can Pay For Your Purchases Using BHIM UPI

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X